కన్నీటి కళాకాంతుల శిల్పి

కన్నీటి కళాకాంతుల శిల్పి

కన్నీటి కళాకాంతుల శిల్పి

మందారం విరబూసిన ఆకాశం
ఆ నడుమ అరుణ కాంతుల గోపురంలా సూరీడు,,,,,
మనస్సు భావుకత ఉబికే శిల్పకళా వైభవం జనజీవన పోకడల సాలోచనలు ,,,,,,,,
ఆలోచనల పొగమబ్బులు మనస్సు నుండి ఎగిసిఎగిసి పడుతూ,,,,,,,
నీ మనస్సు పొరలను నా ఉలి దెబ్బలతో శిల్పకళా సౌందర్యం ఉట్టిపడేలా చేసే వైభవం గల కళ్ళు నావి,,,,,,,,
కళ్ళు పలికే మనో భావాలు నేను మలచిన నర్తనమాడే పాలరాతి కన్యకలు, కానీ వాళ్ళ నిజజీవితం సుడిగుండాల మయమైన అగ్ని కూపం,,,,,,,,
నేను పాలరాళ్ళపై పూవులు చెక్కి చూడచక్కగా కట్టిన కోటగోడలతో ఆకాశహార్మ్యము,,,,,,
దుర్జనం మనోవైకల్యంతో నిట్టనిలువునా కూల్చివేసి చేసిన వికటాట్టహాసంతో గుండెలు పగిలి కూలిపడ్డ నేను అనే కళాకారుణ్ణి,,,,,,,,
నీవు కుట్రతో నా జీవన శిల్పాన్ని సుత్తితో నెత్తురోడేలా రాలగొడితే నా ధైన్యం నిండిన కళ్ళు ఊడిపడి గిలాగిలా తన్నుకుంటున్నాయి,,,,,,,,
నానుండి వేరైన నేను అమర శిల్పుల సమాధుల మధ్య నేను నీ మురళీ రవం ఆహార్యాన్ని మలచలేని ఆశక్తుణ్ణి,,,,,,,,
శిలలన్నీ మమేకమై నన్ను కప్పేసుకున్నాయి కళాకారుడా నీ చేతిలో బిడ్డలం మాలో లీనమైపో అంటూ,,,,,,,,
సమ సమాజానికి పునాది రాళ్ళలో నేనో శిలను శిల్పాన్ని

అపరాజిత్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *