కం!!🪷🪷🪷

కం!!🪷🪷🪷

కం!!🪷🪷🪷

పర వనితల చెర బట్టుచు
పరమాత్ముని పూజ సేయ పాపములంటున్!!
తరతమ భేదము జూపక
పర వనితల గాచిన యెడ పరమాత్ముడగున్!!!

తెరవెనుక తప్పు జేయుచు
పరమాత్ముని పూజ సేయ పాపములంటున్!!
నిరుపేదల నాదుకొనిన
పరమాత్ముండె దిగివచ్చు వసుధకు కృష్ణా!

చిరకాలపు రుజలు తరుగు
పరమాత్ముని పూజ సేయ; పాపములంటున్
పరమాత్ముని దూషించిన
చెరసాలను చేరుచుండు చివరకు కృష్ణా!!

గడ్డం కృష్ణారెడ్డి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *