కోటి ఔషధాల కొబ్బరి

కోటి ఔషధాల కొబ్బరి
*********
1 .ఆ.వె.
కోటి ఔషధాలు కొబ్బరి లో వుండు
మానవులకు మంచి ” మాత్ర” లిచ్చు
అన్ని భాగములును ఆరోగ్య మిచ్చును
తెలిసి వాడుకొనుము తెలుగు బిడ్డ !
2 .ఆ.వె.
పండుగొచ్చెనంటె ప్రతివారు గుడిలోన
కోరి, కొబ్బరి కొని, కొట్టుచుంద్రు
అన్ని దేశములకు ఆచారమయ్యేను
కల్ప వృక్షము గద కొబ్బరనగ !
3 ఆ.వె.
ఏ సమయమునైన, ఏ కాలమందైన
అందుబాటు నుండు నందరకును
బీదవారికైన, బిచ్చగాళ్ళకైన
కొబ్బరికి నిలయము కోనసీమ !
4 తే.గీ.
లేత కొబ్బరి, బోండాలు ” లేమి” యనక
తినుచు,త్రాగుచు వుందురు తనివి దీర
పేదవానికి కోవెల ” పెన్నిధి ” యగు
ఆకలిని,దాహమును తీర్చి ఆదుకొనును !
5 .ఆ.వె.
కొబ్బరి తిన మేలు, కోట్లాది జనులకు
ఉపశమనమునిచ్చు ఉత్తమముగ
వ్యర్థ పుచ్చరాదు,ప్రతిభాగమూ మేలు
అందుకొనుడు భాగ్యమమరు నటుల !

  ప్రపంచ కొబ్బరి దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలతో.....

               ............. కోట .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *