కనుమరుగవుతున్న బంధాలు – పరిష్కార మార్గాలు
నేటి సమాజంలో మనుషుల మధ్య బంధాలు క్రమంగా దూరమవుతున్నాయి. ఒకప్పుడు కుటుంబ సభ్యులు, బంధువులు, పొరుగువారు పరస్పరం ఆప్యాయతతో కలిసి జీవించేవారు. కానీ నేడు సాంకేతికత పెరగడంతో పాటు సమయాభావం వలన మనుషుల మధ్య సంబంధాలు తగ్గిపోతున్నాయి. మొబైల్ ఫోన్లు, సోషల్ మీడియా, ఉద్యోగ ఒత్తిడులు, వ్యక్తిగత స్వార్థం వంటి కారణాల వల్ల బంధాలు కనుమరుగు అవుతున్నాయి.
బంధాలు బలహీనం అవటానికి అనేక కారణాలు
ఉన్నాయి.కుటుంబ సభ్యులతో మాట్లాడటం కంటే ఫోన్లలో గడిపే సమయం ఎక్కువైంది.
పని ఒత్తిడులు, నగర జీవనం వల్ల కుటుంబానికి సమయం కేటాయించలేక పోతున్నారు.
“నేను – నాది” అనే ఆలోచన పెరగడం వల్ల పరస్పర సహకారం తగ్గింది.
చిన్న కుటుంబాల పెరుగుదలతో బంధుత్వ విలువలు తగ్గుతున్నాయి.
అహంకారం మరియు అపార్థాలు వలన కూడా చాలా వరకు సంబంధాలు దెబ్బతింటున్నాయి.
కుటుంబ సభ్యులతో ప్రతిరోజూ మాట్లాడటం, కలిసి భోజనం చేయడం వంటి అలవాట్లు పెంపొందించడం వలన
బంధాలు బలపడే
అవకాశం ఉంది.
పెద్దలను గౌరవించాలి. చిన్నవారిని ప్రేమగా
పలకరించాలి.
మొబైల్ మరియు సోషల్ మీడియా వినియోగాన్ని పరిమితం చేయాలి.
అపార్థాలను చర్చల ద్వారా పరిష్కరించుకోవాలి.
కుటుంబ విలువలను పిల్లలకు నేర్పాలి – ప్రేమ, మానవత్వం, సహకారం వంటి విలువలను చిన్నప్పటి నుంచే బోధించాలి.
బంధాలు మన జీవితానికి బలమైన ఆధారం. డబ్బు, స్థానం, సాంకేతికత అన్నీ ఉన్నా, మనసుకు ఆనందం ఇచ్చేది ప్రేమతో కూడిన బంధాలే. అందుకే ప్రతి వ్యక్తి సంబంధాలను కాపాడేందుకు కృషి చేయాలి. పరస్పర ప్రేమ, గౌరవం, సహకారం ఉంటే బంధాలు ఎప్పటికీ కనుమరుగుకావు.
వెంకట భాను ప్రసాద్ చలసాని