ప్రభాకర్ చేతిలో అత్యాచారానికి గురైన సుప్రియ ని తీసుకుని ప్రభాకర్ తండ్రి వద్దకు వెళ్తాడు అర్జున్,కొడుకు అత్యాచారo చేసింది సుధాకర్ కూతురు అని తెలియగానే దివాకర్ కొడుకుని తిట్టి,పెళ్లి జరిపించాలని అనుకుని అర్జున్ వద్దకు వస్తారు. కానీ వారికి కారు లో సుప్రియ కనిపించదు. ఎక్కడికి వెళ్లి ఉంటుందో అని గాబరా పడుతూ,ఇంటి వైపుగా కారుని పోనిస్తారు.ఇక జరిగేది చదవండి…
సుప్రియని వెతుకుతూ వెళ్తున్న అర్జున్ కారు కి ఒక అమ్మాయి అడ్డుగా రావడం తో ఆమెకి డాష్ ఇస్తాడు.అయ్యో ఆ పిల్ల ఎటు బోయిందో అని మేము టెన్షన్ పడుతుంటే , నువెందయ్యా ఇలా డాష్ ఇస్తావు.
ఇప్పుడా పెంట ఏడ పెట్టుకుందాం అన్నాడు దివాకర్ అర్జున్ తో,అర్జున్ కోపంగా దివాకర్ ని చూస్తూ,ఏంటండి మీరు మాట్లాడేది సుప్రియ మీకన్న నాకే ఎక్కువ నా మేనత్త కూతురు,అయినా డాష్ ఇచ్చి వదిలి వెళ్లిపోవడం మీ డబ్బున్న వాళ్ళు చేసే పని,నా వల్ల అది కాదు,ఆమెని ఎక్కించుకోవాల్సిందే,అంటూ కిందకి దిగాడు అర్జున్…
పడిపోయిన అమ్మాయిని మెల్లిగా పైకి లేపాడు.ఆమె ఎవరో కాదు మొదటి సారి కాఫీ షాప్ లో చూసిన అమ్మాయి గిరిజ గా గుర్తు పట్టాడు అర్జున్,ఆమెని అలా తాకగానే అతని శరీరం లో కూడా ఏవో ప్రకంపనలు,మనసులో అలజడి కలిగాయి,ఆమె సృహ తప్పి ,నుదుటి మీద గాయం వల్ల రక్తం కారింది.
జేబులో నుండి కర్చిపు తీసి,కట్టు కట్టి,అమెనియెత్తుకుని కారు ముందు సీట్ లో కూర్చోబెట్టి,సీటు బెల్ట్ పెట్టాడు అర్జున్,తిరిగి వచ్చి కారు స్టార్ట్ చేసాడు.
ఇదంతా చాలా విసుగ్గ చూస్తున్నాడు దివాకర్,ప్రభాకర్ లు ఇద్దరూ,కొంచం దూరం లో ఉన్న హాస్పిటల్ లో గిరిజని జాయిన్ చేసి,తాను మళ్ళీ వస్తానని చెప్పి,తిరిగి కారు వద్దకు వచ్చాడు. కారుని వంద కన్నా ఎక్కువ స్పీడ్ తో ముందుకు దూకించాడు.అతని స్పీడ్ చూసిన దివాకర్,ప్రభాకర్ లు ఇద్దరూ భయంతో బిగుసుకు పోయారు.అలా స్పీడ్ గా వెళ్లిన కారు సుప్రియ ఇంటి ముందే ఆగింది.కారు ఆగి ఆగక ముందే ఒక్క దుకు దూకిన అర్జున్ గబగబా లోనికి పరుగెత్తాడు.
హల్లోనే ఉన్న మేనత్త సునంద ఏమైంది రా అర్జున్ అని అంటున్నా, గబగబా సుప్రియ గది లోకి వెళ్ళాడు. బెడ్ రూమ్ లో నుండి బయటకు వచ్చిన సుధాకర్ తన కూతుర్ని ఎదో చేయడానికి వెళ్తున్నాడని భావించి,ఒరేయి ఏంట్రా నా కూతుర్ని ఏమి చేయడానికి పోతున్నావు రా, అని తిడుతూ అతని వెనకాలే వెళ్ళాడు సుధాకర్,అక్కడ సుప్రియ రూమ్ లో సుప్రియ బెడ్ మీద సృహ తప్పి పడిపోయి ఉంది. ఆమె చేయి మణికట్టు దగ్గర నుండి రక్తం కారుతూ,కిందకి ధరపతంగా కారుతుంది.
అది చూసిన సుధాకర్,సునంద ఇద్దరూ అయ్యో నా తల్లి ఎందమ్మా ఇది అంటూ ఎడవసాగారు,వారిని ఏమి అనకుండా పక్కనే ఉన్న ఒక కాటన్ బట్ట తీసుకుని సుప్రియ చేతికి కట్టులాగా కట్టిన అర్జున్ సుప్రియ,సుప్రియ అంటూ చెంపల మీద కొడుతూనే ఆమెని చేతుల్లోకి ఎత్తుకున్నాడు.అతను చేసే పని చూస్తూన్న సుధాకర్ గబగబా కిందకి వెళ్లి కారు స్టార్ట్ చేసాడు,సునంద కూడా కిందకి వచ్చింది. అర్జున్ చేతిలో సుప్రియ ని ఎత్తుకుని కిందకి తీసుకొచ్చి,కారు వెనక సీటు లో కూర్చోబెట్టాడు.సునంద వెనక కూర్చుని కూతుర్ని పట్టుకుంది.ముందు సుధాకర్ కూర్చున్నాడు,
ప్రభాకర్,దివాకర్ ఇద్దరూ కిందకి దిగి నిలబడి జరిగేది చూస్తున్నారు.వారిని అసలు గుర్తించనట్టే అర్జున్ గిరిజ కేసి ఒక సారి చూసి తిరిగి డ్రైవింగ్ మీద దృష్టి పెట్టాడు అర్జున్ ,హాస్పిటల్ కు తీసుకుని వెళ్లారు. సుప్రియ చేయి కోసుకున్నదని అర్జున్ కి ఎలా తెలిసిందో,అసలు తన గారాల కూతురికి ఏమయిందో అనే ధర్మ సందేహం,అలాగే తన కూతురిని అలా రక్తం కారుతూ,బేలాగ మారడం చూడగానే సుధాకర్ పంచ ప్రాణాలు పోయినట్టు గా అయ్యింది.తిరిగి తన కూతురు మాములు మనిషి అయ్యే దాకా అలాగే అచేతనంగా అర్జున్ చేసేవి చూస్తూ కుర్చుండి పోయారు సునంద,సుధాకర్ లు ఇద్దరూ..
డాక్టర్ లను అందర్నీ గబగబా తీసుకుని వచ్చిన అర్జున్ ముందుగా సుప్రియని చూడండి అని బతిమాలడం తో అందరూ అతని హడావుడికి పరుగెత్తుకుని వచ్చి,ఆమెకు ఫస్ట్ ఎయిడ్ చెయ్యాసాగారు,ఇంతలో అర్జున్ తన కార్ కింద పడిన అమ్మాయి గుర్తొచ్చి గబగబా కార్ వద్దకు పరిగెత్తుకెళ్లి ఆమెని మర్చిపోయినందుకు తనను తాను తిట్టుకుంటూ కార్ డోర్ తీసి ఒక క్షణం ఆమెని అలాగే చూస్తూ నిలబడ్డాడు. చంద్రబింబం లంటి మొహం, ఆల్చిప్పల్లాంటి కళ్ళు బహుశా పెద్దవే కావొచ్చు. ముందుకు పడుతున్న కురులు, సంపెంగలoటి ముక్కు, సన్నని,చిన్నని మూతి, కొంచెం కిందికి దిగితే శంకo లాంటి మెడ, ఇంకించేం కిందికి వస్తే, పెద్దని వక్షద్వయం.
ఇక అక్కడినుంచి చూపులు మరల్చుకొని ఎన్నడూ ఎవరిని చూడని తను ఆమెని అలా పరీక్షగా చూడడం తనకే సిగ్గనిపించి మూసి,మూసి, నవ్వు నవ్వుతూ… ఆమెని అలాగే చేతుల్లోకి ఎత్తుకొని హాస్పిటల్ మెట్లు ఎక్కసాగడు. అది చూసిన కంపౌండర్లు, నర్సులు స్టచ్చర్ తీసుకుని రావడంతో దానిపైన ఆమెని పరుండపెట్టి జాగ్రత్త బాబు అని అన్నాడు కంపౌండర్ తో. లోపలికి తీసుకెళ్లిన ఐదు నిమిషాల తర్వాత, లోపలికి వెళ్లిన అర్జున్ కు డాక్టర్ ఎదురొస్తు బాగా షాక్ తిన్నట్టు ఉంది బాబు, ఎం లేదు చిన్న గాయలే ఒక గంటలో మెలకువ వచ్చేస్తుంది, భయపడాల్సిన పనిలేదు అని భుజం తట్టి వెళ్లిపోయారు డాక్టర్. ఆమె దగ్గరగా వెళ్లి మొహాన్ని పరికించి చూసాడు అర్జున్.
చూసినకొద్ది, చూడలనిపించే ముకారవిందం తనని ఎందుకో పదే పదే చూడలనిపిస్తుంది. ఎన్నో జన్మల బంధంలా అనిపిస్తుంది ఆమెని చూస్తుంటే. తనకు,ఆమెకు ఉన్న బంధమేమిటో తెలియక,ముందుకు వెళ్లలేక, వెనక ఉండలేక సతమతమవుతున్న ఆలోచనవల్ల ఉక్కిరిబిక్కిరి అవుతున్న, అర్జున్ వద్దకు నర్స్ వస్తు సర్, మీరు ఇక్కడున్నార? అర్జెంట్ గా బ్లడ్ కావాలి ఆ గ్రూప్ రక్తం మా హాస్పిటల్ లో లేదు మీరు వెంటనే వెళ్లి బ్లడ్ బ్యాంక్ లో అడగండి అని అంది నర్స్ అర్జున్ ని చూస్తూ, ఆ మాటకు ఉలిక్కిపడిన అర్జున్ తనకి సుప్రియ గుర్తుకు వచ్చి, అయ్యో ఆ విషయమే మర్చిపోయి ఎవరో తెలియని యువతి దగ్గర ఉండిపోయినందుకు ఒక నిమిషం నిరుత్తరుడు అయ్యి,తిరిగి తన భాద్యత గుర్తుకు వచ్చి, ఆ ఇప్పుడే తెస్తాను సిస్టర్ అని ఒక్క క్షణం ఆగి ఇంతకీ ఏ బ్లడ్ గ్రూప్ అని అడిగాడు సిస్టర్ ని, అయ్యో అదేంటయ్య నీ భార్య బ్లడ్ గ్రూప్ నీకు తెలియదా? ఇది మరీ విచిత్రంగా ఉందే? పైగా అక్కడ నీ భర్య ప్రాణాలతో పోరాడుతూ ఉంటే ఇంత నిమ్మలంగా ఎలా ఉంటున్నవయ్య నువ్వు? అని అంటున్న సిస్టర్ కి ఏంచెప్పలో తెలియక బయటకి నడిచాడు అర్జున్.
సిస్టర్ మాటలకు మెలుకువ వచ్చిన గిరిజ తన కలల రాకుమారుడు, తను కలకన్న ప్రియుడు ఇంకొకరి భర్తనా? నమ్మలేని నిజన్ని వింటున్నట్టుగా ఆశ్చర్యానికి గురైంది గిరిజ…
ఇంతకీ గిరిజ అర్జున్ ని అపార్ధం చేసుకుందా? అర్ధం చేసుకుందా? నర్స్ పొరపాటు పడిందా? లేదా నర్స్ కి ఎవరైనా చెప్పారా వాళ్ళు భార్యభర్తలని? ఒక వేళ సిస్టర్ పొరపాటు పడకపోతే అర్జున్ సుప్రియ లిద్దరు భార్యాభర్తలని సిస్టర్ కు ఎవరు చెప్పారు?
అర్జున్ ని మొదటి చూపులోనే ప్రేమించిన గిరిజ అర్జున్ ని వదులుకుంటుందా? సుప్రియ ఆత్మహత్య ప్రయత్నానికి సుధాకర్ అర్జునే కారణమనుకుంటున్నాడా ? అర్జున్ జీవితం ఇంకెన్ని మలుపులు తిరగబోతుంది ? గిరిజ అర్జున్ ని మనువాడుతుందా ? లేదా ? చదవండి తదుపరి భాగంలో…….
ఈ కథ చివరి భాగం త్వరలోనే ఉంటుంది అలాగే ఇంకో కొత్త సీరియల్ తో మీ ముందుకు వస్తాను .. మీ భవ్య