ముగ్దమనోహరి
ఆకుపచ్చని చీరలో
సౌందర్య మనోహరి
కొప్పునిండా మరుమల్లియలు
నడిచొచ్చే రంగుపూల రాగమయి
పచ్చదనం చిగురింతల ప్రకృతిలో
శ్రమల సొగసరి చిన్నదానా
ముస్తాదుతో తాడిచెట్ల నెక్కి
నీ మావ గీసిన కల్లు
తలపై చేతిలో మట్టికుండలు గుండ్రనివి
తోడ్కొని వచ్చే
తొలకరి యవ్వనం పూసిన సొగసరీ
సాయంసంధ్య గూడాని కేతెంచే
గుమ్మయిన గువ్వపిట్ట రూపసీ
నీవు అమ్మే కల్లు ప్రియులు
నీ అందానికి దాసోహమయ్యి
కల్లు నెపంతో నిన్ను చూసేందుకైనా
నీ ఇంటికేతెంచేరు
గుబురు మీసాల మగరాయుళ్లు
నీవు సంపెంగపూవులా వగలుపోతూ
వడ్డించే కల్లు నిషాలో
నీ అందాలు వర్ణించే యువకులు
మితిమీరితే కండపుష్టి నీ మావ
సరదా మాటలతో మెడలుబట్టి
నెట్టివేయు నీ గుడిసెనుండి
అందాల భరిణ
నీ సొగసుకు కాపలా నీ మావ
అయినా గులాములెందరో,,,,!!
అపరాజిత్
సూర్యాపేట