గాంధీ జయంతి

అక్షర కొరకు
అంశం : గాంధీ జయంతి

అందరి నోట తాత….
ఎవరి తాత…
పసి పిల్లవాడు నుండి ముసలి వాని వరకు అందరి నోటా గాంధీ తాత అనే పిలుపు..
ఆ పిలుపువెనక ఎంత గొప్పతనం దాగుందో….
ఒక మనిషి జన్మదినాన్ని కోట్లాదిమంది స్మరించుకునే రోజుగా మారింది అంటే ఆ వ్యక్తి జీవితం ఎన్ని కష్టాలను ఎన్ని
ఓటములను ఎదిరించి ఉండాలి…
చాలా సమస్యలు మౌనంతోనే పరిష్కారం అవుతాయని తెలిపిన గొప్ప వేత్త…
నేతాజీ బాటలో ఎంతోమంది వీరులు మన దేశం కోసం పోరాటం చేశారు….
రక్తం మరుగుతున్న
కత్తులు కదులుతున్న సత్యమేవ జయతే అంటూ ముందుకు నడిపించాలనుకున్నారు….
మన దేశం కోసం ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపారు…
గెలుపు అనేది ఒకరు మనకు ఇచ్చేది కాదు మన కృషితో మనమే సంపాదించుకోవాలని చెప్పారు…
సత్యమనే సామ్రాజ్యాన్ని నిర్మించాలని న్యాయం అనే న్యాయకత్వంలో అందరూ నడవాలని చెప్పిన గొప్ప వ్యక్తి మన గాంధీజీ….

ఈరోజు ఇంత గొప్పగా భారతదేశం జీవిస్తుంది అంటే ఆ రోజు ఆయన పోరాటం…
సత్యమేవ జయతే…🙏🏻

ఇది నా స్వీయ రచన
యామిని .లింగం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *