కన్యక

మా ఇంటి ఎదురుగ రాజు అనే ఒక అబ్బాయి ఉండే వాడు.అతన్ని నేను ఎక్కువ పట్టించుకునే దాన్ని కాదు.కానీ అతను నన్నే చూస్తూ ఉండేవాడు. మరి నాకు ఎలా తెల్సు అంటారా ,అదేంటో మగాడు ఎంత దూరం నుండి చూసిన ఆడవాళ్లకు అలా తెలిసిపోతూ ఉంటాయి.అలా అతను చూసేది నాకు తెలిసి పోతు ఉండేది.అతను అలా నన్ను చూడడం నాకు కొంచం బాగానే అనిపించేది,అలా చూస్తూ ఉండగా ఒక రోజు అతను మా ఇంట్లోకి వచ్చేసాడు నిజం చెప్పొద్దూ నాకు చాలా భయం వేసింది ఎందుకు వచ్చాడోఅని బయట వాకిట్లో నిలబడి మేడం మేడం అని పిలిచాడు.

నేను అతను రావడం కిటికీలో నుండి చూస్తూనే ఉన్నా,మళ్ళి ఏమి తెలియని దానిలా ఎవరూ అంటూ బయటకి వెళ్లాను అతను మేడం తల నొప్పిగా ఉంది,పాలేమో అయిపోయాయి కొంచం పాలు చేబదలు గా ఇస్తే నేను తెచ్చినప్పుడు మీకు మళ్ళి ఇస్తాను అని అన్నాడు రాజు. పాపం తల నొప్పి అంట అని తెలియగానే అయ్యో అవునా ఎప్పటినుండి రండికూర్చోండి అని నేను ఆహ్వానించాను ఇంట్లోకి.

అయ్యో పర్లేదు అన్నాడు రాజు మీరు కూర్చోండి నేను టీ తీసుకొస్తాను అని లోపలికి వచ్చాను ఇక తప్పదు అన్నట్టుగా కూర్చున్నాడు రాజు అది చూసి నవ్వుకున్నా అతని భయానికి టీ బాగా చేసి ఒక కప్పులో పోసి,తీసుకుని వెళ్ళి ఇదిగోండి అని అంటూ అతనికి అందించాను.కప్పు ఇస్తునప్పుడు అతనికి నా వేలు తగిలి నాకు షాక్ కొట్టినట్టుగా అనిపించింది.

అది అతను గమనించినట్టు ఉన్నాడు కళ్ళ తో నవ్వినట్టుగా అనిపించింది ఇన్ని రోజులు అతన్ని దూరం నుండి చూడ్డమే దగ్గరనుండి ఇదే మొదటిసారి చూద్దాం ఎంత బాగున్నాడోపెద్ద కళ్ళు నొక్కుల జుట్టు వెడల్పాటి ఛాతి అరడుగుల పొడవు మంచికండలు తిరిగిన శరీరం షార్ట్ లోంచి కూడా స్పష్టంగా కనిపిస్తున్నాయి అయ్యిందా అని అన్నాడు రాజు.

నేను ఏంటి అని అడిగాను గాబరాగా అదే చూడడం అన్నాడు రాజు కొంటెగా నవ్వుతూ నేనా నేనేమి చూడలేదే అన్నాను ఉలికి పడుతూ హ సరే లెండి మరి నేను వెళ్ళి రానా అని అన్నాడు కప్పు చేతికి ఇస్తూ మళ్ళి అతని వేలు నాకు తగిలాయి ఒళ్ళంతా జల్లుమంది ఇక ఆ రోజు నుండి మొదలు మేము స్వర్గాన్ని చూసాము,నాకు పెళ్లి అయ్యి భర్త చనిపోయాడు,అందరికి నా మిద జాలి ఉండిపోయింది,చిన్న వయస్సులోనే భర్త పోయాడు.

అని నా అన్నవదినేల దగ్గర ఉన్నా వాళ్ళు నన్నెప్పుడు ఆంక్షలు పెట్టాలని చూడలేదు అసలు పెట్టలేదు నేను ఆ ఇంట్లో స్వేచ్చగా ఉండేదాన్ని అన్ని నా చేతుల మీదనే నడిచేవి,నాకు బాగా చదువుకోవాలని ఉండేది కానీ నా తల్లిదండ్రులు నాకు తొందరగానే పెళ్లి చేయడం తో నా చదువు కొనసాగలేదు.ఇప్పుడు కావలసినంత తీరిక దొరికినా నన్ను శ్రద్దగా చదివించే వారు కూడా లేరు పైగా రాజు తో స్నేహం బాగా రంజుగా సాగుతున్నది.

ఒక రోజు మేము తీరుబడిగా మాట్లాడుతూ ఉండగా రాజు నన్ను అడిగాడు మీకు ఏదైనా తీరని కోరిక ఉందా అని నేను నా కోరికను చెప్పాను,దానికి రాజు అయితే బుక్స్ తెస్తాను మళ్ళి చదువుతారా అని అడిగాడు,నేను సరే అన్నాను, ఇది జరిగిన రెండు రోజులకు రాజు నాకు పుస్తకాలు తీసుకుని వచ్చాడు,కాలేజిలో ఫీజు కూడా కట్టాడు,నేను ప్రొద్దున పని చేసుకుంటూ,రాత్రుళ్ళు చదువుకోవడం మొదలు పెట్టాను.కొన్నిరోజులు సంతోషంగానేగడిచాయి.కానీ మా సంగతి ఊరివాళ్ళు కనిపెట్టి మా అన్నయ్యకు,వదినకు చెప్పారు.

దాంతో ఒక రోజు నాతో మాట్లాడుతున్న రాజుని తిట్టి ఇంట్లో నుండి వెళ్ళగొట్టారు అన్నయ్య వాళ్ళు,తర్వాత నన్ను తిట్టి ఇంట్లోనే ఉండమని కట్టడి చేసారు.అదే సమయంలో నాకు పరీక్షలు ఉండడం వల్ల నేను వారిని కాదని బయటకు వచ్చేసాను,రాజు నా కోసం ఒక రూమ్ తీసుకుని ఉంచాడు నన్ను ఊర్లో మా గురించి లేచిపోయారు అనే పుకారును పుట్టించారు.మేమెవరం వారిని పట్టించుకోలేదు,నా పరీక్షలు జరుగుతున్నాయి.ఇటూ రాజు తో నేను బాగానే ఉన్నాను భార్యాభర్తలు ఎలా ఉంటారో అలా రాజు నాకన్ని అమరుస్తూ ఉండేవాడు.

పరీక్షలు అవ్వగానే ఇంకేదో కోర్స్ లో జాయిన్ చేసాడు రాజు అది అయిపోయి,దాని పరీక్షలు రాసాను,రాజు చెప్పింది చేయడమే నా పని,ఇంకేమి నేను పట్టించుకునే దాన్ని కాదు,ఎందుకంటే రాజు నా మంచికే అన్ని చేస్తాడు అనే నమ్మకం అవి అయిపోయే సమయానికి మా వాళ్ళు,రాజు తల్లిదండ్రులు,భార్యా కలిసి మేమున్న చోటుకు వచ్చి పెద్దగా గొడవ పెట్టారు,నన్ను నానా మాటలు అన్నారు,నేను వగలదిని అని తమ కొడుకుని దూరం చేసాను అని,కొంగుకు కట్టుకున్నా అని,కానీ వాళ్ళు అంత అంటున్నా నేను ఒక్క మాట కూడా మాట్లాడలేక పోయాను.

రాజు ఒక్కగానొక్క కూతుర్ని  ఆశ్చర్యంగా చూస్తూ ఉండిపోయాను.అతనికి పెళ్లి అయిన విషయం నాకు తెలియదు అతనికి ఒక కుతురున్న సంగతి కూడా తెలియదు అతని భార్య ఏడుస్తూ నన్ను నానా మాటలు అంటున్నా నేను నిమ్మకు నీరెత్తినట్టు నిలబడిపోయా,కానీ రాజుని నేను కావాలని కోరుకోలేదు అతనే నా వెంట పడ్డాడు అతనే నన్ను కోరుకున్నాడు.ఇలా అతనికి భార్యా,కూతురు ఉందని తెలిస్తే నేను చచ్చినా అతని వైపు చూసేదాన్ని కాదు.

ఇంతలో రాజు నా దగ్గరికి వచ్చి నన్ను క్షమించు,చెప్పక పోవడం తప్పే కానీ కావాలని దాచలేదు నీ ప్రేమ కావాలనిపించింది అందుకే చెప్పలేక పోయాను,ఇదొక్కటే నేను నీకు చేసిన అన్యాయం అంతే కానీ ఇంకేమి కాదు అది కూడా నా స్వార్ధమే కాబట్టి నన్ను క్షమించు అంటూ రెండు చేతులు ఎత్తి నమస్కరించి,బయటకు నడిచాడు.

చూసావా వాడిని నమ్మి,మమల్ని కాదనుకుని వచ్చావు,ఇప్పుడేమైంది అని నా అన్న నన్ను అడిగాడు.చూడండి మీరు నా భర్తని తప్పు బట్టల్సిన అవసరం ఏమి లేదు అతను మంచే చేసాడు తప్పితే మీ చెల్లి జీవితాన్ని నాశనం చేయలేదు వారికీ ప్రేమ,అనురాగం తో ఇన్నాళ్ళు కలిసి ఉన్నారు,ఇక నేను ఎందుకు వచ్చాను అంటారా ఇదిగో నా కూతురు కు తండ్రి కావాలి కాబట్టి నాకు అతను కావాలి,మీ చెల్లి కి అతను మంచి చదువు,ఉద్యోగం వచ్చేలా చేసి తన కాళ్ళ మిద తను నిలబడేలా చేసాడు.

మీరు చేయలేనిది తాను చేసాడు,ఇక పెళ్లి అంటారా కృష్ణునికి రాధా ఎలాగో మీ చెల్లి కూడా రాజుకు అంతే వస్తా అని కన్య రామ్మా అంటూ తన కూతుర్ని తీసుకుని,నా చేతిలో నా ఉద్యోగం అపాయింట్ మెంట్ ఆర్డర్ ని ఉంచింది.నేను అది ఓపెన్ చేసి చూసాను దాంట్లో నా పేరు బంగారు రంగు లో మెరిసి పోతూ కనిపించింది అందమైన ఆ  అక్షరాలను అందంగా తడిమాను మిస్ శ్రీ కన్యక డిప్యూటీ కలెక్టర్  అని ఉంది అందులో …       

 

Related Posts