కవితా అంశం : అనాధలను ఆదరించు ప్రేమించు అమ్మ

ఆలయంలో దేవత
ఉన్నాడంటే నమ్మను
ఆకలి చావులతో
మూత కళేబరాలతో
అనాధ బిడ్డలు
కూడు లేక
గూడు లేక
ధరించు చక్కని వస్త్రంబు లేక
అలమటించు పోతుంటే
ముక్తకంఠముతో
బోరు బోరు నా
ప్రసంగాలతో నడవడం వల్ల
వారి ఆకలి తీరదు
వారి బాధలు తొలగవు
దీన మనస్కుడైన అమ్మ
దీనురాలిగా మలిచాను
సేవ చేయదలిచావు
సాటి వారికి సాయపడని
తోటి వారిని గౌరవించని
వింత లోకం విడ్డూరం
అసువులు బాసి ఆలయాన కన్నీరు విడిచి
కెవ్వుమంటూ కేక వేస్తే అది మనసా చేతకానితనము
దీపారాధన కుంకుమార్చన ఉపవాస కూడికన
ఒరిగినది ఏమి సాటి వారికి
నీ వల్ల కలుగు లాభం ఏమి
ప్రాణం ఉన్నంతవరకు
గుడి గుండె దీప వెలిగే వరకు
గొంతి లో గాలి ఉన్నంతవరకు
నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించుము
అన్న బైబిల్ సూక్తి లాగా
అంకితమైపోయావు మా మదర్ దేరిసా అమ్మ


         హామీ పత్రం

ఈ కవిత నా యొక్క సొంత రచన
ఇట్లు
యడ్ల శ్రీనివాసరావు విజయనగరం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *