ఆరని రక్తం
తీరని శోకం
వనితల మెడన
మాంగళ్యపు దండన
కక్షల పర్వం
కన్నీటితో శాపం
అందేల చరిత
అమాయకుల భవిత
నడిరోడ్డున ప్రళయ
వేదనకు స్వస్తి
ఈ నేలకు తెలుసు
రక్తపు చాయలు
ఈ పసికందు కు తెలుసు
మరణాంతర గుళికలు
మలినం కలిగిన
మనుషుల సొంపు
మత్తు వదలని
పైశాచిక తంతు
పులిలా బ్రతుకు
సింహంలా జీవించు
వేట కుక్కల
ఊరి నక్కల
వలపు ధోరణి
ఒక ఎత్తు
రాజకీయం
నాటకీయం
కలిపి బ్రతికిన
చౌకబారి బ్రతికిన
వేసగాండ్రకు
వంగ వద్దు
లొంగ వద్దు
నిలబడు
నిలిచి
ఈ నగరి
వేట కుక్క లా
వింత బ్రతుకుల
ఇంత బ్రతుకుకు
సలాం కొడుతురు
సిగ్గు లేదురా
పనికిమాలిన
వేసపు బ్రతుకురా
వద్దు మోసము
వద్దు దౌర్జన్యము
వద్దు అరాచకం
వద్దు అన్యాయం
నిగ్గు తేలిన
సిగ్గుమాలిన
రాజకీయపు
రంగు నడకన
దుమ్ము దులుపుటకు
లేరు ఒక్కరు
ఎదురు తిరిగితే
ఎదవ బ్రతుకుల
దుక్కుపోయిన
రైతు రాజ్యం
ఆరని పేరంటం
అతివల పర్యంతం
ముప్పుటలు నదిలో మునిగిన
పోదు పాపం పోకిరి బతుకుకి
ఎదురు తిరిగితే ఏముంది
బ్రతికితే బ్రతుకు
దిల్ కి రాజాల బ్రతుకు
అనుకున్నది సాధించు
సమాప్తం చేద్దాం
మానవత్వం లేని రాక్షసుడిని
అంతం చేద్దాం
నగరి నేల తల్లికి
జోల పాట రా నా రక్తపు పాట
అంకితమిచ్చి
కాపాడుటకు
యువతే ఒక సైన్యం
భారత రాజ్యపు
గర్జించే సింహపు నైజం
ఇదేరా ఇదేరా
చదివిన చదువుకు
పస్తుల బ్రతుకు కు
దాస్యపు వ్యధలకు
స్వస్తి పలుకుదాం
విముక్తి కోరుదాం
జై భారత మాత!
జై జై భారత మాత!!
హామీ పత్రం
ఈ కవిత నా యొక్క సొంత రచన