అబద్దాలు

కల్మషం

కల్మషం

ప్రేమ గుడ్డిదంటారు
ఎవరిని చూస్తే పుడుతుందో
తెలియ దంటారు కానీ ఈ
కాలంలో నేటి సమాజం లో
అంతస్తుల ను చూసి పుడుతుంది!

ఐశ్వర్యాన్ని చూసి పుడుతుంది
డబ్బు, డబ్బు, డబ్బు దీనిని
చూసి ప్రేమ కలుగుతుంది ఇదే
మనుషులను నడిపిసఃతుంది
దీని మీద ఉన్నప్రేమమనిషి మీద లేదు!

మమతలు మరచిన వేళ
కల్మషం మనిషి నేర్చిన వేళ
స్వార్థం కోరల్లో చిక్కిన వేళ
ఆస్తి, అంతస్తులు అనే వ్యామెాహం
లో కూరుకు పోయిన సమాజం!

మనుషులంతా మాయమై
పోయారు! ప్రేమ ను మరిచారు
మత్తు మాయలో మునిగి పోయారు
చివరకు ఏమవుతారో? ఎలా
బాగవుతారో? కల్మషం లేని సమాజం
ఎప్పుడు వస్తుందో!

ఉమాదేవి ఎర్రం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *