కొత్తగా

అబ్బా ఏంటి నువ్వు ఇది తెచ్చి నాలుగు రోజులు కూడా అవ్వ లేదు అప్పుడే నలిగి పోయింది నువ్వే పడుకుని నలగ కొట్టావు అయినా నేను తెచ్చిన పరువులు అన్ని ఇన్ని రోజులు బాగానే ఉన్నాయి గా ఇదేంటి ఒక సంవత్సరం నుండి ఇలా తెచ్చిన నాలుగు రోజులకే అణిగి పోతున్నాయి అంటూ చిరాకుగా పరుపు మీద నుండి లేచాడు అవినాష్. పక్కకు ఒత్తి గిల్లి పడుకున్న అనూష కళ్ళలోనుండి జల జల రాలాయి కన్నీళ్ళు.

తాను చేసిన తప్పేంటో తనకి అర్ధం కాలేదు అనూష కీ ఇలాగే అయిన దానికి కానీ దానికి ఇలా మాటలు అంటూ చిత్రవధ చేస్తున్నాడు అవినాష్.అయినా తను ఓపికగా అన్ని భరిస్తుంది.ఇది ఎప్పుడో కప్పుడు బయట పడుతుందని తను అనుకుంటూనే ఉంది ఇలా ఈ రోజు అతను బయట పడ్డాడు ఇన్ని రోజుల మౌనానికి సమాధానం దొరికింది నాకు. నేను గబుక్కున లేచి హాల్ లోకి  వెళ్లాను అవినాష్ అక్కడున్న సోఫా లో పడుకున్నాడు.

ఏంటి అవినాష్ఏంటి నేను చూస్తూనే ఉన్నాను చాలా రోజుల నుండి నేను గమనిస్తూనే ఉన్నా నన్ను అసలు మనిషిగా కూడా నువ్వు గుర్తించడం లేదు.నేను ఒక దాన్ని ఉన్నా అని కూడా నువ్వు గుర్తించడం లేదు అసలు నా తోనే మాట్లాడడం లేదు నువ్వు .నన్ను కనీసం ప్రేమగా దగ్గరికి తీసుకుని ఎన్ని రోజులయ్యింది చెప్పు అంది కాస్త గట్టి గానే

ఆ మాటలకూ అవినాష్ కూడా కోపం వచ్చి ఎంటే ఏంటి బాగా మాట్లాడుతున్నావుఇన్ని రోజులు పోని లే అని ఊరుకున్నాఇక ఉరుకుంటుంటే ఓ బాగా రెచ్చి పోతున్నావు ఒక్క సారి నిన్ను నువ్వు అద్దం లో చూసుకో ఎలా అయ్యావో అంత లావుగా నిన్ను ఎవరూ అవ్వమన్నారేచీ అసలు నిన్ను దగ్గరికి తీసుకుందాం అని అనుకుంటే ఎక్కడ ముట్టుకోవలో కూడా తెలియడం లేదు

చూడు మొత్తం కిందనుండి పై వరకు మొత్తం ఒకేలా అయ్యావుఆ షేపులు ఏవి ఆ సన్నని నడుము ఏది ఆ నడుముని చూసే కాదే నిన్ను పెళ్లి చేసుకుంది. అసలు వెనక నుండి వచ్చి వాటేసుకుందాం అంటే సరసం అడాలి అంటే నీ నడుము ఎక్కడుందో తెలియడం లేదు ఉన్న దాన్ని నా రెండు చేతులతో పట్టుకుంటే బియ్యం బస్తాను పట్టుకునట్టుగా ఉంటుంది.ఇక ఎలా నిన్ను ప్రేమగా దగ్గరికి తీసుకోవాలో చెప్పు అని అన్నాడు అవినాష్.

అతను అన్న మాటలకూ కోపం తో హ నన్నేం చేయమంటారునేనేం కావాలని మీరు తెచ్చింది తిని ఒళ్ళు పెంచానా ఏంటిఇది పెరగడం నా తప్పా నేను మీకు సుఖం ఇవ్వద్దు అనుకుని పెంచుకున్ననాఇందులో నాకేమైనా సంభందం ఉందా నేను మీకేం తక్కువ కాదు అసలు మీకేం తక్కువ చేయ్యలేదు నాకు మాత్రం ఉండదాసన్నగా ఉండాలి అని ఈ బరువుని బరించడం నాకు మాత్రం ఇష్టమా అయినా మీ వల్లే ఇలా అయ్యిందిమీ వంశాన్ని నిలబెట్టడానికి నేను సిజేరియన్ చేయించుకున్నాను.

మీ వంశాకురాన్ని కాపడడానికి నేను నార్మల్ డెలివరీ కి ఆగకుండా సిజేరియన్ చేసుకున్నా కాబట్టి మీకు మీ కుటుంబానికి ఇద్దరు వంశ కురాలని ఇచ్చినాఅయినా అదంతా మీరు మర్చిపోయినువ్వు ఒళ్ళు పెంచుకున్నావ్ అంటూ నన్ను అవమానిస్తారా ?

అయినా ఇద్దరు పిల్లలు పుట్టిన తర్వాత రెండు సిజేరియన్లు అయ్యాకఆపరేషన్ కుట్లు ఎక్కడ తెగిపోతాయో అని భయం తో కట్టు కట్టని మీ అమ్మగారినిమా అమ్మగారిని ఏమనాలిపిల్లలు పుట్టాకా కూడా పెళ్ళికి ముందు సన్నగా ఉన్నట్టుగా ఉండమంటే ఎలా కుదురుతుందిఐడెమ్ మీరు తెచ్చి పెట్టిన తిండి బలుపు కాదు ఇది హార్మోన్ లోపం వల్ల ఇలా మేము బరువు పెరుగుతంఅయినా చదువుకున్న మూర్ఖులకు చెప్పి లాభం లేదు. 

ఇంతింత మాటలు మాట్లాడిన తర్వాతనన్ను అవమానించిన తర్వాత నేను మీతో ఒక్క నిమిషం కూడా ఉండనునన్ను లావు అయ్యావు అని మానసికంగా వేధిస్తున్నావు అని పోలిస్ కంప్లైట్ ఇస్తేమీ పొగరు మాటలు అన్ని పోతాయి అయినా మిమల్ని మీరు కూడా చూసుకోండి ఒక సారి అద్దం లో నన్ను అనడానికి ముందు మీకు కూడా కింద పొట్టపైన బట్ట రెండూ వచ్చాయి.

అయినా నేను ఏమైనా అన్నానామీతో కలిసి ఉండడం లేదా మిమల్ని భరించడం లేదా చూడండి నేను ఇప్పుడే మీ వాళ్ళ కి మా వాళ్ళకి ఫోన్ లు చేసి విషయం చెప్తానుఅప్పుడు వాళ్ళే చెప్తారు ఏమి చేయాలో లేదా  కేసు పెడితే తిక్క కుదురుతుందని.అని అపకుండా మాట్లాడి ఆయాసం తీర్చుకోవడానికి ఆగింది అనుష.

పోలీసులుకేసుపెద్ద వాళ్ళు అని అనగానే అవినాష్ కి భయం వేసి అది కాదు అనుష అని అంటూ భార్యని దగ్గరికి తీసుకో బోయాడు అవినాష్.ఛి మీరు మీ వేషాలు యే పోలీసులు అని అనగానే అయ్యగారికి చుక్కలు కనిపించాయా మీ వాళ్ళకు చెప్తాను అని అనగానే వారి ముందు మీరు చులకన అవుతానని భయ పడ్డారా మీరేదో పెద్ద నీతి వంతులు శ్రీరామ చంద్రుడు అని మీ వాళ్ళు అనుకుంటున్నారు.

కానీ, మీ వేషాలు పక్కింటి కాంతానికి మీరు రాసిన ప్రేమలేఖలు అన్ని నాకు తెలియవు అని అనుకుంటున్నారా మొన్నటికి మొన్న మీరు ఎదురింటి పంకజనికి  లైను వెయ్యడం నేను గమనించ లేదు అని అనుకుంటున్నారా మీ వేషాలను అన్నింటిని మీ వాళ్ళకు చెప్పి మీ మీద కేసు పెడితే పోయి జైలు లో   చిప్ప కూడు తినాలి అని అంది.

సరే వదిలెయ్యి అను అన్నాడు అవినాష్ ఏంటండి వదిలేసేది నెల రోజుల నుండి నేనెంత నరకం అనుభావించానో అంత బాధ మీరు అనుభవించండి రేపే నా ప్రయాణం ఇక మీ దారి మీది అని అంటూ వెళ్ళి నిండా కప్ఫుకొని నిద్ర పోయింది అనుష అవినాష్ కి ఇంకో మాటకు అవకాశం ఇవ్వకుండా అవినాష్ కీ అంత గందరగోళంగా అనిపించింది కావాలని పేచి ని పెంచానా అనవసరంగా బాధ పెట్టనా అని మనసులో సంఘర్షణ మొదలయ్యింది. 

తెల్లారింది అవినాష్ లేచే సరికి అనూష ఇంట్లో కనిపించ లేదు. ఒక లెటర్ మాత్రం పెట్టి ఉంది అందులో నన్ను వెతకొద్దు అలా అని మా వాళ్ళకు మీ వాళ్ళ ముందు నువ్వు వెధవవు అవ్వకు అని ఉంది. అది చూసి బాధ పడాలో లేదా అనూష ఎక్కడికి వెళ్లిందో ఏమైనా చేసుకుందో అని భయం కూడా వేసింది. అయినా చేసేది లేక నోరు మూసుకుని ఎం జరుగుతుందో చూద్దామని తన పని తాను చేసుకోసాగాడు.

నెల రోజులు గడిచాయి. ఒక రోజు ఆఫీస్ కి వెళ్ళి వస్తుండగా ఎవరో  ఒక అమ్మాయి లిఫ్ట్ అడిగింది అవినాష్ ని నన్ను లిఫ్ట్ అడిగే దమ్ము ఉన్న ఈ అమ్మాయి ఎవరా అని అనుకున్నా అనూష చెప్పినట్టు కింద పొట్ట పైన బట్ట ఉన్న నన్ను ఒక అమ్మయి బైక్ ఆపి లిఫ్ట్ అడిగింది అంటే మనకు రెక్కలు మొలిచి నట్టే కదా అందుకే ఆపాను ఆమె సుతారంగా ఎక్కి కూర్చుని నా భుజం మిద చెయ్యి వేసింది దానికే నేను ఉబ్బి తబిబ్బు అయ్యాను…

కాసేపటికి తను ఎక్కడికి వెళ్తుందో అని ఎక్కడి వరకు అని అడిగాను మీ ఇంటి వరకు అంది దాంతో నేను అహా నా పంట పండింది ఇన్ని రోజులకు నా అనూష మిద పగ తీర్చుకునే అవకాశం వచ్చింది అని అనుకుని ఒక్క చేత్తో నా నలుగు వెంట్రుకలని దువ్వుకున్నా అది చూసి ఆ అమ్మయి ముసిముసి గా నవ్వడం నాకు బైక్ అద్దంలో కనిపించింది.

బైక్ ని ఇంటి దగ్గర పార్క్ చేసి ఎవరూ చూడడం లేదని ఇంటి తలం తీసాను.

ఆ అమ్మాయి ఒక్కాసారిగా లోపలి గెంతింది నేను హుషారుగా లోనికి వెళ్ళాను విజిల్ వేస్తూ ఫట్ మంటూ నా మొఖాన వచ్చి పడింది చీపురు కట్ట ఇదేంటి అమ్మాయి మోటు సరసం అని అనుకుని అలా చూసాను చేతిలో అప్పడాల కర్రతో గర్జిస్తూ మా అనూష కోపంలో కూడా ఎంత బాగుందో సన్నగా వయ్యారంగా ఉన్న అనూషని చూసి ఇది కలనా నిజామా అనుకున్నా అనుష దగ్గరిగా వచ్చి మీ ముసలి మొఖానికి నేనే ఎక్కువ ఇంకోతి కావాల్సి వచ్చిందా మీకు ఇప్పుడు పదండి బయటకు నాతో నేను అందంగా సన్నగా అయ్యాను ఇప్పుడు మీకున్న బట్ట పొట్ట కనిపిస్తుంది అందరికి అని అంది కాళికలా….

అమ్మా తల్లి బుద్ది లేక వాగిన వాగుడు వదిలెయ్యి మీ ఆడవాళ్లు తలచుకుంటే ఏమైనా చెయ్యగలరు అవ్వగలరు అంటూ అనుష కాళ్ళ బేరానికి వచ్చాడు అవినాష్. అతని పొగడ్తలకు పొంగి పోయిన అనుష అతని కౌగిలిలో కరిగిపోయింది.

 

 

నిజమే కదా ఆడవాళ్లు పొగడ్తలకు పొంగి పోయి మగాడిని ఎప్పుడూ గెలిపిస్తూ ఉంటారు కదా… ఆడాళ్ళు మీకు జోహార్లు.. 

Related Posts

5 Comments

  1. చాలా బావుంది మీరు చివరలో అన్న మాట కరెక్ట్. ఆడవాళ్ళు తల్చుకుంటే ఏమైనా చేయగలరు

Comments are closed.