గిరిజా కళ్యాణం చివరి భాగం

 

అర్జున్ గిరిజ ని చూస్తూ ప్రేమనోఎదో అలజడి కి గురి అవుతున్న సమయంలో నర్సు వచ్చి భార్యకు అలా ఉండగా నువ్వు ఇలా ఏమి పట్టనట్లు గా  రావడం ఏంటి అని అంటుంటేఅర్జున్ రక్తం కోసం బయటకు పరుగు పెట్టడం తోమెలకువ వచ్చి నర్సు మాటలు విన్న గిరిజ తాను కోరుకున్న వ్యక్తి కి ఇదివరకే పెళ్లి అయ్యిందని తెలుసుకునితాను కోరుకున్నది అతన్నే కాబట్టిఅయ్యో నాకు ఇలా జరగడం ఏంటి?

ఒక వ్యక్తిని ఇష్టపడితే ఆ భగవంతుడు ఇలా మాయ చేయడం ఏంటిఅతనే నా కలల రాకుమారుడు అని అనుకున్నానే అని మనసులో కాసేపు బాధపడినాఅతని భార్య ప్రాణాలతో పోరాడుతున్నది అని తెలిసి మానవత్వం మేలుకొని చ నేను ఇలా ఆలోచించడం ఏంటి అవతల ఒక ప్రాణం కొట్టుమిట్టాడుతున్నదినా వంతు సహాయం నేను చేయాలి అని అనుకునిప్రేమ ఎప్పుడూ త్యాగన్నే కోరుతుంది కదా అని అనుకుంటూక్షణాలలోనే ఇంతగా ఆలోచన చేసిన గిరిజ వెళుతున్న నర్సుని వెనక్కి పిలిచితనది అదే గ్రూప్ రక్తం అనిఇవ్వడానికి తనకేం అబ్యంతరం లేదని అనడం తోసంతోషంగా ఆ నర్సు గిరిజని సుప్రియ ఉన్న గదిలోకి తీసుకుని వెళ్లిఅక్కడ ఉన్న డాక్టర్ తో విషయాన్ని వివరించింది

అంతకు ముందే అతను గిరిజను చూసి ఉండడంతోఅమ్మా నువ్వు ఎవరో కానీ ఇలా నీకు యాక్సిడెంట్ అయినా రక్తం ఇవ్వడానికి వచ్చావు అంటే  నీకున్న ధైర్యానికి మెచ్చుకోవాలి అని అంటూ బెడ్ ని చూపించాడు గిరిజ మొహం మీద చిరునవ్వు విరిసింది హ ఇది ధైర్యం కాదు డాక్టర్  నేను కోరుకున్న నా ప్రియుడి భార్య  బతికితే  అతను సంతోషంగా ఉంటే చూడాలని కోరుకునే ఒకే ఒక వ్యక్తిని నేను మనసులో నా ప్రేమ దాచుకోవడం మంచిది అయ్యింది లేదంటే అతని ముందు తన మనసు తెరిస్తే చులకన అయ్యేదాన్ని ఏమో పోనీలే నాకు తగినవాడు ఎక్కడో ఒక దగ్గర ఉండే ఉంటాడు ప్రేమలో ఓడిపోవడం కూడా మంచికేనేమో అని అనుకుంటూ కళ్ళు మూసుకుంది గిరిజ

ఇక అక్కడ సుధాకర్ తన కూతురుకు ఏమైందో తెలియక సతమతవుతున్నాడుడాక్టర్ లు ఏమీ చెప్పడం లేదుపోనీ అర్జున్ అయిన కనుక్కున్నాడేమో అని అనుకుంటే అతను కూడా కనిపించడం లేదని వస్తున్న వెళ్తున్న డాక్టర్ ల వెనక వెళ్తున్నాడు వస్తున్నాడు కానీ వాళ్ళు ఏమి చెప్పడంలేదుఇంతలో అర్జున్ పరుగులు తీస్తూ రావడం గమనించిన సుధాకర్ ఎదురుగా వెళ్ళాడు

అతన్ని పట్టించుకోకుండా అర్జున్ బ్లడ్ బాటిల్ ని డాక్టర్ లకు ఇవ్వబోయేంతలో డాక్టర్ వచ్చి హలొ బాబు నీ పేరేంటి అని  అడిగాడు అర్జున్ సార్ అని చెప్పాడు  అర్జున్ చూడయ్యా బాబు రక్తo ఇక అవసరం లేదునువ్వు తీసుకుని వచ్చిన  అమ్మాయి నీ భార్యకు రక్తదానం చేసిందయ్య  చాలా ధైర్యవంతురాలు ఆ అమ్మాయి వేరే ఎవరైనా అయితే పారిపోయేవారు ఇక నీ భార్యకు ఏమి భయం లేదయ్య ప్రాణం గట్టిది పైగా నీ స్నేహితురాలు రక్తం కూడా ఇవ్వడంతో ప్రాణాపాయం నుండి బయట పడింది అని అన్నాడు డాక్టర్

ఆ మాట వినగానే సుధాకర్ మొహం లో వెయ్యి బల్బులు వెలిగినట్టు వెలిగిపోయిoది గబగబా లోనికి వెళ్లి చూడబోయాడు సుధాకర్ కానీ డాక్టర్ అడ్డు పడుతూ ఇప్పుడే కాదు ఇంకో గంట అయ్యాక మీరు మీ అల్లుడు గారు వెళ్లి చూడండి అని అంటున్న డాక్టర్ ని  అయోమయంగా చూసాడు సుధాకర్ అసలు అతనికి సుప్రియను అర్జున్ కి ఇచ్చి చేయాలనే ఆలోచన లేదుకానీ గంటక్రితం తనకు తన భార్య సునంద కు జరిగిన సంభాషణ గుర్తుకు వచ్చి అవునవును మా అల్లుడు తో కలిసి వెళ్లి చూస్తా అని అన్నాడు సుధాకర్.

ఏమండి మన అమ్మాయి ఎదో కానీ పని చేసిందండీ అందుకే ఇప్పుడు ఇలా చేసుకుందని నాకు ఈ రోజే అర్ధం అయ్యింది. ఇన్ని రోజులు తనని మీరేం అననిచ్చే వారు కాదు. ఒక నాలుగు రోజుల క్రితం నేను తన గదికి వెళ్ళినప్పుడు తన గది లో కొన్ని ఉత్తారాలు కనిపించాయి అవి మీకు చూపిద్దాం అని అనుకున్నా కానీ మీరు తీరిక లేకుండా ఉన్నారు అంతలోనే ఈ ఘోరం జరిగింది అని ఏడుస్తున్న భార్యని అయోమయంగా చూసి ఏవి ఆ ఉత్తరాలు అని అడిగాడు సుధాకర్.

అవి తీసి చదివేసరికి విషయం అంతా అర్ధం అయ్యి, నిజంగానే తన కూతురు తప్పు చేసిందని అందువల్లే ఇలా చేసుకుందేమో దీనికి కారణం ఎవడో ప్రభాకర్ దీన్నేలా పరిష్కారించాలి అనే క్షణాల్లోనే అలోచించి అర్జున్ కళ్ళలో మెదిలి నిమిషాల్లోనే అతన్ని అల్లుడిగా చేసుకోవాలనే క్రూరమైన ఆలోచన రాగానే పెదవుల మీద వంకర నవ్వు విరిసింది. దాంతో భార్య తో నువ్వేం కంగారు పడకు సునంద మన అర్జున్నే మన అల్లుడిగా చేసుకుందాం ఏమంటావు అన్నాడు. ఏమండి అది కాదండి వాడెవడో ప్రభాకర్ అంట ఇది అన్యాయం అండి అంది సునంద కంగారుగా.. ఛి నోర్ముయ్యి మాట్లాడకు నేను చెప్పింది వినడమే నీ పని అంతే నోరు మూసుకో ఏది చెప్పినా మన కూతురి కోసమే ఇక నువ్వు ఏం మాట్లాడక అని భార్య నోరు మూయించాడు సుధాకర్.భర్త చెప్పినట్టుగా వినక పోతే ఏం జరుగుతుందో తెలుసు కాబట్టి ఏం అనకుండా నోరు మూసుకుంది సునంద..

ఇదంతా గుర్తొచ్చి ఇప్పుడు డాక్టర్ ముందు అర్జున్ ఏమంటాడో అతన్ని ముందుగా మానసికంగా సిద్దం చేయడానికి ఇలా అన్నాడు అతని ముఖ కవళికలు జాగ్రత్తగా పరిశీలిస్తూన్న సుధాకర్.ఇది జరిగింది.

*******

కనీసం కూతురి గురించి ఆలోచించకుండా, తన ఇష్టా ఇష్టాలు తెలుసుకోకుండా, అసలు ఏం జరిగిందో కూడా అడగకుండాఅప్పటిదాకా తననో చీడ పురుగులా ఒక అనాధలా, ఒక పనివాడిగా చూసిన మామయ్య ఇప్పుడు ఆయనకు ఎదో ఆపద,. ఆపద ఏంటి కూతురు చేసిన పనికి సిగ్గు పడకుండా చెడిపోయిన తన కూతుర్ని తనకు ఇచ్చి కట్టబెట్టాలని తిరిగి తనను ఒక జీతంలేని పనివాడుగా జీవితాంతం చాకిరి చేయించుకోవాలని చూస్తూ ప్లాన్ వేస్తున్న మేన మామ అత్తయ్యలను వీళ్ళు మనుషులేనా అని అనుకుని అత్తమామలను ఛీత్కారంగా చూస్తూ..

“చూడు మామయ్య ఇన్ని రోజులు  మీరేం చేసినా తిట్టినా పనివాడిలా చూసినా మీ అప్పు తీరడానికి మీ దగ్గర కుక్కలా విశ్వాసంగా పనిచేశాను అలా అని మీరేం చెప్పినా నోరుముసుకుని చేస్తా అని అనుకోకండిఇన్ని రోజులు మా అమ్మ బాధ పడుతుంది అని ఈ విషయాలు ఏవి ఆమెకు చెప్పలేదు కాబట్టి ఇంకా మీరు మంచివాళ్ళు అనే నమ్ముతుంది మా అమ్మ ఇకపోతే  సుప్రియ అంటే నాకు కోపం కానీద్వేషం కానీ లేదు అలా అని పెళ్లి చేసుకునేంత ప్రేమఇష్టం కానీ లేవు అందుకే ఆమె జీవితాన్ని నాశనం చేసిన వాడి తోనే ఆమె పెళ్లి జరిపించండి

డాక్టర్ గారు వినండి ఆవిడ నా భార్య కాదు కాలేదు ఎవరు ఏంటో తెలుసుకుని మాట్లాడండి తెలియక అన్నారు సరే ఇప్పుడు చెప్పాను కదా ఆమె నా మరదలు అంతే ఇంకేం కాదు అని తిరిగి సుధాకర్ వైపు చూస్తూ నేను తీసుకున్న మొత్తం అప్పు నిన్నటితో తీరిపోయింది అణా పైసలతో సహా కావాలంటే లెక్కలు అన్ని మీకు చూపిస్తా కానీ ఒక్కటి గుర్తుపెట్టుకోండి డబ్బు లేని వారంతా మీ చెప్పుకింద రాయిలా ఉంటారు అని అనుకోకండి ఇంకొకరు అయితే మిమ్మల్ని బజారుకు ఈడ్చే వాళ్ళు  మీ కూతుర్ని వాడుకుని మిమల్ని నాలుగు చెరువుల నీళ్ళు తాగించే వాళ్ళు.

మీరు నాకు తండ్రితో సమానం మీరు మా నాన్నగారు చావు బ్రతుకుల్లొనూ చివరికి చావు లోనూ మమల్ని ఆదుకున్నారు మీరు ఆదుకోకపోతే మేమేం అయ్యే వారిమో  కానీ అదొక సాకు గా పెట్టుకుని మమల్ని ఇలా బాధ పెడితే మాత్రం ఊరుకునే వాళ్ళు ఎవరూలేరు నాకు తెలుసు చిన్నప్పుడు ఎప్పుడో తెలిసి తెలియని వయస్సులో చేసిన ఒక చిన్న తప్పు మిమల్ని ఇలా చేయనిచ్చిందని నాకు అర్ధం అయ్యింది  కానీ అది నేను కావాలని చేసింది కాదు ఇక మీరు ఇన్నాళ్ళు నన్ను ఆదుకున్నారు కాబట్టి నేనేమి అనకుండా వెళ్తున్నా.

ప్రతి ఒక్కరికి ఆత్మ గౌరవంఆత్మాభిమానం ఉంటాయని గుర్తుపెట్టుకోండిమీ దగ్గర చేయి చాచినంత మాత్రాన వాళ్ళు తక్కువ కాదుమీకు డబ్బు ఉందని మీరెక్కువ కాదనే మాట ని గుర్తు పెట్టుకోండి. సుప్రియ చిన్నపిల్ల వాళ్ళతో మాట్లాడాను. పెళ్లికి పిలవండి నమస్తే అని” బయటకు రెండు అడుగులు వేశాడు అర్జున్. అప్పటి వరకు అతను మాట్లాడే ప్రతి ఒక్క మాట విన్న గిరిజకు అంతా అరటిపండు ఓలిచినట్టు అర్థం అయ్యి, అంటే తన కలల రాకుమారుడు తన వాడే అన్న మాట అని అనుకోగానే ఎక్కడ లేని శక్తి వచ్చిఅంత నీరసం లోనూ తానెక్కడున్నది కూడా పట్టించుకోకుండా పరుగెత్తి వెళ్ళి మళ్ళీ ఈ క్షణాలు రావేమో అన్నట్టుగా ఈ క్షణం తనకు  ఎంతో విలువైనది కాబట్టి సంకోచాలు అనుమానాలు వదిలి అతన్ని గట్టిగా కౌగిలించుకుంది.

ఒక్కసారిగా తనని హత్తుకున్న ఆమెని చూసి ఉక్కిరిబిక్కిరి అయ్యిపోయి ఏడు మల్లెల ఎత్తును పొదవి పట్టుకుంటూ తనకు కలిగిన భావమే ఆమెకు కూడా కలిగిందని అనుకుంటూ ఆమె మనసు తెలుసుకున్న వాడు అయ్యి ఆమెని తన కౌగిలిలో క్షణం పాటు స్వాంతన పొందిన వాడై ఆమె ముంగురలను సవరించాడు దాంతో ఆమె ఈ లోకం లోకి వచ్చి తాను చేసిన పనికి సిగ్గుతో పక్కకు జరిగింది

విషయం తెల్సి వచ్చిన అర్జున్ తల్లి రేణుక అన్ని వింటూ తన కొడుకు ఎంతగా నలిగిపోయింది గుర్తొచ్చి తనకు తెలియనివ్వకుండా చేసిన వాడి గొప్ప మనసుకు మనసులోనే మెచ్చుకుంది చిన్నవాడు తన కడుపున పుట్టిన వాడు ఇంత వివేక వంతుడు గుణవంతుడు అయ్యాడని మురిసిపోయిన ఆ తల్లి అర్జున్ గిరిజ జంటను చూస్తూ వారి దగ్గరగా వచ్చి ఆశీర్వదించింది.

రేణుక ను చూసిన సుధాకర్ దంపతులు సిగ్గుతో తలలు కిందకు దించుకున్నారు. ఇంతలో గిరిజ స్నేహితురాలు ఆమెని వెతుక్కుంటూ వచ్చి ఇదిగో గిరిజ నీ కలల రాకుమారుడు కాబోయే కలెక్టర్ గారు అంటూ ఆ రోజు వచ్చిన సాయంత్రపు పత్రికను చూపించడం తో గిరిజ అపనమ్మకంగా అర్జున్ వైపు చూసింది. తల్లి సుధాకర్ లు అందరూ ఆశ్చర్య పోయారు అది విని. ఆశ్చర్యంగా చూస్తున్న తల్లి దగ్గరగా వచ్చి అవునమ్మ మామయ్య నన్ను ఎంత పని వాడిలా చూసినా కొద్ది నాలో చదువుకోవాలనే కోరిక పెరిగింది, అందుకే ఎవరికీ తెలియకుండా , కనీసం నీకు కూడా చెప్పలేని పరిస్థితిలో చాటుగా చదువుకోవాల్సి వచ్చిందమ్మ నేనేమైనా తప్పు చేసానా అమ్మ  అంటూ తల్లిని అడిగాడు అర్జున్.

అయ్యో నాన్న ఎన్నో తట్టుకుని నిలబడ్డావు, ఉన్న బాధను నీలో దాచుకుని నాకేం తెలియనివ్వకుండా దిగామింగావు, నిన్ను చదివించాలని ఉన్నా, ఒక్కగానొక్క కొడుకువి అల్లారు ముద్దుగా చూసుకోవలనుకున్నా, పేదరికం వల్ల చేయలేకపోయాను కష్టపడి నీ లక్ష్యాన్ని చేరుకున్నావు నాయనా నా ఆయుష్షు కూడా పోసుకుని నిండు నూరేళ్ళు సుఖంగా వర్ధిల్లు బాబూ అంటూ కళ్ళు ఒత్తుకుంటున్న అత్తగారి దగ్గరకు వచ్చి భుజం మీద చేయి వేసిన గిరిజను చూసి నవ్వింది రేణుక. ఇంతలో నర్సు వచ్చి సుప్రియని చూడొచ్చు అని చెప్పడంతో సుధాకర్ లోపలికి వెళ్ళిపోయాడు అర్జున్ గిరిజని , తన తల్లిని తీసుకుని తన పని అయిపోయినట్టుగా అక్కడి నుండి బయటకు నడిచాడు.

వారం రోజుల్లో మంచి ముహూర్తం చూసుకుని  అర్జున్ గిరిజల కళ్యాణం అంగరంగ వైభవంగా జరిగిందని ముందే తెలుసుకున్నాం కదా .అలా ఆరునెలల్లో గిరిజా తన రాకుమారున్నీ వెతికి మరి అతన్ని పెళ్లి చేసుకుని తన ప్రేమను దక్కించుకుంది. సుప్రియ కూడా ప్రభాకర్ ని పెళ్లి చేసుకుని అమెరికా వెళ్ళిపోయింది తండ్రి ఇచ్చిన డబ్బుతో…

ఇక సుధాకర్ తన పీనాసితనాన్ని వదిలేసి  ఆస్థిలో చాలా భాగాన్ని అనాధ శరణాలకు, వృద్దశ్రమాలకు రాసి ఇచ్చి ఉన్నదాంట్లో దైవ స్మరణ చేసుకుంటూ పది మందికి ఉపయోగపడే పనులు చేస్తూ విశ్రాంతి తీసుకుంటున్నాడు.రేణుకను కాలు కింద పెట్టనివ్వకుండా చూసుకుంటుంది గిరిజా సునంద తాను చేసిన తప్పును మన్నించమంటూ వదిన కాళ్ళపైన పడింది. ఇప్పుడు నెలలో ఒకసారి కుటుంబ సభ్యులు అందరూ రేణుక ఇంట్లో కలుసుకుని ఆనందంగా గడుపుతున్నారు.

 

* భవ్య చారు

 

Related Posts

1 Comment

Comments are closed.