కనుమరుగవుతున్న బంధాలు
శృతి అయ్యగారింటికి చేరి పద్దెనిమిది సంవత్సరాలయింది…
అందరూ తనని అయ్యగారింటి అమ్మాయి అంటారు..
ఒకరోజు అయ్యగారు వేణు శర్మ గుడిలో పూజ ముగించి
ఇంటికి వస్తుంటె రోడ్డు పక్కన పిల్ల ఏడుపు వినిపించింది
బండి ఆపి ఎవరా అని చూస్తె అప్పుడే పుట్టిన పసికందు
అయ్యెా!!అయ్యెా!!!ఎంతపచారం???
ఏ వెధవలు ఇలా చేసారో!ఏమిటో!!అని చుట్టుపక్కలంతా చూసాడు..
ఎవరూ లేరు…
ఏం చేయాలో అర్థం కాలేదా పూజారికి….
అపచారం అపచారం ఎలా ముట్టుకోవడం???అంతా
రక్తమయం అసలే మడి…
కాని పసిపాప చూస్తూ ఊరుకోలేనే!!!
ఎలాగోలా తన పై పంచ తీసి పసికందుకు చుట్టి ఇంటికి
తీసుకొచ్చాడు…..
వస్తూనె తులసీ ఇలా రావే??అని ఇంట్లోకి కేకేసాడు…
తులసి ఏమిటండీ అని పరుగున వచ్చింది…
అయ్యగారి చేతిలో ఉన్న బిడ్డను చూడగానె..
ఎవరండి?? ఈ పసిపాప??అంది.
తెలియదే రోడ్డుపక్కన దొరికింది. అన్నాడు…
అయ్యెా!!రోడ్డుపక్క దరిద్రాన్ని మనింటికి తెచ్చారేమిటండి???
వాల్లవాల్లెవరో తెలుసుకోక పోయారా???
అక్కడెవరూ లేరే!!పిలిచాను అరిచాను కూడ….
అలా వదిలేసి రాబుద్ది కాలేదే!!!పాపం కళ్లుకూడ తెరవని
పసిగుడ్డు చూస్తూ చూస్తూ వదిలేయలేను కదా!!
కాస్త శుభ్రం చేసి పాలుపట్టవే!!!
హ….మీది మరీ చోద్యం ఈ వయసులో నాకేమిటండి
ఈ తిప్పలు అంది తులసి….
చూద్దాం లేవే!!ఎవరయినా పిల్లలు లేని వాల్లు తీసికెల్తే
ఇద్దాం లే!!!
ఎలాగోలా పసిదాన్ని కడిగి శుభ్రం చేసి పాలు పట్టింది..
పడుకోపెట్టింది….
అలా కొన్ని రోజులు గడిచాయి పాపను తీసుకోవడానికి
ఎవరూ రాలేదు…
రోజూ పాప పని చేయలేక భర్త మీద విసుక్కునేది తులసి…
రేపు మవ పిల్లలు వస్తె ఏం చెబుతారు???
వాల్లు వచ్చాక దొరికిన విషయమే చెప్తాను ఇంకేం
చెప్తాను?? నువ్వు కన్నావని చెప్తాననుకున్నావా??
చాల్లెండి మీ సరసం…
ఏం చెప్తారో!!వాల్లేమంటారో!!! అని అమెరికాలో ఉన్న కొడుకులను తలుచుకుంది తులసి….
సరే లేవే!!వాల్లొచ్చేలోపు మనం ఎవరికయినా ఇస్తాం!!
కదా!!!అన్నాడు వేణు….
అలా అనుకుంటూనె పెంచుతూ పోయారు….
శుృతి అని పేరు పెట్టారు…
పాప ముద్దు ముద్దు మాటలతో చేతలతో వీల్లలోప్రేమ
పెరిగింది….
మూడు సంవత్సరాల వయసప్పుడు అయిదు సంవత్సరాల వయసప్పుడు పెంచుకోవడానికి అడిగారు
కొందరు…
అప్పుడింక వీల్లకే ఇవ్వబుద్ది కాలేదు….
వీల్ల పెంపకంలో శుృతి చాలా తెలివిగా తయారయింది..
పద్దెనిమిది సంవత్సరాలు వచ్చాయి….
తులసి కొడుకులు అమెరికాలోనె సెటిల్ అయిపోయారు
అక్కడే చదువుకుని అక్కడి అమ్మాయిలనే పెళ్లిచేసుకుని ఇండియాను మరచి పోయారు…
ఇక్కడ శ్రృతే మంచి జాబ్ సంపాదించి తులసిని అయ్య
గారిని (అమ్మ నాన్నలను) చూసుకుంటుంది….
ఎవరో ఏమిటో ఏ కులమెా అని తిట్టుకుంటూ పెంచారు
కాని ఇప్పుడు తనే ప్రాణంలా ఇద్దరిని కాపాడుతుంది…
దరిద్రమనుకున్న శుృతే లక్ష్మీ దేవిలా అనిపిస్తుంది
ఇద్దరికీ….
బంధాలనుకుని కని పెంచిన పిల్లలు వారి అవసరానికి
పనికి రాలేదు..
ఏ బంధమూ ముఖ్యంగా రక్త సంబంధం లేని ఎవరో
తెలియని అమ్మాయి చివరి వరకూ తమ వెంటే ఉండి
ప్రాణం లా చూసుకుంది..
ఏమై పోతున్నాయెా అనుకున్న బంధాలు ఏదో ఒక
రూపంలో మన వెంటే ఉంటున్నాయి..
బంధాలు అను బంధాలు మనుషులు ఉన్నంత వరరకూ ఉంటూనే ఉంటాయి..
ఇక్కడ వేణు, తులసి లకు దేవుడే పరిష్కార మార్గం చూపించాడు కానీ ఈ కాలంలో మనుషులే పరిష్కార
మార్గాలు వెతుక్కోవాలి..
అలా వెతుక్కో లేని వాల్లకి దేవుడు ఉండనే ఉన్నాడుగా! అండగా!
ఉమాదేవి ఎర్రం