కన్నీటి గర్జన

గర్జించే తుఫాను వానగాలుల్లో ఉబికివస్తున్న కన్నీటి గుబులు గూడు
కారుమబ్బులు కమ్మిన నాఎద విప్పుకుని బోరున విలపిస్తున్న ఊపిరి శ్వాస,,,,,,,
ఒకటొకటిగా తెగిపడుతున్న జ్ఞాపకాల విషాద ఛాయల సంగీతం,,,,,,
వృద్దాప్యం చేదు నిజం అగ్నిజల్లుల్లో చిగురుటాకులా వనికే శరీరం,,,,,,,,,,,
ఈ కారుచీకట్లు కమ్ముకున్న జీవితంలో ఎడమ భుజం తొలగిపోయిన విగతజీవిని,,,,,,,,
ఈ పెనుగాలులు నన్ను అమాంతం లేపుకుని అనంత ఆకాశంలోకి విసిరేసినట్లు మనస్సులో తీతువు పాడుతూ,,,,,,,,,
నేను నేనుకాని దుఃఖంలో జీవనయాత్ర కొనసాగుతున్న జ్ఞాపకం మరచిపోయి తీగలా వణుకుతున్న శరీరం భూప్రకంపనళ్ళా,,,,,,,,,
కళ్ళల్లో తేలిపోతున్న ప్రపంచ పటాలం దూదిపింజల్లా,,,,,,,,
నేను గోడకుర్చీలా కూర్చున్నది ఈ భీకర వానలు వరదల్లో భూమిలోకి కూరుకుపోతూ ఎవ్వరికీ కనిపించని పాతాళంలో ఆవలి తీరానికి,,,,,,,,,,,,,,
నన్ను నేను దూరం చేసుకున్న బంధాలు అనుబంధాల్లో నేను ఎప్పుడో ఏ కొండపై నుండి అఘాధాల్లోకి దూకిన అడ్రస్ లేని ఉత్తరాన్ని,,,,,,,,,,
నేను అనామకున్నా ? కాదు నీకోసం నా హృదయం పాడే జీవన గీతాలు నీ వీణుల్లో అర్థవంతమైన రాగాలుపోయే కలం పేరుని,,,,,ఓ చేయిపోతే ఇంకొకటి ఉందిగా,,,,,,,,
భగవాన్ మనిషికి ఒకటికి మరొకటి అద్భుతంగా ఇస్తాడు,,,,,,,,

అపరాజిత్
సూర్యాపేట

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *