విద్యార్థి లోకమెల్లను
విద్యాలయ ప్రాంగణమున విహరించుచునే
మద్యపు మత్తున గురులను
విద్యాశాఖను తెగడిరి వెరవక కృష్ణా!!
విద్యాకేంద్రములందున
విద్యార్థులు మందు ద్రావి విలువలు త్రుంచన్
విద్యార్థుల చేష్టలు గని
విద్యావేత్తలకు భయము వేసెను కృష్ణా!!
ఎల్లలు నెరుగని బాలలు
కల్లలు లేని హృదయములు కలిసియు తిరుగన్
మల్లెలు పూసిన చెలిమికి
పల్లెలు ప్రాచుర్యమందె పదరా కృష్ణా!!
గడ్డం కృష్ణారెడ్డి!సూర్యాపేట!