కొడుకు+తల్లి = కరోన

తేజ,కీర్తన ఇద్దరూ భార్య భర్తలు వారికీ ఒక కొడుకు,కూతురు ,అనోన్య దాంపత్యం కాకపోయినా పొరపొచ్చాలు లేని సంసారం వారిది. కూతురు ఆశ్రిత డిగ్రీ అవ్వగానే ఒక అయ్యా చేతి లో పెట్టి ,చేతులు దులుపుకున్నారు .ఇక కొడుకు విజ్జూ  ఇంజనీరింగు లో ఉన్నప్పుడు ఒక అమ్మాయిని ప్రేమించి, కాంపస్ లో ఉద్యోగం రాగానే ఆ అమ్మాయిని  తీసుకుని వచ్చి తల్లిదండ్రుల ఎదుట నిలబెట్టాడు.వారి ప్రేమని ప్రేమగా ఆశీర్వదించారు తల్లిదండ్రులు.అమ్మాయి తరపువారు కూడా ఒప్పుకోవడం తో ఉన్నoతలో బాగానే పెళ్లి జరిపించారు.

విజ్జూ, సంజు లు ఇద్దరూ చిలక గోరింకల్లా కలిసి పని చేసుకోవడం చూసిన అత్తమామలు,సంతోషించారు.త్వరలోనే వారి కడుపు పండాలని కోరుకున్నారు.అనుకునట్టుగానే సంజు కడుపు పండింది.,పండంటి బాబు కూ జన్మనిచ్చింది సంజన.మొదటి కానుపు కాబట్టి సంజు చాలా బలహీనంగా తయారయ్యింది,మూడునేల్లు పత్యం చేసి,మూడో నెలలో బారసాల అవ్వగానే మంచి రోజు చూసుకుని,అత్తారింట్లో దిగబెట్టి,జాగ్రత్తలు చెప్పి వెళ్ళారు తల్లిదండ్రులు… 

ఇక మనుమడి తో సమయం తెలియలేదు నానమ్మ,తాతయ్య లు అయిన కీర్తన, తేజ లకు.ఇలా కొన్ని రోజులు గడిచాయి,సంజు ది నార్మల్ డెలివరీ,కాబట్టి,డెలివరి అప్పుడు సంజు కి కుట్లు పడ్డాయి,దాంతో డాక్టర్ గారు సంజు అత్తగారిని పిలిచి ఒక ఆరునెలలు భార్యాభర్తలు  దూరంగా ఉంటె బాగుంటుంది అని చెపారు,అదే విషయాన్నీ తండ్రి తో కొడుక్కి చెప్పించింది తల్లి ,కొడుకు పుట్టిన సంతోషం లో అప్పుడేమి పట్టించుకోలేదు విజ్జు విషయాన్నీ ,కానీ భార్య వచ్చి ఇంట్లో ఉంటున్న,చూస్తున్న తర్వాత తను ఏమి కోల్పోతున్నాడో అర్ధం అవ్వసాగింది విజ్జు కి .

వంశoకురాన్ని అందించిన భార్యని దగ్గరికి తీసుకోవాలని ఉన్నా ,ఎక్కడ టెంప్ట్ అవుతానో అనే భయం వల్ల, భార్య ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని,కంట్రోలు చేసుకుంటున్నాడు విజ్జూ ,పంచభక్ష్య పరమాన్నాలు ఎదురుగా పెట్టి ,చేతులు కట్టేసినట్టు గా అయ్యింది అతని పరిస్థితి.డాక్టర్ గారు ఇచ్చిన సమయం అయిపోయింది కానీ, తన భార్య కోలుకోవాలని ఒక నెల రోజుల సమయం తీసుకున్న విజ్జూ రోజు చాల హుషారుగా  ఉన్నాడు.

దానికి కారణం లేకపోలేదు   రోజు మధ్యానం సంజు ఫోన్ చేసి తనని సాయంత్రం త్వరగా రమ్మని అనడమే, ఆఫీస్ లో పెండింగ్ పనులెవి లేకుండా చూసుకుని,ఉన్న పని ని గబగబా పూర్తి చేసాడు విజ్జూ.బాస్ ని రెండు రోజుల సెలవు కూడా అడిగాడు ,మరి తొమ్మిది నెలల తాపం తీరాలి అంటే రెండు రోజులు సరిపోకున్నా కాస్త అయినా తృప్తి గా ఉంటుందని అనుకునాడు,పనులన్నీ ముగించి,బయటకు వచ్చి, బైక్ కీస్ తీసుకుని,కిందకి దిగాడు లిఫ్ట్ లో దారిలో స్వీట్, పళ్ళు తీసుకున్నాడు. మెడికల్ షాప్ ముందు ఆగి కావలసిన మందులు అన్ని సరి చూసుకొని బైక్ స్టార్ట్ చెయ్యబోయాడు.

ఇంతలో తల్లి నుండి ఫోన్ వచ్చింది. ఫోన్ లిఫ్ట్ చేసి ఎంటమ్మ అని అన్నాడు, రేయ్ కొన్ని సరుకులు తీసుకురావాలి రా రేపు బంద్ అని అంటున్నారు అంది తల్లి. ఆ మాటకి ఎగిరి గంతెయ్యబోయాడు విజ్జూ. అబ్బ రేపు బంద్ అంటా అనవసరంగా ఆఫీస్ కి సెలవు పెట్టాను.అయినా మూడు రోజులు కలిసి వస్తాయి, అని అనుకోని తల్లి చెప్పినా సరుకులు తీసుకొని ఇంటికి వెళ్ళాడు విజ్జూ.

ఇంటికి వెళ్ళే సరికి తల్లిదండ్రులు భార్య అందరూ టీవీ చూస్తున్నారు. విజ్జూ రావడం గమనించిన సంజు, ఆగండి అక్కడే అని అరిచింది. భార్య అరుపుకు బయపడ్డ విజ్జూ అక్కడే ఆగిపోయి, ఏంటి అని అడిగాడు. మీ షూస్, సరుకులు అక్కడే వదిలేసి ఇదిగో ఈ నీళ్ళతో కాళు కడుక్కోండి అని నీళ్ళ బకెట్ బయట పెట్టింది. ఏంటిది ఎప్పుడు ఇలా చేయలేదు అని అడిగాడు విజ్జూ.

లోపల నుండి కీర్తి వచ్చి అదేదో వైరస్ అట అందరికి అంటుకుంటుoదట నువ్వు ముందు కాళ్ళు కడుక్కొని లోపలికి రా. అని అంది. సరేనని కాళ్ళు, చేతులు కడుక్కొని లోపలి వెళ్ళాడు విజ్జూ. బాబుని ఎత్తుకోవాలి  అని అనేసరికి తండ్రి రేయ్ చేతులు శుబ్రంగా శానిటిజెర్ చేసుకొని బాబుని ఎత్తుకో అని అన్నాడు తండ్రి.

సరేఅని అలాగే చేసాడు. `తింటున్నప్పుడు కూడా అంతే శుబ్రంగా చేతులు కడుక్కున్నకే తిన్నారు. అంతా అయ్యాక ఇక అన్ని సర్దేసి సంజు తిన్న తర్వాత విజ్జూ తమ బెడ్ రూమ్ లోకి వెళ్ళి బెడ్ ని బాగా సర్దుతూ ఈల వేస్తున్నడు. లోపలనుండి ఉత్సాహం తన్నుకురాసాగింది. బెడ్ మొత్తం సర్ది, పడుకుని కాల్లూపుతూ కలలు కనసాగాడు విజ్జూ. కాసేపటికి డోర్ చప్పుడు అయ్యింది. సంజునే అనుకుని రామ్మా, చిలకమ్మా, అని పాట పాడుతూ కళ్ళు తెరిచాడు.

 కాని అక్కడుంది తల్లి. కీర్తన, విజ్జూ కళ్ళు తెరవడం చూసి చూడు విజ్జూ, నేను, సంజు, బాబు ముగ్గురం ఈ రెండు రోజులు హాల్ లో పడుకుంటున్నాo.నీకు ఏమైనా కావాలంటే అడుగు, సరేనా అని అంది. అత్తగారి పక్కనే ఉన్న సంజు విజ్జుని చిలిపిగా చూస్తుంది. విజ్జూ అయోమయంగా తల్లి వైపు, సంజు వైపు  పిచ్చి చూపులు చూడసాగాడు. ఏమి అర్ధం కాక అప్పటివరకు కంటున్నా కలల్ని డాం అని పేలినట్టు అయ్యాయి.

సంజు మన్మధ బాణాలు విజ్జూ మీద వదులుతూ అత్తయతో పాటుగా హాల్ లోకి వెళ్ళిపోయింది. హలు పెద్దదే కాబట్టి రెండు బెడ్లు కాస్త దూరంలో వేసుకొని బెడ్ మధ్యలో బాబుకి మెత్తని పక్క వేసి బెడ్ చుట్టూ దోమ తేరా కట్టారు. సన్నగా ఫ్యాన్ కూడా వేసారు. బాబుకు జలుబు చేస్తుందని లైట్లు ఆర్పేసి బాబుకి పాల డబ్బా పక్కకే పెట్టుకొని పడుకున్నారు అత్తా కోడళ్ళు.  

చూడమ్మా సంజు ఈ రెండు రోజులు మీరు కాస్త జాగ్రత్త పడితే చాలు. ఇక జీవితాంతం మీరు హ్యాపీ గా ఉండొచ్చు అర్ధం కాకపోవడానికి నువ్వేం చిన్నపిల్లవు కాదు. బాబు లేస్తే నేను పాలు పడతాను కాని నువ్వు హాయిగా నిద్రపో అంది కీర్తన. అలాగే అత్తయ్య అని అటూ వైపు తిరిగి కళ్ళు మూసుకొని పడుకుంది సంజు. సంజు కూడా ఈ రోజు రేపే కదా అత్తయ్య చెప్పింది మంచికేగా అని అనుకోని పడుకుంది. కాని లోపల బెడ్రూమ్లో విజ్జూ పరిస్థితి మాత్రం వేరేలా ఉంది. ఎన్నో ఆశలతో కోటి కోర్కెలతో వచ్చిని విజ్జూ ఆశలన్నీ ఆవిరైనట్టు ఉన్నాయి.

గుండెల్లో గునపాలు దిగినాయి. కోరికలకు కళ్ళెం పడింది. అయినా అమ్మకి ఎలా తెలిసి ఉంటుంది మేము ఈ రోజు కలుసుకోవాలని అనుకున్నాం అని ఆలోచించసాగాడు. అయినా ఈ ఆడవాళ్ళకి బుద్ధి లేదు అన్ని చెప్పేస్తారు అని అనుకుని అవును చెప్పకపోతే రేపు ఏదైనా ఇబ్బంది వస్తే బాగుండదు కదా అందుకే చెప్పి ఉంటది సంజు  అని మళ్ళి అనుకుని,

హే భగవాన్ నాకెంత కష్టం కలిగించావయ్య అని అనుకుని ఈ ఆలోచనలకి అడ్డు వెయ్యాలని అనుకుని బెడ్ రూమ్ లో ఉన్న చిన్న టీవీ పెట్టాడు అది మర్చిపోవడానికి కాని టీవిలో మిడ్ నైట్ మసాలా పాటలు వస్తూoడడం వాళ్ళ అతని కోరిక ఇంకా పెరగసాగింది. వెంటనే టీవీ కట్టేసి ఆగల్లేక బాత్రూంకి వెల్లోచి బెడ్ మీద మూడంకె వేసుకొని పడుకున్నాడు విజ్జూ.

తెల్లారింది ఎలాగు ఆఫీస్ లేదు కాబట్టి అందరూ కొంచెం ఆలస్యంగా నిద్ర లేచారు. కీర్తన సంజు ని బాబుని చూసుకొమ్మని చెప్పి తానె అందరికి టీ పెట్టి టిఫిన్స్ చేసి ఇచ్చింది. అందరి పనులు అయ్యేసరికి 10 గంటలు అయ్యింది. విజ్జూ కూడా హాల్ లోకి వచ్చి  ఆ రోజు వచ్చిన పేపర్ చదువుతూ కూర్చున్నాడు. తర్వాత టీవీ పెట్టాడు. టీవీ వార్తల్లో కరోనా వైరస్ గురించి ఆరోజు కర్ఫ్యూ గురించి ఊదర కోడుతున్నారు.

ఎవరెవరు ఎ ఎ జాగ్రత్తలు తీసుకోవాల, ఇంట్లో ఉవ్న్న వారు ఎలా ఉండాలో సలహాలు చెప్తున్నారు. అది చూసిన విజ్జూ కి గుండెలు జారిపోయాయి అంటే రేపటినుంచి అన్ని ఆఫీసులు బంద్ అని ఎవరూ బయటకి రావద్దని వస్తే జైలుకే అని చెప్తున్నారు.

ఇంతలో  విజ్జూ ఫోన్ మోగింది అతని ఫ్రెండ్స్ అతనికి ఫోన్ లో అరేయ్ రేపటి నుంచి అన్ని బంద్ అంటారా. మన ఆఫీస్ వాళ్ళు కూడా ఇప్పుడే మెయిల్ చేసారు. నీకు వచ్చిందా మెయిల్ అని అడిగారు. ఆ వచ్చిందిరా అని చెప్పాడు విజ్జూ ఇంతలో తల్లి విజ్జూ చేతికి ఒక లిస్టు ఇచ్చి బాబు వెళ్ళి ఈ సామాను తీసుకురా, మళ్ళి మనకు సరుకులు దొరకకపోతే కష్తం. అలాగే ఇంట్లో చిన్న బాబు ఉన్నడు.

ఎప్పుడు ఎ అవసరం ఉంటుందో ఏమో అలానే డబ్బులు కూడా డ్రా చేసుకురా అని అంది. ఆ లిస్టు తీసుకొని బయటకి వెళ్ళి సామానులన్ని తెచ్చాడు. వాటన్నిటిని సర్ఫ్ వేసి మళ్ళి కడిగింది కీర్తన. విజ్జుని స్నానం చేయమని అంది. పేపర్ ని కూడా వద్దని చెప్పారు విజ్జూ తండ్రి తేజ. ఇక అప్పటినుండి మొదలైంది విజ్జూ, సంజు ల అవస్తలు. దాదాపు యాడాది విరహాన్ని తీరడానికి కూడా సమయం చిక్కడం లేదు.

కనీసం ఒక ముద్ద అయినా  పెట్టుకుందామనుకున్నా కూడా వారి అమ్మ నాన్నలు ఎప్పుడు సంజు, విజ్జుల వెనక ఉంటూ కనీసం ఒకరితో ఒకరు మాట్లాడుకునే వీలు లేకుండా చేస్తున్నారు. బాబుని ఎత్తుకుoదం అన్నా చేతులు శుభ్రంగా కడుక్కున్న తర్వాతనే బాబుని ఎత్తుకుంటూ,

అత్తా కోడళ్ళ పనులు అయ్యేంత వరకు వాడితో ఆడుకోవడం ఆ తర్వాత తన ఆఫీస్ పని చేసుకోవడం, తినడం, పడుకోవడం. మరి విసుగొస్తే వంటింట్లో దూరి వంటలు చెయ్యడం. అత్తా కోడళ్ళకు కాసేపు రెస్ట్ ఇవ్వడం వంటివి చెస్తూ ఉన్నా టైం గడవడం లేదు. కనీసం భార్యతో చిన్న ముద్దు ముచ్చట్లు తీర్చుకుందాం అనుకున్నా అత్తగారు ఎక్కడ చూస్తారో అని భయం టో సంజు నిస్సహాయంగా విజ్జూ ని చూస్తూ ఉండేది.

పంచభక్ష పరమాన్నాలు ఎదురుగా పెట్టుకొని నోరు కట్టేసినట్టు భార్యని ఎదురుగా చూస్తూ ఆమెలో కొత్తగా సంతరించుకున్న అందాలను కన్నార్పకుండా చూస్తు ముట్టుకునే వీలు లేక పంచదార చిలుకలా కనీపిస్తున్న భార్యని చూస్తూ తట్టుకోలేక పోతున్నాడు విజ్జూ. ఇద్దరి అపసోపాలను వారి ఇబ్బందులను గమనిస్తున్న తండ్రి నవ్వుకుంటుంటే తల్లి మాత్రం వారిని కన్పెట్టుకొని ఉంది. ఇలా జరుగుతున్నా సమయంలో ఇక తాపాన్ని ఆపుకోలేని విజ్జూ ఒక రోజు రాత్రి సంజుని నీళ్ళు తెమ్మని చెప్పి సంజు చెయ్యి పట్టుకొని లాగాడు తమకంతో ముద్దులు పెట్టుకుంటున్నాడు.

భర్త ఆవేశానికి అతని స్పర్శకు వివశురాలైన సంజు కూడా ఏమి ఆలోచించక అతనికి లోoగి పోతున్న సమయంలో సంజు సంజు అని అరుస్తున్న అత్తగారి గర్జనకు కాదు పిలుపుకు ఉలిక్కి పడి భర్త నుండి విడిపడి గబగబా బయటకి వెళ్ళింది. అత్తగారు సంజుని చూస్తూ సానిటైజర్ చేతి లో వేసి , వెళ్ళి స్నానం చేసి బాబుని ముట్టుకో అని, అంతగా ఆగలేక పోతున్నావా అంది కటినంగా.

ఎన్నడు ఒక్క మాట కూడా అనని అత్తగారు ఆ చిన్న మాట అనగానే సిగ్గుతో కుచించుకుపోయి అక్కడ ఉండలేక బాత్రూమ్లోకి వెళ్ళింది సంజు. ఇంతలో తేజ గారు అక్కడికి వచ్చి ఏంటి కీర్తి ఆ మాటలు పాపం అమ్మాయి ఎంత బాధ పడుతుందో ఒక్కసారైనా ఆలోచించావా అలా చేయడం ఏమైనా బాగుందా అన్నాడు భార్యతో.

అవునండి ఇప్పుడది బాధ పడుతుందని ఏమి అనకుండా కూర్చుంటే రేపు పొద్దున్న  మనం బాధ పడాలి. మన వాడు బాధ పడాలి వాడి కొడుకు బాధ పడాలి నేను అనేది వాడి గురించే. ఒక్క సారి వాడిని చూడండి ఇప్పుడే లోకం లోకి వచ్చిన పసి గుడ్డండి వాడు, వాడి భవిష్యత్తు బాగుండాలి, అంటే వీళ్ళు ఇలాగే ఉండాలి వాడి చిలిపి పనులు, వేషాలు వాడు పెద్దవ్వడం అన్ని తల్లి దండ్రులుగా వాళ్ళు చూడాలనే కదండీ నేను వారిని కలవకుండా చూసేది.

వాడి ముద్దు ముచ్చట్లు, వాడి భవిష్యత్తు చూడాలనే ఇప్పుడు ఇంత కటినంగానే ఉన్నాను. ఈ కరోనా పోయాక వారు ఎంత సంతోషంగా ఉంటే, నేను అంత సంతోషిస్తాను. వారు సంతోషంగా ఉండాలనే కదండీ పెళ్ళి చేసాo ఈ కాస్త కాలంలో కరోనా పోయేదాకా భార్య భర్తలు కలవ కూడదని డాక్టర్లు చెప్తున్నారు. సామాజిక దూరం పాటించాలని చెప్తున్నారు. ఇక భార్యా భర్తలు ఎలా కలుస్తారండి? కొడుకు కోడలు సంతోషంగా ఉంటె చూడాలని నాకు ఉండదా  చెప్పండి కాని మనవడి భవిష్యత్తు బాగుండాలంటే నేను ఇలా ఉండక తప్పదు అంది కళ్లు తుడుచుకుంటూ… రాత్రి సమయం కాబట్టి కీర్తన మాటలు స్పష్టంగా అటూ బెడ్రూమ్లో ఉన్న విజ్జూ కి, బాత్రూమ్లో ఉన్న సంజు కి వినిపించాయి తల్లి మాటలకు కదిలిపోయిన విజ్జూ అత్తగారి ముందు చూపుతో ఆలోచించడం చూసిన సంజు కి కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి. సంజు విజ్జులు  ఇద్దరు తల్లి వద్దకు వచ్చారు.

అమ్మ మమ్మల్ని క్షమించు పది నిమిషాల సుఖం గురించి ఆలోచించాం తప్పితే మా కొడుకు భవిష్యత్తు  గురించి ఆలోచించలేదు. నువ్వు మమ్మల్ని కలవకుండా చేస్తున్నావని తిట్టుకున్నం, కాని, మనసులో ఇంత బాధ పడుతున్నవని ఆలోచించలేక పోయాను. మమ్మ్మల్ని క్షమించు. అని అన్నాడు విజ్జూ. అవునత్తయ్య అమ్మ అందరికి ఉంటుంది కాని అత్తగారు కూడా అమ్మలా ఆలోచిస్తుందని నాకు ఇప్పుడే అర్ధమయ్యింది అమ్మ అని అంది.

అమ్మ అని అంటూ దగ్గరకు రాబోయాడు విజ్జూ. హా హా దూరం దూరం మీ ప్రేమలంతా కరోనా వెళ్ళిన తర్వాత చూపిద్దురులే నన్ను అపార్ధం చేసుకోకుండా అర్ధం చేసుకున్నారు అదే చాలు అంది కీర్తన నవ్వుతూ ఏమో అనుకున్నాం కాని నువ్వు గడుసుదానివే అని అంటూ నవ్వాడు తేజ.. అపార్ధాలు తొలిగిన వేళ అందరూ హాయిగా నవ్వు కున్నారు. ఇంతలో నేనున్నాను అంటూ బాబు కూడా కెవ్వుమన్నాడు.. ……………         

 

Related Posts