నా కలల తివాచీ
నా గుండె సవ్వడి
పేదవాడిని బాగు చేయాలనే ఒరవడి
బ్రతుకు పందెంలో
క్రాంతి దీవెన తో
ప్రతిమై గారడీతో
మోసం చేసిన ధనికులను
రక్తం పిండిన రాక్షసులను
వంచించిన నరబ్రష్టులను
వేధించే రోజు వస్తుంది
అది నా స్వాతంత్ర దినం.!
బంగారు పంజరంలో ఉన్న చిలుకను
నన్ను గారాబంగా బ్రతికించినను
నా స్వేచ్ఛ కబలించినను
నేను ఏమైపోయేదా
నా బ్రతుకు బండి ఎలా సాగించెద
బంధాల అమృత వర్షం కురిపించా
అనుబంధాల ఆప్యాయత ప్రసరించిన
నా బందిఖానా నుండి విడిపించే వారెవరు.!
నన్ను నా కలల స్వప్నాలను అంతరింపక
నాలో ఊపిరి ఊదిన బంతిలాగా
నా పేద జీవితానికి కాలం మారాలి ఇలా.!
హామీ పత్రం
ఈ కవిత నా యొక్క సొంత రచన
ఇట్లు
యడ్ల శ్రీనివాసరావు విజయనగరం