గాంధీజీ కలలు కన్నారు . గంగలా ప్రవహించాలి ధర్మం అని .

అంశం : ప్రతిఘటన.
శీర్షిక : చెడుని నిర్మూలిద్దాం..

గాంధీజీ కలలు కన్నారు .
గంగలా ప్రవహించాలి ధర్మం అని .
అధర్మం ఉప్పెనలా ఉరుకుతుంది .
పదిమంది కలసి తొబై మందిని అణగత్రొకుతున్నారు అధికారకంగా.
మేలుకో హృదయమా మేలుకో .
నేర్చుకో కొంతైనా నేర్చుకో
ఓర్పు మాని ప్రతిఘటించు .
పట్టుపట్టి ధర్మాన్ని నిలబెట్టు .
నాదాకా చేరక ముందే ప్రతిఘటించు.
ముందు తరాలకు నీతి న్యాయం అందించే యుద్ధం ఆపకు .
రేపటి తరాలకు తరిగిపోతున్న ఖనిజ సంపదను తరలి పోకుండా ప్రతిఘటించు..
సమాజంలో జరుగుతున్న అన్యాయాలను ప్రతిఘటించు..
నీదాక వచ్చేదాక ఆగకు నీ తోటివారికి జరిగినప్పుడే ప్రతిఘటించు..

కొంతైనా మిగులుతుంది ధర్మం .
ప్రతిఘటించడం మానుకుంటే
లేదు రేపటి పౌరులకు ఉండదు
ప్రగతి …

ఆలపాటి వారి అమ్మాయి సత్యవతి .
నా స్వీయ రచన నా హామి …

Related Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *