కాలం.
ఎన్నో బాధలు, ఎన్నో కష్టాలు
ఏడవని రోజు ఉండదు
ఏడిపించని జనాలు ఉండరు
ఎప్పుడూ ఉండే కన్నీళ్లే!
దేవుడే ఇలా రాసాడేమెా
అనుకుంటాం కానీ దేవుడు
రాయడేమెా! అలా జరుగు
తుందంతే ! అలా అని సరి పెట్టు
కోవడమే!
ఇదేనా జీవితం? కాలం చూపించే
మార్గం? అంతేనేమెా! ఎంతో
బలమైన గాయాలను కూడా
కాలమే మాన్ప గలదు! ఎన్నో కష్టాలను
కాలమే తీర్చగలదు!
గాయాలను రేపడం మనుషుల
పనైతే మాన్పడం మాత్రం కాలం
పనే! అవి మనసుకు తగిలిన
గాయాలైనా! శరీరానికి తగిలిన
గాయాలైనా! అంత అధ్బుతం కాలం!
ఉమాదేవి ఎర్రం