ఆకలి దప్పికలు మరచి పుస్తకాలను తిరగేస్తూ చదువుకుంటూ, రాసుకుంటూ మహోన్నత శిఖరంపై అడుగుపెట్టాలని సివిల్స్ ,గ్రూపు 1 లాంటి పరీక్షలు వ్రాసేందుకు అహర్నిశలు శ్రమించి చివరకు కన్న కలలు కల్లలై ఫెల్యూర్ తట్టుకోలేక మనస్సు భ్రమించి జీవితాన్ని అధోగతిపాలు చేసుకుంటున్న వారెందరో,,,,,, ఆకలి దుప్పటి కింద తుఫాను గాలికి కూలిపడుతున్న వృక్షాల మల్లే కడుపు గోకుతుంటే తక్షణమే ఒడ్ల మిల్లుల్లో,హమాలీ పనులు లాంటి రకరకాల పనుల్లో మునకలేస్తూ చీకటి గుండెల్లో చిరుదీపం వెలిగించుకునే ఆకలి పోరులో అభాగ్యులు,,,,,మరి
.నీకేల జీవితంలో ఈనిరాశ !? ఉన్నన్నాళ్లు శాంతి లేదు,,,, అన్నట్లు బహుముఖ ప్రజ్ఞ గలిగి ఉన్నత విద్యలు అభ్యసించిన నీ చుట్టూ దారులెన్నో తెరుచుకుని ఉన్నాయి చూడు వాటిల్లోనే ఎంపిక చేసుకుని మహోన్నత వ్యక్తిగా ఎదుగు .దేదీప్యమానంగా వెలిగిపోతావు,,,,,,,
అపరాజిత్
సూర్యాపేట