కం!!💐🪷

పూరీలు వడలు గారెలు
బూరెలు బజ్జీలు దోశ పూర్ణములెల్లన్
దారకు వడ్డించుచు మన
సారా సేవింతు నేను సతతము భక్తిన్

పారావారము దాటియు
నారీమణి సీతను గొనినట్టి ఘనుండౌ
శ్రీరాముని విడువక మన
సారా సేవింతు నేను సతతము భక్తిన్!!

శ్రీరామా శ్రీరామా
శ్రీరామా యంచు పిలువ శ్రేయంబనగన్
శ్రీరాముని ప్రతిమను మన
సారా సేవింతు నేను సతతము భక్తిన్!!

గడ్డం కృష్ణారెడ్డి రేపాల సూర్యాపేట!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *