కొబ్బరి నూనె కొత్తజంట

కొబ్బరి నూనె కొత్తజంట

కొబ్బరి నూనె కొత్తజంట

                                      "అత్తయ్య గారు! ఈరోజు మీ అబ్బాయికి ఇష్టమైన అరటికాయ కూర , మన ఇంటికి వస్తున్న అతిధులకు కాకరకాయ వేపుడు , చికెన్ , మటన్ వండాలి అనుకుంటున్నాను. మీరేమంటారు?" అని అడిగింది పద్మ. 

“నా కొడుక్కి కాకరకాయ కూర చెయ్యి , వస్తున్న అతిధులకు చికెన్ మటన్ చెయ్” అని కోపంగా చెప్పింది కామేశ్వరి.
“అలాగే అత్తయ్య…!” అని చెప్పి , సోఫా పక్కన కింద కొబ్బరి నూనె డబ్బా ఉండడం చూసి కాళ్లతో తన్నేసి కిచెన్ లోకి వెళ్ళిపోయింది పద్మ.
కాసేపటికి అతిధులు పద్మ భర్త వచ్చారు. వాళ్లకి మొదట కాఫీ ఇచ్చి ఆ తర్వాత నీళ్లు ఇచ్చింది కామేశ్వరి అది చూసి ఆశ్చర్యపోయారు ఆ కొత్త జంట అతిధులు.
అయ్యో ఆంటీ గారు కాఫీ తర్వాత నీళ్లు తాగితే నల్లబడిపోతారంట మనుషులు అందుకే మేము తాగం అని వెటకారంగా చెప్పింది అమ్మాయి.
దానికి పద్మ నవ్వు ఆపుకుంటూ కిచెన్ లోకి వెళ్ళిపోయింది.
కబుర్లు తర్వాత భోజనానికి అందరూ కూర్చున్నారు.
ఆ కొత్తజంట తన్ని మంచిది అని అనుకోవాలి అని కామేశ్వరి పద్మ తన భర్తను ఇంటికి వచ్చిన కొత్తజంటను కూర్చోబెట్టి వడ్డిస్తూ ఉంది.
అప్పుడే కామేశ్వరి భర్త తాగేసి వచ్చి , ఇంతకుముందు సోఫా దగ్గర ఒలిగిపోయిన కొబ్బరి నూనె పై కాళ్ళు వేసి , జారుకుంటూ కామేశ్వరి మీద పడ్డాడు.
అప్పుడే కాకరకాయ కూర వండించాలి అనుకున్న సమయంలో తన భర్త వచ్చి తన మీద పడడం ఆ కాకరకాయ కూర వాళ్ళ మీద పడడంతో… కొంత నోట్లో కూడా పడడంతో…
కామేశ్వరి తన భర్త కారం కారం అంటూ గంతులు వేస్తూ ఉంటే అది చూసి నలుగురు పకపక నమ్ముకున్నారు.
పైకి లేపుతాం అంటే లేవలేక పోతున్నారు ఎందుకంటే… నేలపై నూనె ఉంది కాబట్టి.
కామేశ్వరికి కాకరకాయ అంటే ఇష్టం ఉండదు కాకరకాయ తిన్నది అనుకోవా ఆ రోజంతా వింతగా ప్రవర్తిస్తుంది.
ఆ విషయం తెలియని పద్మ కాకరకాయ కూరలో కారం ఎక్కువ వేసింది.
దాంతో వాళ్ళింట్లో రోజు మొత్తం భార్య భర్తలు రచ్చ రచ్చ చేస్తూనే ఉన్నారు.
ఆ దంపతులు ఇంకా అక్కడ ఉండి నవ్వలేక , వాళ్ళ ఇంటికి వచ్చి ఇంకా అదంతా తలుచుకొని నవ్వుతూనే ఉన్నారు.
అదంతా చూసిన పద్మ నవ్వుతూ ఉన్న వాళ్ళిద్దర్నీ ఆపలేక ఎన్నో పాట్లు పడుతున్నాడు కొడుకు.

మాధవి కాళ్ల

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *