కోడలు తో తంటా

కోడలు తో తంటా

కోడలు తో తంటా

ఒక ఊరిలో రంగమ్మ అనే ఆవిడ కూరగాయలు అమ్ముకుంటు జీవించేది.
ఆమెకు ఒక కొడుకు ఒక కూతురు వాల్లు చిన్నగా ఉన్నప్పుడే భర్త చనిపోవడంతో కూరగాయల వ్యాపారం
సాగిస్తుంది.

పిల్లలు పెరిగి పెద్దవాల్లు కావడంతో కూతురుకు మంచి
సంబంధం చూసి పెళ్లి చేసింది.

కొడుకుకు కూడ సంబంధాలు చూస్తుంది ఇంకా ఎక్కడా
కుదరడం లేదు.

వయసు పై పడడంతో కొంచం చెవుడు కూడ వచ్చింది
కంటి చూపు కూడ మందగిస్తున్నట్టు అనిపిస్తుంది.

దాంతో మంచి కోడలన్నా వస్తె బాగుండునని చాలా
సంబంధాలు వెతుకుతుంది.

కూతురు తరపు బంధువులలో ఒకమ్మాయి బాగుందని
కూతురు ఫోన్ చేసి చెప్పింది.

ఆ సంబంధం చూద్దామని కొడుకును మంచిగా తయారు
చేసుకుని తీసుకుని వెళ్లింది రంగమ్మ.

పెెళ్లి వారికి రంగమ్మ కూతురు ఫోన్ చేసి చెప్పడంతో
వాల్లు అన్ని రడీ చేసుకుని ఉన్నారు.

వీళ్లు వెళ్లగానె కాళ్లు కడుక్కోమని చెంబుతో నీళ్లు ఇచ్చారు రంగమ్మకి. కాళ్లు కడుక్కోమన్నది సరిగా
వినపడక తాగడానికి ఇచ్చారేమెానని తాగబోయింది.

అయ్యెా!!కాళ్లు కడుక్కోండత్తయ్యా అని పెళ్లికూతురు
తమ్ముడు గట్టిగా అరిచి చెప్పడంతో తల పైకెత్తి తాగబోయిన రంగమ్మ చటుక్కున తల దించి కాళ్లు
కడిగింది.

లోపలికి వెళ్లగానె కుర్చీలు చూపించి కూర్చోమనగానె
కుర్చీలల్లో కూర్చున్నారు ఇద్దరూ.

పరిచయకార్యక్రమాలయ్యాక కాసేపటికి పెళ్లి కూతురును
తీసుకొచ్చి చాపలో కూర్చోబెట్టారు.

అమ్మాయిని చూడగానె రంగమ్మ కొడుకుతో తాజా టమాట పండులాగ ఉంది కదరా! అంది రంగమ్మ గుస
గుసగా!!

అవునే అమ్మా బాగుంది అన్నాడు కొడుకు.
అమ్మాయి పేరేమిటి? అడిగింది రంగమ్మ.

అమ్మాయి పేరు సురేఖ అంది వాల్ల అమ్మ.
సు … వినపడక రంగమ్మ మా వాడికి తగ్గ పేరే!!వాడి
పేరు లక్ష్మణ్ అమ్మాయి పేరు రేఖ ఇద్దరిది కలిపితె
లక్ష్మణరేఖ బాగా కుదిరింది అంది రంగమ్మ.

అయ్యెా!!వట్టి రేఖ కాదు సురేఖ అన్నాడు పిల్ల తమ్ముడు
ఏదయితె ఏంటిలే! అల్లుడు? రేఖ అయితే ఉంది కదా!
అంది రంగమ్మ.

అమ్మాయి నచ్చిందా?అని అడిగాడు అమ్మాయి వాల్ల నాన్న.
టమాట పండు లాంటి కలరు పొట్లకాయ లాంటి పొడుగు
దొండపండు లాంటి ముక్కు బెండకాయల్లాంటి వేళ్లు
నేరేడు పళ్ల లాంటి కళ్లు ఇంత బాగుంటె ఇంకా ఎందుకు
నచ్చదు అంది.

ఏమిటీవిడ అన్నీ కూరగాయలు పళ్లతో పోలుస్తుంది?
అనుకున్నారు వాల్లు.

మెుత్తానికి అమ్మాయి నచ్చిందని చెప్పారు కట్నకానుకలు
మీ ఇష్టం అన్నారు.

వచ్చేటపుడు అమ్మాయి వాల్ల అన్నకు ఓ సలహా ఇచ్చింది
రంగమ్మ.

బెండకాయలాగ ముదిరిపోకు నువ్వు కూడపెళ్లి చేసుకోమని.

కట్నం విషయం ఎక్కువ పట్టింపు లేకపోవడంతో అమ్మాయి వాల్లకు సంబంధం నచ్చేసింది.

దాంతో పెళ్లి జరిగిపోయింది.రంగమ్మ కోడలును చూసి
ఊరి వాల్లంతా రంగమ్మను ఒకటే మెచ్చుకోవడం.
అంత అందమయిన అమ్మాయిని కోడలుగా చేసుకుందని
మంచి సంబంధం చేసావని అందరూ అనడంతో కించిత్తు
గర్వంగా ఫీల్ అయింది రంగమ్మ.
ఇక ఇంటికి కొత్త కోడలు వచ్చింది.కోడలికి ఇంటి బాధ్యతలు పనులు అప్పచెప్పాలనుకుంది రంగమ్మ.
పొలం దగ్గరకు వెళ్లి కూరగాయలు తెంపుకరావడం
ఇంట్లో పెరట్లో కాసినవి తెంపడం లాంటివి చెప్పాలనుకుంది.
తీసుకొచ్చిన కూరగాయలన్ని ఇంటి ముందు ఉన్న టేల
లో పెట్టి అమ్మడం తను చేసుకోవాలనుకుంది.
ఇంటిపని వంటపని కోడలుతో చేయించాలి.లేకపోతె టమాట పండు లాంటి కోడలును కొట్లో కూచోమంటె
బాగుండదు. అంతా మగవాల్లు కూడ వస్తారు. ఎవరి చూపు ఎలా ఉంటుందో అనుకుంది.
పొలం చూపించమని ముందే కొడుకుకు చెప్పి ఉంచింది
కోడలు వచ్చి అత్తా పట్నం పోయి సినిమా చూసి వస్తాం!
అంది.
రంగమ్మకు కొద్దిగా చెవుడు కదా! పొలంకి వెళ్తా అంటుంది
అనుకుని మంచి మంచి వన్నీ తీసుకురా! అని చెప్పింది
తనేమెా కూరగాయలనుకుని చెప్పింది.
కోడలుకేమెా పట్నం వెలుతున్నాం కదా!ఏవయినా మంచి
వస్తువులు కనపడితే తెమ్మంటుంది అనుకుంది.
సరేలే అని తలూపి తుర్రున పారిపోయింది.
మెుగుణ్ణి తీసుకుని పట్నం చెక్కేసింది.

వెళ్లినవాల్లు ఇంకా రావడం లేదు ఇంత సేపు ఏమిటి
అనుకుంది రంగమ్మ.

తీరా వాల్లు రాత్రయ్యాక సినిమా చూసి వచ్చారు.
సినిమా అని తెలిసినాక పెద్ద యుద్దమే చేసింది రంగమ్మ.

అమ్మెా! అత్తగారితో జాగ్రత్తగా ఉండాలనుకుంది కోడలు.
కాని వంటపనులు కూడ ఏమీ రావు తనకి ఎలాగో
అనుకుంది.

తెల్లవారంగానె కోడలుతో రంగమ్మ బర్రె పేడ తీసి వాకిలి
లోపల అలుకు చల్లు అంది.
సరే! అత్తా అని వెళ్లిన కోడలు పేడ తీసి వాకిలి లోపల అంటె ఇంట్లో అనే కదా అర్థం అనుకుని ఇంట్లో అంతా
పేడతో చల్లేసింది. అది సిమెంటు చేసిన ఇళ్లు.

రంగమ్మ చూసి అయ్యెా!అయ్యెా! ఇదేం పనే! వాకిట్లో
చల్లమంటె ఇంట్లో చల్లావు? ఏం మనిషివే! అని కోపంగా
అరిచింది.
నువ్వే కదా!అత్తా లోపల చల్లమన్నావు?అంది ఆ కోడలు
పిల్ల.
లోపల అంటె లోపల కాదె బయట వాకిట్లో  అన్నాను
అంది.
నాకు లోపల అనే తెలిసింది అత్తా ఇంకేం
నాకు తెలియదత్తా! అని గారాలు పోయింది సురేఖ.
మళ్లీ రంగమ్మే అంతా కడుక్కుని సరేలే!!వంటయినా
మంచిగా చేసి తగలడు అంది కోపంగా.
ఏం కూర చేయమంటావత్తా?అడిగింది సురేఖ.
ఆ… ఏం చేస్తావు? పాలకూర చేయి.కొంచం పప్పు కూడ
చేయంది.

సురేఖ బాగా ఆలోచించి మళ్లీ అత్తను అడిగితే బాగోదని పాలతో కూర చేయడం ఎలా?? అని పరి పరి విధాల ఆలోచించి
పాలను బాగా మరిగించి దాంట్లో ఉప్పు కారం వేసింది.
పప్పునేమెా ఉడకబెట్టకుండానె పొయ్యిమీద గిన్నె పెట్టి
దాంట్లో పోసి ఉంచింది.
రంగమ్మకు ఏదో మాడుతున్న వాసన ముందట కొట్టులో
కి వచ్చింది.
మల్లేం కొంప ముంచిందోనని పరిగెత్తుకుని వచ్చేసరికే
చెయ్యాల్సినవన్ని చేసేసింది.
ఏంటే ఏం చేసావు??మాడు వాసన వస్తుంది అని అడిగింది.
ఏం లేదత్తయ్యా! పాలతో పాలకూర చేసాను పప్పును
కూడ పప్పు చేసా! అంది.
ఏంటి? పాలతో కూర చేసావా? నీకు పాలకూర కూడ
తెలియదా తల్లీ?
ఏదీ చూపించు అని చూసేసరికి పాలన్నీ పాడు చేసింది
పప్పు అంతా మాడ్చి పెట్టింది.
రంగమ్మకు దిమ్మతిరిగి మైండ్ బ్లాక్ అయింది.
ఏదో అనుకుంటె ఏదో అయింది.
టమాట పండు లాంటి కోడలని మురిసిపోతె కాకరకాయలా ఇంత చేదుగా ఉందేమిటి?? ఇంకా ముందు ముందు ఎన్ని చేస్తుందో!!
పచ్చి వెలక్కాయ నోట్లో పడ్డట్టయ్యింది నా పని…
ఈ కోడలుతో జీవితాంతం ఎలా వేగాలో అనుకుంది….

ఉమాదేవి ఎర్రం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *