కొత్త వ్యక్తి

పందిట్లో పెద్దవాళ్ళు చిన్నవాళ్ళ అందరూ హడావిడిగా తిరుగుతున్నారు పట్టు చీరలు అటువంటి ఇంట్లో వాసనలు కలగాపులగంగా వస్తున్నాయి. ఎన్నాళ్ళ నుండో కలవని వాళ్లు కూడా కలిసి ఇ యోగక్షేమాలు తెలుసుకుంటున్నారు ముత్తయిదువలు ఒక పక్క చేరి ముచ్చట్లు పెట్టుకుంటూ చీరల గురించి నగల గురించే మాట్లాడుకుంటున్నారు ఇక వయస్సు మళ్ళిన బామ్మలు దగ్గర చేరి ఆ పిల్లలు తమ ని ఎలా చూసుకుంటున్నారు ఏమి యాత్రలు తిప్పింది ఇలా గొప్పలు చెప్తున్నారు ఇక వయసులో ఉన్న మగ పిల్లలు అంతా ఓరగా అమ్మాయిలను చూస్తూ వారిలో తమకు నచ్చిన వారిని ఎన్నుకొని అదిగో ఆ సుందరి నాదే అని ఒకరికొకరు మిగతా వారిని హెచ్చరిస్తూ కథలు నడిపింది వివరంగా చెప్పుకుంటున్నారు.

తామే హీరోలం అన్నా బిల్డప్ ఇస్తున్నారు ఇక మిడిల్ ఏజ్ అంకుల్ అందరూ తమ జీవితంలో ఎలా పైకి వస్తున్నది పిల్లల చదువుల గురించి మాట్లాడుతున్నారు ముసలి తాత అవ్వాలని ఆటపట్టిస్తూ తమ రసిక కథలను మిగతా వారికి చెప్తూ జీవితంలో ఎన్ని ఆటుపోట్లు లను ఎదుర్కొని నిలబడింది మనం చేసుకుంటున్నారు ఇక చిన్న పిల్లలు తమకు అప్పుడే కొత్తగా అయినా స్నేహితులతో ఏవో కొత్త ఆటలు ఆడుతున్నారు మన పనులు అప్పుడే యవ్వన ప్రాయం లోకి అడుగు పెట్టిన కన్నెలు అబ్బాయిల వంక ఓరగా చూస్తూ జారని పదే పదే సర్దుకుంటూ ముసి ముసి గా నవ్వుతూ తిరిగి న దగ్గరే మళ్ళీ తిరుగుతూ, ఏదో పని ఉన్నట్టు అటు ఇటు హడావిడి పడుతూ అందరూ తమ వైపే చూడాలన్నా తలంపుతో గట్టి గట్టిగా మాట్లాడుతూ కుర్రాళ్ళ దృష్టిలో పడాలని తెగ ఆత్ర పడుతున్నారు.

 ఇవన్నీ ఇలా ఉంటే అక్కడ మండపం దగ్గర పంతులుగారు అన్ని సరిగ్గా ఉన్నాయో లేదో చూసుకుంటూ పెళ్లి కూతుర్ని తొందరగా రమ్మని పిల్ల తండ్రి నీ పురమాయించాడు. పిల్ల తండ్రి శేషారత్నం తన ముగ్గురు ఆడపిల్లలు మొదటి పిల్ల వనిత వివాహం చేస్తూ అంతా కొత్తగా కాబట్టి చాలా హడావిడి పడుతున్నాడు అమ్మాయి నీ తీసుకురమ్మని చెప్పడంతో ముత్తయిదువులు అంతా అమ్మాయిని వెంట పెట్టుకుని వచ్చారు. ఆకుపచ్చ,తెలుపు రంగులు కలగలిపిన చీరలో ,చేతిలో కొబ్బరి బొండం తో,కొత్త అందాలతో, మెరిసిపోతోంది వనిత,ఆమెలో ఏవో తెలియని సిగ్గు,భయం, బిడియం,అన్ని ఒకే సారి ప్రతిఫలిస్తూ న్నా యి.నిదానంగా వచ్చి కూర్చుంది వనిత,పెళ్ళి కూతురు రాక తో మిగిలిన వారు  ఒక సారి తిరిగి చూసి తిరిగి తమ పనుల్లో పడిపోయారు.గౌరీ పూజ అయ్యాక,పెళ్ళి కొడుకు చందు వచ్చి కూర్చుని  తాను చేసేదంతా  చేస్తున్నాడు .

పంతులు గారు చెప్పినట్టు,అందరూ ఇక ముహూర్తం కోసం ఎదురు చూస్తున్నా సమయంలో లో అ చిన్న కలకలం ఇవ్వాల్సిన కట్నం లో లో తగ్గింది శోభనం రోజు ఇస్తాను అని శేషారత్నం కుదరదు అని చందు తండ్రి ఇద్దరు మాట మాట పెరగడం తప్ప ఉపయోగం లేకపోయింది ఎంత బతిమాలినా వియ్యంకుడు ససేమిరా అంటున్నాడు ఇప్పటికిప్పుడు పది వేలు ఏవరిస్తారు అని చేతులు పిసుక్కుంటూ నలుగురిలో తలెత్తుకు లేక నల్లగా మారిన ముఖానికి కిందకు దించి బాధగా నిలబడ్డాడు శేషా రత్నం. ముహూర్తానికి ఇంకా ఐదు నిమిషాలు ఉంది ఇవ్వలేకపోతే నా కొడుకుని తీసుకుని పోతా అన్నాడు వియ్యంకుడు పీటల మీద ఉన్న వనిత ముఖం పాలిపోయింది చందు విన్న విననట్టే చూస్తున్నాడు.

ఇంతలో కుర్చీలోంచి ఒక వ్యక్తి లేచి వారి వద్దకు వచ్చాడు. శేషారత్నం భుజం మీద చెయ్యి వేసాడు ఓదార్చు తున్నట్టుగా. అతన్ని ఓ మారు చూసి మళ్ళీ మొహాన్ని తిప్పుకున్నాడు శేషారత్నం. చందు నాన్న వద్దకు వెళ్లి అతన్ని చూస్తూ నీకు ఒక ఆడపిల్ల ఉంటే ఆ బాధ అర్థం అయ్యేది అంటూ జేబులోంచి వంద రూపాయల కట్ట ఒకటి తీసి అతని చేతిలో పెడుతూ మళ్లీ అడిగావ్ అని తెలిస్తే జైలుకే అని చెప్పి మీ దగ్గరికి వెళ్లి అక్షింతలు తీసుకొని వారిని దీవించి తన కళ్ళను ఆడించుకుంటూ బయటకు వెళ్ళిపోయాడు. ఆపదలో ఆదుకున్న ఆ కొత్త వ్యక్తి ఎవరో ఇప్పటికీ తెలుసుకోలేకపోయాడు శేషారత్నం…

—- భవ్య చారు

Related Posts