అమ్మాయే నవ్వితే

కళ్ళ కలల కళారూపం ప్రేమ,,,,!!

ప్రేమ నిండిన మదిపూయు హృదయపరాగం
హృదయమే వెన్నెల వర్షంలో పూసిన కలల మల్లియల సౌందర్యం,,,,,,
జీవితమే ముద్దుమురిపాల ముగ్దమనోహర సుందర కావ్యం
విరిసిన సుకుమార రూపసి అందాల మౌనిక ముఖారవిందం చిత్రకారుని కుంచెలో కళా చిత్రీకరణ,,,,,
ఉరకలువేసే నదీ ప్రవాహంలా యవ్వనవతి తనువు పూసిన గులాబీ మనస్సు దోచుకునే చోరుడు రాకుమారుడు తలవంచి సుమాలందించు గులాము,,,,,,,
ప్రేమ యవ్వనంలో ఓ అందమైన హృదయం పూసిన రంగుల కలల కళ్ళు విరిసిన పౌర్ణమి వెన్నెలలో శోభిల్లు జవ్వని మయూరి నర్తనం కళ,,,,,,,
పూదోటలో పూవుల కాపరి కళ్ళు కప్పి దొంగిలించిన పూవులు వెన్నెల వెలుగుల ప్రేమలో మునకలేసేందుకు మాలలల్లిన సౌందర్యవతి ప్రియునికై భరించలేని హృదయసంవేదనల విరహవేదన,,,,,,,,
ప్రేమ రెండు హృదయాల ఒకే స్పందనల మూగబాసల కళ్ళు తెలిపే గూడుకట్టుకున్న సంవేదనల కళావేదం,,,,,,,,

అపరాజిత్
సూర్యాపేట

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *