కోటి ఔషధాల కొబ్బరి

కోటి ఔషధాల కొబ్బరి -2


6 ఆ.వె.
వేడి కాగలేక వేసవి కాలాన
కొబ్బరి జలములను కోరి తాగు
లేత కొబ్బరి తిను లేచొచ్చు ప్రాణము
మనసు కుదుట పడును మానవులకు !
7 ఆ.వె.
అన్ని దేశములకు అతిథిగా కొబ్బరి
కలిమినిచ్చు కొరకు కాలుపెట్టి
కొబ్బరి ఫల గుజ్జు కోరిన రీతుల
అన్ని వంటకముల యందు జేరు !
8 ఆ.వె.
పంట తోటగాను వంట చెరుకు గాను
ఇంటి నీడగాను యింపు గూర్చు
వేడి కాలమందు వెచ్చగా నుండక
చలిగ,వేడి తగ్గి సొమ్ము నుండు !
9 ఆ.వె.
ఇల్లు కట్టుకొనగ యీ కొబ్బరీ చెట్టు
వాస దూలములకు పనికి వచ్చు
ఆకలి గమనించి అలసిన తనువుకు
అన్నపానములిడి ఆదరించు !
10 ఆ.వె.
ధనికులు కొనగలరు ధరయెంత యైనను
దీన జనుల కోర్కె తీరగలదె?
దిక్కులేని వార్కి దేవుడే దిక్కగు
దీనజనుల దిక్కు దేవళములు !

                              సెప్టెంబర్ 2  కొబ్బరి దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలతో....

                                     కోట పెంటయ్య, విశ్రాంత భాషోపాధ్యాయులు, కారేపల్లి.ఖమ్మంజిల్లా

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *