కళ

 అమ్మ నాకు ఇంకొక ఆమ్లెట్ కావాలి అంది కళ,ఏయ్ ఏంటి ఇప్పటికే రెండు వేసాను,అక్కకు తెలిస్తే నాకు ఒకటే ఇచ్చి,నీకు రెండు ఇచ్చిన అని అలుగుతుంది.ఇది తమ్మునికి అంతే పో పోయి పడుకో పో అంది అరుణ కూతుర్ని బుజ్జగిస్తూ,అబ్బా ఎప్పుడూ ఇంతే ఒకటే ఆమ్లెట్  తో సరి పెట్టుకోవాలి అంతే తప్ప మనసారా,కడుపు నిండా ఆమ్లెట్ తినే భాగ్యం ఎప్పుడూ కలుగుతుందో ఏమిటో ఆనుకుంది కళ..

అదొక దిగువ మధ్యతరగతి ఇల్లు అరుణ,రమణ దంపతులకు ఇద్దరు కూతుర్లు ఒక కొడుకు,ప్రొద్దున వండుకున్న కూరని రాత్రికి కూడా సరిపెట్టుకుని తినే మనస్తత్వం కలవారు,గంజి ని కూడా పార వేయకుండా దాన్ని చిరాలకో లేదా సుప్ గానో తాగి ఆ పుటకు అన్నం తక్కువ వండుకు నే వాళ్ళు,అలాంటి మధ్యతరగతి కుటుంబం లో పుట్టిన కళ కు అన్ని గొప్ప కలలే ఉన్నాయి.

అవి ఆమెకి గొప్పవి,చూసే,వినే వారికి చాలా సాధారణంగా కనిపిస్తాయి.అవేంటో చూద్దాం మనం కూడా..

వేడి వేడి అన్నం లో మటనో ,చికెన్ తో తినాలని,పానిపూరి బండి దగ్గర కడుపునిండేలా తినలి,ఆమ్లెట్లు వద్దు అంటున్న తల్లి వేసి ఇవ్వాలి అని,ఒక పెద్ద హోటల్ లో బిర్యానీ తో పాటు ఐసెక్రమ్ రుచి చూడాలి అని,గంజి కూడా తగాకుండా మొత్తం గా అన్నం తినాలి అని,లేదు అని అనకుండా ప్రపంచంలోని అన్ని రుచులు చూడాలి అని కళ కు కోరిక గా ఉంది..

తెల్లారిన తర్వాత ఒక బెంజి కారు వచ్చి ఆగింది.అందులోంచి ఒక ముసలాయన దిగాడు.లోనికి వచ్చి ఇదికళ ఉండే ఇళ్లేనా అని అడిగాడు.హ అవును ఇది కళ ఉండే ఇల్లే మిర్రవారు అంటూ భయపడుతూ అడిగాడు రమణ,నేను కళ ని నాతో పాటుగా తీసుకుని వెళ్ళడానికి వచ్చాను అని అన్నాడు.

కళ మా పిల్ల ఆమెని ఎలా తీసుకుని వెళ్తారు.మేము పాపము అన్నాడు తండ్రి ఏ మీరు పంపేది ఏంటి ,రేయి వచ్చి ఈ పిల్లను లాక్కెళ్లండి అన్నాడు ముసలాయన,అయ్యో వద్దు వద్దు అండీ అయినా మా పిల్లని ఎందుకు తీసుకెళ్తున్నారు అని అడిగాడు రమణ,తల్లి ఆందోళనగా చూస్తుంది.అక్క తమ్ముడు ఒక ములగా నిలబడ్డారు..

చూడండి మా మనవరాలు మీ అమ్మాయిలాగే ఉంటుంది.వాళ్ళ అమ్మ  ఆమె మీద బెంగ తో మంచం పట్టింది.మా మనవరాలు  చిన్నగా ఉన్నప్పుడే చనిపోయింది,అప్పటి నుండి వాళ్ళ అమ్మ అంటే నా కోడలు అలా తయారయ్యింది,కాబట్టి మీరు వద్దు అని అన్నా,నేను బలవంతoగా అయిన తీసుకెళ్తా అన్నాడు ఆ ముసలాయన,తల్లిదండ్రులు ఏమి అనకుండా,కళ ని తీసుకెళ్లామని పంపారు.

కళను బాగా రెడి చేసి బెంజి కారులో తీసుకుని వెళ్లారు వాళ్ళు,అదొక పెద్ద మేడ అందులో ఇరువైపులా అన్ని పువ్వుల చెట్లు,పళ్ళ చెట్లు ఉన్నాయి.లోనికి వెళ్ళి ఒక గదిలోకి తీసుకుని వెళ్ళారు కళ ని ,అక్కడ మంచం లో ఒకావిడ అచ్చం అమ్మలాగే అనిపించడం తో అమ్మా అని పిలిచింది కళ..

దానికి ఆవిడ కళ్ళు తెరిచి,చూసి అమ్మా వచ్చావా అని అంటూ దగ్గరికి తీసుకుంది.నాన్న వదిలి వెళ్లావు కదా అని అనగానే లేదమ్మా ఇంకెక్కడికి వెళ్ళాను అంటూ తాను కూడా అమ్మ గుర్తొచ్చి ఏడ్చేసింది కళ.ఆ తర్వాత అక్కడ నుండి బయటకు వచ్చాక ఇదిగో ఇది ని గది అని ఒక గదిని చూపించారు.

అందులో అన్ని బొమ్మలు ఉన్నాయి,వాటితో ఇష్టం వచ్చినట్లు అడ్డుకున్న తర్వాత,ఆకలి వేసింది డైనింగ్ టేబుల్ ముందు ఎన్నో రకరకాలుగా వండి పెట్టారు,అన్ని తనకు ఇష్టమైనవే,ఆమ్లెట్స్,అన్నం,చపాతీ అన్ని వేడి వేడి గా ఉన్నాయి,కళ ఎప్పుడూ చూడని,విననివి కూడా ఉన్నాయి,వాటితో పాటుగా రకరకాల పళ్ళు కూడా ఉన్నాయి.వాటిని చూడగానే ఎక్కడ లేని ఆకలి అవ్వన్ని తినేసి బ్రేవ్ అని లేచింది కళ..

ఆ రాత్రి అవ్వన్ని తిన్న కళ కు ఒక రాత్రి కడుపు లో బాగా నొప్పి వచ్చింది.బాధ తో మెలికలు తిరిగింది కళ,అలా నొప్పి వచ్చిందని ఎవరికి చెప్పాలో తెలియక అక్కడున్న టేబుల్ లాంప్ ని పడవేసింది.ఆ శబ్దానికి పని వాళ్ళు అందరూ వచ్చారు.

ఆమెని ఆసుపత్రికి తీసుకుని వెళ్లారు.అక్కడ డాక్టర్లు కళ ని పరీక్షించి,చూసి బాగా జంక్ ఫుడ్ తినడం వల్ల నొప్పి వచ్చింది అని,దానికి విరుగుడుగా ఒక నాలుగు రోజులు కేవలం గంజి  తాగమని ,దానివల్ల ఆ నొప్పి పోయి మళ్ళీ లేచి తిరగడానికి శక్తి వస్తుంది అని అన్నారు.తెల్లారిన  తర్వాత డైనింగ్ టేబుల్ దగ్గర ఒక చిన్న గిన్నెలో  గంజి వేసి ఇచ్చారు తాగమని,

నాకు వద్దు,నాకు వద్దు ,ఇది వద్దనే కదా నేను ఇక్కడికి వచ్చింది.మళ్ళీ ఇది తాగమని అంటారెందుకు అంది కళ,అమ్మా ఇది గంజి ఇందులో ప్రోటీన్లు ఉంటాయి.నీకు శక్తిని ఇస్తాయి అని అన్నాడు ఆ ముసలాయన,నీకు అది రోజు తాగడం నీ అదృష్టం,మేము కూడా అదే తగుతాం,మాకు ఇలాంటి ఫుడ్ తినడం వల్ల చాలా జబ్బులు వస్తాయి.డాక్టర్ కూడా మాకు అదే మందు అని చెప్పాడు అని అన్నాడు ముసలాయన..

నాకొద్దు,నాకొద్దు నాకొద్దు అని అరుస్తున్న కూతుర్ని ఏంటీ ఎందుకు అరుస్తున్నావు అంటూ లేపింది అరుణ,కళ బిత్తర పోయి చూసి, అయితే ఇదంతా కల నా ,నన్ను ముసలాయన తీసుకెళ్లు లేదా,అమ్మో ఇక్కడ అయితే ఎప్పుడో ఒకసారి మాత్రమే గంజి తగుతం,కానీ ఆ పెద్ద మేడ లో రోజు గంజి తాగడం అంటే నా వల్ల కాదు.. నాకు ఆ జంక్ ఫుడ్ వద్దు అని ఆనుకుంది మనసులో కళ,ఇంకెప్పుడూ అలాంటి కల లను రనివ్వద్దు అని కూడా అనుకుజని అమ్మ ఈ రోజు ఎం వంట చేశావ్ అంది అరుణ ని చూస్తూ,పచ్చి పులుసు అంది అరుణ అబ్బా పులుసు నాకెంత ఇష్టమో అంటూ బయటకు పరుగెత్తింది కళ….

Related Posts