ప్రేమించిన ప్రేమించుము
ప్రేమను ద్వేషించిన యెడ ద్వేషించకుమా!
ప్రేమను బంచుచు బోవన్
ప్రేమికులుగ నిలుచు చుంద్రు పృథ్విని కృష్ణా!!
చెట్టున రాలిన పువ్వులు
పట్టి యతుక లేరునెవరు ప్రాయత్నమునన్
పట్టున నిలిచిన కొమ్మన
పుట్టును విరులెల్ల దిరిగి పొదలుగ కృష్ణా!!
వీణాపాణివియమ్మా
వాణీ! విద్యా కలశము వసుధకు తెమ్మా!
బోణీచేయమ్మా మా
వాణిన్ సరిదిద్దు చుండి వరముల నిమ్మా!!
-గడ్డం కృష్ణారెడ్డి.
రేపాల సూర్యాపేట!!