కం!!🪷🪷
కనులారగాంచి వైరుల
కనుగొన వచ్చును రణమున, కనుగొనలేమే
మనచుట్టూరను తిరుగుచు
మన కీడును గోరు జనుల మహిలో కృష్ణా!!
తే!!గీ!!🐅🦁🐯
స్వార్థ చింతన వీడుచు సహకరించు
ధర్మ రక్షణ చేయంగ దండు గట్టు
దుష్ట దుర్మార్గులను ద్రుంచ కష్టమనక
కదలిరండి హిందువులార కదము ద్రొక్కి!!
గడ్డం కృష్ణారెడ్డి