"C_PLJ4CZpdxQ0": { "on": "visible", "vars": { "event_name": "conversion", "send_to": ["AW-10942541090/v-d1CN7kpM4DEKLa5-Eo"] } }

గాయపడిన హృదయం

గాయపడిన హృదయం

శరీరం గాయపడితే
మందులతో తగ్గేను.
మనసు గాయపడితే
తగ్గేందుకు మందేది?
చీకట్లు నిండిన జీవితంలో
వెలుగు రేఖలు రావాలి.
మనసులోని దుఃఖాన్ని పారద్రోలి ఆనందాన్ని నింపాలి.
ఆనందంగా మనం ఉంటే
ఆ కన్నీళ్ళే ఆవిరైపోవా.
ధైర్యంగా మనం ఉంటే
మన కష్టాలే తొలగిపోవా.
పోరాటం చేయకపోతే
మన జీవితం మారదులే.
పోరాటం చేసేద్దాం.
జీవన గతి మార్చేద్దాం.

ఈ రచన నా స్వీయ రచన
అని హామీ ఇస్తున్నాను.
వెంకట భానుప్రసాద్ చలసాని.

Related Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *