అక్షర కొరకు
అంశం :ట్రెండెంగు
శీర్షిక:కృత్రిమ అద్దాల పూవుల మేడలు,,,,,,!!
ప్రస్తుత జీవితాలు కృత్రిమ రంగుల దోబూచులాట
ఎంతటి సమస్యయైనా మసిపూసి మారేడుకాయలు చేయడమే నేటి నీతి,,,,,,,,,
జీవితంలో కారుమబ్బులు కమ్ముకొస్తే రంగులేసి వేలంవేసే రోజులు,,,,,,
కసిరే ఎండలు కాల్చుతుంటే కూల్ డ్రింక్ షాపులు ఏ సీ లు కోకొల్లలు ఆలోచించే బుర్రవుంటే,,,,,,,,,
బయటకు వెళ్తే బంగరు రంగుల డ్రెస్సులలో కార్లలో ఆదానీ తలపించు,,,,,,,
జీవితం రంగు రంగుల ఇంద్రధనస్సు శోభిళ్ళు ప్లాస్టిక్ పూల జీవనతరంగాలు పేకమేడలు,,,,,,
ఉన్నత శిఖరాలు ఎక్కేందుకు దొడ్డిదారులెన్నో మాయలమరాటీ జీవితాలు,,,,,,
రంగు రంగుల బల్బుల్లో కృత్రిమ రంగుపూవుల జీవితాలు బ్రతుకులు అంగడి సరుకులు,,,,,,,,
ఎటుచూసినా మెరిసిపోతూ నవ్వుల పూవులు కష్టపడే నైజం కానరాని కరకురాతి గుండెలు,,,,,,,
మెరుపుల మేఘాలు కమ్ముకుని జీవితం కృత్రిమ సొగసు పూలు కురిసే రంగు రంగుల వెన్నెలలు,,,,,,,,
ఈ కృత్రిమ జీవితాలు ఎప్పుడు అగ్నిసముద్రం పాలు అవ్వుతవో తెలియదు చిత్రవిచిత్ర వేషాలు వేస్తే అంతేసంగతులు బయటపడేదాకా,,,,,,,
అపరాజిత్
సూర్యాపేట
హామీపత్రం : ఇది నా స్వీయ కవిత అని నా హామీ.