కరోన + పరీక్షలు = ఒత్తిడి

 

అహ చివరికి పరిక్షలు రద్దు అని తెలిసి ఎంత హ్యాపీ గా ఫీల్ అయ్యానో అబ్బా, ఇన్నాళ్ళ ఒత్తిడి ని చేత్తో తిసేసినట్టుగా పోయాయి. లేకపోతె అబ్బా ఇన్ని రోజులు ఎంత ఒత్తిడి అనుభవించామో, అది అనుభవించే వారికే తెలుస్తుంది.

కరోన ఏంటో కానీ అది ఎవరికీ వస్తుందో, ఎలా వస్తుందో, అని భయం, భయంగా బతుకుతూ, ఇంట్లో నుండి బయటకు రాకుండా ఉంటున్న మేము, పరిక్షలకు ఎలా వెళ్ళాలో, ఎక్కడ సెంటర్ లు మారుస్తారో, ట్రాన్స్ ఫోర్ట్ ఎలాగో ఎలా వెళ్ళాలో కనీసం బైక్ కూడా లేదు వెళ్ళాలి అంటే, అయిపోయిన రెండు పరిక్షలకు అయితే ఒక ఆటో మాట్లాడుకుని వెళ్ళాము.

మరి అతను వస్తాడో, లేదో అనే అనుమానం, మళ్ళి ఒక వేళ వచ్చిన ఒక ఆటో లో ఇద్దరే వెళ్ళాలి అని ప్రభుత్వం చెప్పినా రూల్, అంత వరకు వెళ్ళాక అక్కడ ఇన్విజిలేటర్లు ఎవరూ ఉంటారో, పిల్లలు ఎలాంటి వాళ్ళు వస్తారో, ఎక్కడెక్కడ తిరిగిన వారు వస్తారో, వారు ఎవరెవర్ని కలిసి వస్తారో, ఎలా ఉంటుందో, పిల్లలు కూర్చునే టేబుళ్లు, బెంచీలు అన్ని సానిటైజ్ చేస్తారో లేదో, పిల్లలకు మాస్క్ లు పెట్టుకుంటారో, లేదో……

వచ్చిన వారు తగిన జాగ్రత్తలు పాటిస్తారా, లేదా అని అనుకుంటూ, ఇవ్వన్ని కాకా ముందు అసలు పరిక్షలు ఉంటాయ ఉండవా, ఉంటె అయిపోయిన పరిక్షలు మళ్ళి పెడతార, లేక మిగాతా నాలుగు మాత్రమే పెడతారా, రెండు పేపర్లు ఉంటాయ, ఒకటే ఉంటుందా ఇలా అన్ని అనుమానాలే, ఇవ్వనన్ని కాక పరిక్షలు వాయిదా వేసారు అని తెలియగానే స్కూల్ వాళ్ళు ఆన్లైన్ క్లాసు లు మళ్ళి మొదలు పెట్టి,

ప్రతి రోజు పదవ తరగతి వారికీ కొన్ని మోడల్ పేపర్స్ ఇచ్చి, వాటిని ప్రాక్టీసు చెయ్యమని చెప్పడం, వీళ్ళు ఏమో ఫోన్స్ పట్టుకుని బుక్స్ ముందు వేసుకు అవి చేసుకుంటూ కూర్చోవడం, కనీసం తినడానికి కూడా లేకుండా ఒకటే ప్రాక్టీసు చెయ్యడం, చేసిన వాటినే పదే పదే చేయించడం, వారి కోసం అంటే ఆన్లైన్ క్లాసుల కోసం వీళ్ళకు నెట్ కనెక్షన్ తీసుకుని, వైఫై పెట్టించడం, దాని కోసం డబ్బును ఖర్చు చెయ్యడం, స్మార్ట్ ఫోన్ ఎవరిదో ఒకరిది వాళ్ళ కూ ఇవ్వడం అబ్బో పెద్ద తలనొప్పి.

పైగా క్లాసులు అవుతూ ఉంటె ఇంట్లో అందరూ సైలెన్స్ గా ఉంటూ సైగలు చేసుకుని మాట్లాడుతూ, వారి కోసం ఒక గది ని ఇచ్చి, అందులోకి ఎవరూ వెళ్ళకుండా చూసుకోవడం, ఒక వేళ ఇల్లు పెద్దగా లేని వాళ్ళు ఉన్న ఒక్క గదిలోనే అంతా సైలేన్సు గా ఉండి, చప్పుళ్ళు లేకుండా చూసుకోవడం చేస్తూ, వాళ్ళని జాగ్రత్తగా చదువుకొమ్మని చెప్పేవాళ్ళం, మరి అన్ని రోజులు ఫీజు లు కట్టి, డ్రెస్ లు కొని, అల్ ఇన్ వన్ లు కొని, షూస్ అని, చెప్పులు అని, డ్రెస్ మారింది అని, వేరే డ్రెస్ కొని, పెన్నులు, పెన్సిల్ లు ఇలా ఒకటేమిటి పెళ్ళికి కూడా ఇంత ఖర్చు ఉంటుందో లేదో తెలియదు.

ట్యూషన్ లు అంటూ, స్పెషల్ క్లాసు లు అని వాటికీ కూడా ఫీజు లు కట్టి, ప్రొద్దున ఏడున్నరకు బాక్స్ కట్టి పంపిన పిల్ల వాణ్ణి సాయంత్రం ఎనిమిది గంటలకు ఇంటికి వచ్చి, వచ్చిన కూడా తిండి కూడా తినకుండా అసైన్మెంట్ లు రాసుకుంటూ, రాత్రి పదకొండు వరకు కష్ట పడుతూ ఉన్న పిల్ల వాణ్ణి చూసి నిట్టురుస్తూ ఉండే వాళ్ళం.

ఇవ్వన్ని ఒక ఎత్తు అయితే ఇక మా పాట్లు అంటే మా తల్లుల పాట్లు ఒకటా, రెండా తొమ్మిదో తరగతి నుండి వాడికి స్పెషల్ క్లాస్ లు పెట్టినారని తెల్సి, అయిదు గంటలకు లేచి, వాడికి టిఫిన్, లంచ్ ప్రిపేర్ చెయ్యడం, ఎక్కడ స్కూల్ లో తింటాడో లేదో అని వాడికి ప్రొద్దునే టిఫిన్ పెట్టడం, వాడు నాకొద్దు అని అంటుంటే ఎవరికైనా ప్రొద్దునే తినాలి అంటే విసుగే కానీ వాడిని తిట్టి, కొట్టి బెదిరించి నోట్లో కుక్కి, మరి బళ్ళో తింటాడో లేదో, క్లాసు ఉందని గబగబా నలుగు మెతుకులు తిని, మిగతా బాక్స్ అలాగే పెట్టి ఇంటికి తెస్తాడు సాయంత్రం.

కనీసం టిఫిన్ అయినా మంచిగా పెట్టాలని వాడికి తినిపించి, వాడు వెళ్ళాక బట్టలు ఉతికి, వాడు లంచ్ చేసాడో లేదో అని అనుకుంటూ కుర్చుంటే, వాడు రాత్రి ఎనిమిది గంటలకు వేల్లాడుతూ వస్తే, వాడికి కళ్ళు కడుక్కునే శక్తి కూడా లేకపోతె, వాడికి మళ్ళి అన్నం కలిపి పెట్టి, వాడి బుక్స్ తీసి ముందు పెట్టుకుని, మళ్ళి నిద్రతో వాలి పోతున్న కళ్ళని బలవంతంగా తెరుస్తూ..

ఇచ్చిన వర్క్ కంప్లేట్  చేస్తూ వాడు సోలిపోతుంటే వాడికి మొహాన్ని చన్నీళ్ళతో కడిగి, మళ్ళి కుర్చోబెట్ట్టి చదివిస్తూ, వాడితోబాటు మేము మేలుకువగా ఉండి, చివరికి పరిక్షలు మొదలయితే, సెంటర్ ఎక్కడ పడిందో అని దాన్ని వెతుక్కుని, అదెక్కడో మాకు తెలియని ఏరియాలో ఉంటె, అది ఎలాంటి ఏరియానో, ఏంటో అని భయపడుతూ, ఒక రోజు ముందే వెళ్ళి అక్కడి పరిస్థితిని, పరిసరాలను అన్నింటిని చూసుకుని వచ్చి, తెల్లారి ప్రొద్దునే లేచి టిఫిన్స్ అయితే దాహం ఎక్కువ అవుతుంది అని తెల్సి, ముందే వేసవి కాలం అని, వాటర్ బాటిల్ లో నిళ్ళు నింపుకుని, వాడు వద్దు, వద్దు అని మొత్తుకుంటున్నా, అంత ప్రొద్దున ఆరుగంటలకు అన్నం పెట్టి, వాడితో పాటుగా నేను తిని, మళ్ళి వచ్చేటప్పుడు ఆకలి అవుతుందేమో అని ఎదో ఒక టిఫిన్ ని బాక్స్ లో పెట్టుకుని, ఒక బ్యాగ్ లో బాక్స్, నీళ్ళ బాటిల్స్, టోపీలు, గొడుగులు పెట్టుకుని ఏడుగంటలకు ఆటో పట్టుకుని ముందుగా వెళ్తే సమస్య రాదని, మళ్ళి బస్ లు, ఆటో లు దొరుకుతాయో లేదో అని జాగ్రత్త పడి రెండు గంటల ముందుగా అక్కడికి వెళ్ళి, కుర్చుని, పిల్లలకు చదువుకొమ్మని చెప్పి, వాళ్ళు చదువుకుంటూ కూర్చుంటే, తల్లుల్లు, తండ్రులు అందరూ మీరెక్కడ, మీరెక్కడ అని వారి వారి ఏరియాల గురించి మాట్లాడుకుంటూ కూర్చోవడం, ఏరియా గురించి తెల్సిన వాళ్ళు అమ్మో ఏరియా మంచిది కాదని చెప్తే మేము భయపడి. అమ్మో అనవసరంగా ఇక్కడ పడింది అని అనుకోవడం.

లోనికి వెళ్తున్న పిల్లలకు, వారి పక్క వారికీ సవా లక్ష జాగ్రత్తలు, అప్పగింతలు చెప్తూ, పెళ్లి అయిన కూతురు అత్తగారి ఇంటికి వెళ్తున్న అన్ని అప్పగింతలు ఇవ్వమేమో అన్ని అప్పగించి, పెన్నులు, పెన్సిల్ లు అన్ని సరిగ్గా ఉన్నాయా, లెవా అని చూసి, వాడు లోపలికి వెళ్ళేవరకు చూసి, వాచ్మెన్ రానివ్వక పొతే అతన్ని తిట్టుకుంటూ, ఎలా రాస్తాడో ఏమో అని భయపడి కూర్చోవడం చేసేవాళ్ళం.

పిల్లలు వచ్చేవరకు టైం పాస్ అవ్వడానికి ఏవేవో కబుర్లు చెప్పుకుంటున్నా మనసంతా పిల్లల మీదే ఉంచుకుని, మా మనోనేత్రం వారి వైపు ఉంచి, అక్కడి వారు కానీ లేదా వాచ్మెన్ మీరు వెళ్ళిపొండి అమ్మా, మళ్ళి టైం అయ్యాక రండి అని చెప్తున్నా అతన్ని మనసులో తిట్టుకుంటూ, ఎందుకంటే మరి పిల్లలు ఎలా రాసారో, ఏంటో, భయపడతారో, ఎలా వస్తారో అనే కదా తల్లి అయినా, తండ్రి అయినా వారి గురించి ఆఫీస్ లకు వెళ్ళకుండా వారి వెంట వస్తే, అతను వెళ్ళిపోయి, మళ్ళి రండి అంటే ఎంత మండుతుందో మీకు తెల్సా తెలియదు.

అది మాకు మాత్రమే, అంటే అనుభవించిన మాకు మాత్రమే తెల్సు, అంటే మీ పిల్లలే రాస్తున్నారా, ఇంకా ఎవరికీ పిల్లలు లేరా, మాకు లేరా అని అనకండి మేము కూడా రాసాము కానీ అప్పుడు మా తల్లిదండ్రులు మా వెంట రాకున్నా, మాకు అన్ని విధాల జాగ్రత్తలు చెప్పి, కొందరు పెద్ద పిల్లల వెంట పంపించారు, అయినా అప్పుడు ఊర్లలోనే సెంటర్లు ఉండడం వల్ల, మా వాళ్ళు ఎక్కువ ప్రత్యేకత, శ్రద్ధ పెట్టక పోయేవారు, అప్పుడంటే పాస్ అయినా కాకున్నా ఏదోలా ఉండేది. అంటే ఆడపిల్ల అయితే పెళ్లి చేసి పంపించేవారు అది వేరే విషయం అనుకోండి….

కానీ ఇప్పుడు జనరేషన్ మారింది, చదువే లోకం, చదువులో ఎంత ముందుంటే వారికీ అంత విలువ, ర్యాంకులు, గ్రేడ్ అంటూ పిల్లల్లో, పిల్లలకే పోటి మొదలయ్యి, అది తల్లిదండ్రుల వరకు పాకింది మా పిల్లోడు ఇలా, మా పిల్లోడు అలా అని గొప్పలు చెప్పుకుంటున్నారు. నేను మరి అలా కాకున్నా మా వాడు పాస్ అయితే చాలు అని అనుకున్న ఒక మాములు, మధ్యతరగతి, సగటు తల్లిని అంతే తప్పా, నా కొడుకు ఏమో పెద్ద ర్యాంకులు సాధించాలి అని నేను కోరుకోలేదు. అలా పరిక్షలకు వెళ్ళిన మేము రెండు పరిక్షలు అయ్యేసరికి ఇది కరోన వచ్చిందని తెలిసి, రెండో పరిక్షకూ మాస్కులు, సానిటైజర్లు తీసుకుని వెళ్ళాము.

వెళ్ళే ముందు మాకు మా ఇంట్లో వాళ్ళు ఎన్నో జాగ్రత్తలు, సలహాలు, సూచనలు ఇచ్చారు, ఎవర్ని ముట్టుకోకండి, తాకకండి, జాగ్రత్తగా ఉండండి అని అంటూ అబ్బో అన్ని చేసి వెళ్ళి, భయం భయం గా పరీక్ష రాసి వచ్చాక, తెల్లారి నుండి మాకు పరిక్షే ఇక వాడికి క్లాసు లు, ఆన్లైన్ పాట్లు ఇవ్వన్ని కాకుండా, మళ్ళి పరిక్షలు పెడితే ఎలా అనే ధర్మ సందేహం ఒక వైపు.

ఎలా వెళ్ళాలి, అక్కడ సురక్షితంగా ఉంటుందా, లేదా అనే మీమాంస ఒకానొక సందర్భంలో అయితే తొక్కలో పరిక్షలు అని అనిపించినా మాట వాస్తవం అయినా, పదో తరగతి పాస్ అవ్వడమే వాడి బాల్యానికి, తెలివికి పరాకాష్ట అని, ఇదే వాడి భవిష్యత్తుని నిర్దేశించే ఒక కొలమానం అని, వాడి తెలివితేటలూ బహిర్గతం అయ్యేది దీనివల్లనే.

ఎందుకంటే ఇన్ని రోజులు వాడి తెలివి తేటలు నాకు, బళ్ళో ఉపాధ్యాయులకూ మాత్రమే తెలుసు పరీక్షల్లో పాస్ అవ్వడం వల్ల అందరికి తెలుస్తుంది అని అనుకున్నా, కానీ ఇప్పుడేమో ఇలా అయ్యి, చాల చాలా ఒత్తిడికి గురి అయ్యాము.

నేనే ఇలా ఉంటె, పాపం పిల్లోడు వాడు ఎంతగా ఒత్తిడికి గురయ్యడో, తెల్లార్లు నిద్ర కూడా సరిగ్గా పోయేవాడు కాదు, అలాంటి ఒత్తిడిలో, సందిగ్ధంలో రెండు నెలలు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న వేళా సాయంత్రం అయిదు యాబై ఒకటికి మన ముఖ్య మంత్రి గారు పిల్లల సురక్షితం గురించి, వారి ప్రాణాల గురించి అలోచించి, తల్లిదండ్రుల మానసిక వేదనకు ఒక పరిష్కారాన్ని ఇచ్చారు, అదే పదో తరగతి పరిక్షలు రద్దు అనే విషయం.

దాన్ని గ్రేడింగ్ పద్దతి ద్వారా మార్కులు ఇస్తాము అనే సంగతి చెప్పి, మా వేదనను చేత్తో తీసేసారు. పిల్లలకు కూడా సంతోషాన్ని కలిగించారు.  

మార్కులు మనిషి తెలివికి కొలమానం కాదని, వారి జీవితం వారికీ ముఖ్యమని భావించిన ముఖ్య మంత్రి గారిని మనం ఎప్పుడు మర్చిపోవద్దు, అలాగే చరిత్రని తిరగ రాసిన ఘనత కూడా మన ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారికె దక్కుతుంది. ఇలాంటి నిర్ణయం తీసుకోవాలి అంటే చాలా ధైర్యం కావాలి, వారి ముందు భవిష్యత్తు కూడా దృష్టిలో పెట్టుకుని వారికీ గ్రేడింగు అమలు పరుస్తూ, నిర్ణయం తీసుకున్నారు అంటే నిర్ణయం లో పాల్గొన్న అందరూ మంత్రులకు, అధికారులకు అందరికి సందర్భంగా తల్లిదండ్రుల అందరి తరపు నుండి కృతజ్ఞ్తతలు తెలుపుకుంటున్నాను..

Normal
0

false
false
false

EN-US
X-NONE
HI

/* Style Definitions */
table.MsoNormalTable
{mso-style-name:”Table Normal”;
mso-tstyle-rowband-size:0;
mso-tstyle-colband-size:0;
mso-style-noshow:yes;
mso-style-priority:99;
mso-style-qformat:yes;
mso-style-parent:””;
mso-padding-alt:0in 5.4pt 0in 5.4pt;
mso-para-margin-top:0in;
mso-para-margin-right:0in;
mso-para-margin-bottom:10.0pt;
mso-para-margin-left:0in;
line-height:115%;
mso-pagination:widow-orphan;
font-size:11.0pt;
mso-bidi-font-size:10.0pt;
font-family:”Calibri”,”sans-serif”;
mso-ascii-font-family:Calibri;
mso-ascii-theme-font:minor-latin;
mso-fareast-font-family:”Times New Roman”;
mso-fareast-theme-font:minor-fareast;
mso-hansi-font-family:Calibri;
mso-hansi-theme-font:minor-latin;
mso-bidi-font-family:Mangal;
mso-bidi-theme-font:minor-bidi;}

Related Posts