గాలి పటం

మేడ పైన నిల్చున్న ప్రసన్న కాలికి ఒక గాలిపటం తగులుతుంది , అది సంక్రాంతి అవ్వడం పిలలు ఎవరో ఎగిరేస్తూ ఉంటె తెగి ఇక్కడ పడి ఉంది అనుకుని

వెళ్తుంటే అక్కడ గాలి పటానికి ఒక లెటర్ ప్లీజ్ ఈ లెటర్ రవి దెగ్గరకి చేర్చండి అని ఉంటుంది ఏంటి ఇది అన్నట్లు చూసి తీసి చదువుతుంది.అందులో లెటర్ ఇలా స్టార్టు అవుతుంది .

ఈ లెటర్ చదివిన ఎవరైనా దయచెసి రవి కి నా పరిస్థితిని వివరించండి .రవి మనం ప్రేమించుకున్నందుకు మా నాన్న మనలన్నీ విడదీసాడు అందుకు నన్ను ఇంటికే పరిమితం చెసారు.

నువ్వు లేని జీవితం నాకు వద్దు . నువ్వు వచ్చి నన్ను తీసుకెళ్తావ్ అని ఎదురుచూస్తున్న నువ్వు ఎందుకు రావడం లేదో నాకు తెలిటం లెదు.కాని వచ్చే నెలలో మూడో తారీకు నా నిశ్చితార్థం నువ్వు వస్తావని ఎదురు చూస్తున్న,

నా దగ్గర ఫోన్ లెదు బయటకి పంపడం లెదు గత్యంతరం లేక ఇలా చేస్తున్న , ఇందులో రవి అడ్రస్ ఉండి ఈ లెటర్ పోస్ట్ చేసే  పరిస్థితి లో  నేను  లేను ఎవరికయినా ఇచ్చి పోస్టు చేసి ఏప్పటికి చేరుతుందో తెలిదు

అందుకె ఈ లేటర్ చదివినా వారు వెళ్లి ఇవ్వండి ప్లీజ్ అంటు ముగిస్తుంది.ప్రసన్న రవి వాళ్ళ ఇంటికి వెళ్తుంది.అక్కడ పరిసరాలను గమనిస్తుంది.

ఎప్పుడో  పూర్వ కాలం ఇల్లులా కనిపిస్తుంది లొపలికి ఒక్కో అడుగు వెస్తూ అక్కడే ఆగి ఒక దృశ్యాన్ని చూస్తుంది . అక్కడ ఒక పెద్దావిడ ఒక పాతికేళ్ళు  ఉంటాడేమో అతనికి  అన్నం తినిపిస్తుంది .

పాతికేళ్ల అబ్బాయికి తినిపిస్తున్నట్లే ఉన్న అతను ఇంక మానసికంగా ఎదగలేదు అనిపిస్తుంది . పొలమారుతుంటే అయ్యో మంచి నీళ్లు తేవడం మరిచిపోయానే అంటుండగా ప్రసన్న వాటర్ అందిస్తుంది.

 ఎవరమ్మా నువ్వు అని అడుగుతుంది ఆ పెద్ద ఆవిడ.నమస్తే ఆంటీ నా పేరు ప్రసన్న రవి గారిని కలవాలి . ఎందుకమ్మా రవిని కలవడం ఆ వివరాలు తరువాత చెప్తా ఆంటీ రవి గారు ఉన్నారా పిలవండి

అదిగో ఆ మంచం మీద ఉన్నవాడే రవి .ప్రసన్న షాక్ ఇందాక చూసిన అతనే రవి అంటే నమ్మకం కలగడం లెదు . కాని తనని ఆ అమ్మాయి ఎలా ప్రేమించింది అంటు తెలీకుండానే బయటకి అనేస్తుంది.

ఆ మాట విన్న పెద్దావిడ ఎవరు నువ్వు అసలు పద బయటకి అంటు ప్రసన్న చెయ్యి పట్టుకుని బలవంతంగా లాక్కొని వస్తుంది.

 ఆంటి చెప్పేది విన్నండి అంటున్న వినకుండా బయటకి లాగేసి తలుపు వెస్తూ ఇంక రాకు అంటారు ఆ పెద్ద ఆవిడ . ఈ విషయం ఆవిడకి ఎలా చెప్పాలి .

ఆవిడ పేరు కూడా తెలీదే రవి అని పేరు రాసిన ఆవిడ తన పేరు కూడా చెప్పలేదు ఎలా అంటు ఆలోచిస్తూ రవి గారి ఇంట్లొ లొపలికి వెళ్తూ గోడ మీద చూసినా కాలేజీ ఫ్రెండ్స ఫొటోస్ చూసింది ప్రసన్న

 ఆ కాలేజీ కి వెళ్ళి ఆరా తీస్తుంది . రవి అని ఒక్క పేరు మీద ఏం చెప్తాం అండి ఫోటో అయిన వుందా అంటే లేదు అంటుంది.  మే బీ రవి గారి ఇంట్లొ చూసింది.

లాస్ట్ ఇయర్ ఫొటొ అది ఫైనల్ ఇయర్ లో తీయించుకున్న పిక్ అంటే తనతో చదివే వారు ఎవ్వరు ఇక్కడ ఉండి ఉండరు ఎలా అంటూ ఆలోచనలో పడ్తుంది . అలా వారం రొజులు అయిపోతుంది .

వారం గడుస్తున్న ఒక చిన్న క్లూ దొరకలేదు అంటు తన క్లాసుమేట్ తో ఈ విషయాన్నీ  షేర్ చేస్తుంది . తను ఈ మాత్రం దానికి ఇంతలా  ఆలోచించాలా కాలేజీ ప్రిన్సిపాల్ ని కలిసి తన రికార్డు వెతుకు ఫొటొ వస్తుంది అని

అవును కదా అని వెళ్ళి ప్రిన్సిపల్ ని అడుగుతుంది.ఆయన  కాస్త ఎవరు ఎందుకు అని ఆరాతీస్తూ ప్రిన్సిపల్ కూడా వెళ్ళగొడతాడు .

ఈ హోప్ కూడా పోయింది అనుకుని బాధపడ్తుంటే ఆ కాలేజీ ప్యూన్ నేను ఇస్తా కాని నాకు రెండు వేలు  కావలి అంటాడు సరే అని వెయ్యి ఇచ్చి పని అయ్యాకా ఇంకో వెయ్యి ఇస్తా అంటుంది .

ప్యూన్ అనుకున్నట్లు గానే రెండు రోజుల్లొ ఫొటొ ఇస్తాడు .ఆ ఫొటొ పట్టుకుని జూనియర్స్ దగ్గరికి వెళ్ళి అడిగి రవి గురించి ఇన్ఫర్మేషన్ తిసుకుంటుంది.

అప్పుడు ఒక జూనియర్ రవి ప్రేమించిన అమ్మాయి తెలుసు అని తన ఇంటికి తీసుకెళ్తాడు. అక్కడ మమత వల్ల నాన్నగారు (రవి ప్రేమించిన అమ్మాయి పేరు మమత) ప్రసన్న ని రానివ్వరు.

పై నుండి చూస్తున్న మమత మేడ పైనుండి రాయి విసురుతుంది. ప్రసన్న ఒక లెటర్ ఆల్రెడీ రాసి పెట్టుకుంది ముందుగానే  సిట్యుయేషన్  ని  అర్థం చేసుకుని నెక్స్ట్ డే  ఎంగేజిమెంట్  బిజీ గా ఉంటె ప్రసన్న వెళ్ళి లెటర్ ఇస్తుంది.

ఆ లెటర్ రవి పరిస్థితిని వివరిస్తూ ఉంటుంది.అప్పటి వరకు ఎటువంటి సాహసం చెయ్యని మమత ఎంగజేమేంట్ కాన్సల్ చేసుకొని వాళ్ళ నాన్నని ఎదిరించి ప్రసన్న తో రవి దగ్గరకి వెళ్తుంది.

రవి ఎప్పటికి మాములు మనిషి  అవుతాడో తెలికపోయినా తనకి పెళ్ళి కాని భార్యలా అని సపర్యలు చేస్తుంది ఏనాటికైనా రవి మాములు మనిషి కాకపోతాడా అన్న ఆశతో జీవితం తో ముందుకి వెళ్తుంది.

అందరి ముందు ఎంగజేమేంట్ క్యాన్సెల్  చేసి తన పరువు తీసిన మమత ని దూరం పెడతాడు తండ్రి. మమత చదివింది డిగ్రీ  అయినా రవి ని చూసుకుంటూ ఇంట్లోనే ట్యూషన్స్ చెప్తుంది.

రవి గారి అమ్మ గారు వంట  మనిషిగా చేస్తూ ఉన్నదాంట్లోనే సర్దుకుంటూ హ్యాపీ గా ఉంటున్నారు మమత ఫాదర్ స్టేటస్ కె వాల్యూ ఇస్తారు.

మమత రవి ని ప్రేమిస్తుందని తెలుసుకుని లాస్ట్ ఇయర్ ఫైనల్ ఎక్సమ్ అయిపోయాక రవి వల్ల ఇంటికి వెళ్ళి రవి నీ బెదిరించే క్రమం లో ఒకరిమీద ఒకరు చేయి చేసుకోవడం తో ఫస్ట్ ఫ్లోర్ నుండి కింద పడ్డ రవి కి తలకి గాయం అవడం తో పిచ్చివాడు అయిపోతాడు.

రవి త్వరగా కోలుకోవాలని మనం కోరుకుందాం.. ప్రసన్న లాంటి అమ్మయిలు ఉన్నత కాలం నిజమైన ప్రేమకి ఓటమనేదే ఉండదు.రవి పరిస్థితి కి కారణమైనా మమత తండ్రిని రవి కుటుంబ సభ్యులు మన్నిస్తారో లేదో కాలమే చెపుతుంది… ..

—— ముత్యాల కీర్తన

Related Posts