గిరిజా కళ్యాణం పార్ట్ -2

అర్జున్  తండ్రి కి యాక్సిడెంట్ అవ్వడంతో, మేనత్త దగ్గరికి వెళ్లి ,డబ్బుతెస్తాడు అర్జున్, మేనత్త భర్త సుధాకర్ అర్జున్ చేత కాగితాల మీద సంతకం చేయించుకుని పదిలక్షల డబ్బు ఇస్తాడు

వాటిని ,మేనత్త తో పాటు హాస్పిటల్ కి వస్తాడు అర్జున్. మేనత్త చాటుగా అర్జున్ కి అయిదు లక్షలడబ్బు ఇస్తుంది. తండ్రి జీవితంలో నడవలేడు అని , తెలుసుకున్న అర్జున్ కుంగిపోతాడు. అతను చదువుకుని , చాలా గొప్పవాడు అవ్వాలనే తనకలలు మానేసి, ఇల్లు ఎలా గడవలా అని ఆలోచిస్తున్న ఉంటాడు, మేనత్త ఇచ్చిన డబ్బు తండ్రి మందులకు, బలమైన ఆహారం పెట్టమని అనడం తో, వాటికే ఖర్చు పెడుతూ ఉంటాడు…

తండ్రిని చూసుకుంటూ ఉండమని తానూ పనికి వెళ్తా అని అంటుంది రేణుక , తల్లిని పంపించడం ఇష్టం లేని అర్జున్ తానే ఏదయినా పని చేసుకుంటా అని తల్లితో చెప్తాడు.చదివింది పదవ తరగతి నీకేం ఉద్యోగం వస్తుందిరా అని అంది రేణుక ,ఏదో ఒకటి చేస్తలే అమ్మా అని అంటూ, బయటకు వెళ్లిపోయాడు అర్జున్..

అతని చదువుకు, అతని సున్నితమైన శరీరం చూసిన వారెవ్వరూ నువేమి పని చేస్తావు , అని అన్నారు.

చివరికి ఒక మెడికల్ షాప్ అతను ఇస్తాను ,కానీ ఒక నెల రోజులు ఫ్రీ గా చేయాలి అని అన్నాడు.కానీ దానికి అర్జున్ తమ పరిస్థితి అంతా చెప్పాడు.దానికి అతను జాలిపడి, సరే రేపటి నుండి పొద్దున్నే రావాలి , రాత్రి పది గంటల వరకు పని చేయాలి ,జీతం మాత్రం మూడువేలు ఇస్తాను అని చెప్పాడు.జీతం తక్కువే ఆయినా ,తమ పరిస్థితి బాగలేకపోవడం వల్ల వెంటనే ఒప్పుకున్నాడు అర్జున్. తర్వాత ఇంటికి వచ్చి తల్లికి ఉద్యోగం దొరికింది అని చెప్పాడు.

ఇక అప్పటి నుండి ప్రొద్దున పూట పాల ప్యాకెట్లు వేస్తూ, షాప్ కి వెళ్తూ, ఒక ఆరునెలలు బాగా కష్టాలు పడ్డాడు అర్జున్ . కానీ అతని కష్టాన్ని చూడలేకపోయిన తండ్రి, అతనికి తానూ భారం కాకూడదు అనుకుని ,ఓ రోజు రాత్రి నిద్రలోనే ప్రాణాలు విడిచాడు..తండ్రి అలా చనిపోవడాన్నీ ఊహించని అర్జున్ షాక్ లోకి వెళ్ళాడు. అతనికి ఆ వయసుకి అది పెద్ద దెబ్బె మరి…

విషయం తెలిసిన అంతా వచ్చి,  ఆయన ఖర్మ కాండలు జరిపించారు. అర్జున్ దగ్గర ఒక్క పైసా కూడా లేదా క్షణం లో , అప్పుడు మేనత్త భర్త సుధాకర్ తానే అన్ని ఖర్చులు పెట్టాడు. అంతా తానే అయ్యి , చేసాడు. శ్రీహరి తమ్ముడు చనిపోయిన బాధలో ఏమి పట్టిచుకోలేదు. అతను ఏదైనా సహాయం చేద్దాం అని అనుకున్నా, యశోద అతన్ని కళ్ల తోనే వారించింది. దాంతో అతను ఏమి అనలేకపోయాడు.ఇక అర్జున్ కూడా మామా ఖర్చు చేస్తుంటే చూస్తున్నాడు . ఎందుకంటే తన దగ్గర చిల్లిగవ్వ కూడా లేదు కాబట్టి.

అన్ని అయిపోయాయి. అంతా ఎక్కడివారు అక్కడికి వెళ్లారు.వీరికి ధైర్యం చెప్పి, వెళ్ళిపోయారు.అందరూ వెళ్లిన తర్వాత ఇంట్లో నిశ్శబ్దం ఆవరించింది. అది వారికి అత్యంత భయంకరంగా అనిపించింది.అది భరించలేరు.ఇంతలో ఇంకో విపత్తు,ఆ గుడిసె యజమాని వచ్చి ,అద్దె డబ్బులు రెండురోజుల్లో కట్టమని,లేదా కాళీ చేయమని అన్నాడు. దాంతో అర్జున్ పనికి వెళ్లాలని అనుకున్నాడు.

 తల్లికి చెప్పి, తాను అంతకుముందు పనిచేసిన మెడికల్ షాప్ కి వెళ్ళాడు పనికోసం కానీ అప్పటికే అతను ఇంకొకరిని పెట్టుకున్నాడు. వారం రోజులుగా తిండి లేకపోవడం,కనీసం టీ తాగుదాం అనుకున్నా కూడా డబ్బులేకపోవడం తో, ఆ ఎర్రని ఎండకి తట్టుకోలేక, రోడ్ మీద   కళ్ళు చీకట్లు రావడంతో, ఎదురుగా వస్తున్న కారు కి డాష్ కొట్టి కింద పడిపోయాడు  అర్జున్.

ఆ ప్రమాదాన్ని చూసిన జనం ముగారు చుట్టూ, కారు లోంచి కిందకి దిగింది ఒక అమ్మాయి. పచ్చటి పసుపు ఛాయా తో, అందం , ఐశ్వరం, అహంకారం కలగలిపిన బంగారు బొమ్మ లా ఉందా అమ్మాయి. అమ్మాయిని చూడగానే అక్కడ ఉన్న జనం విచిత్రంగా చూస్తూ, దూరం జరిగారు. ఆమె వేసుకున్న దుస్తులు అలా వారిని చూసేలా చేసింది.

చిన్న స్కర్ట్, స్లీవ్లెస్ టాప్ వేసుకుని, హైహిల్స్ తో , కళ్ళకి నల్లని కళ్లద్దాలు పెట్టుకుంది.అది చూసిన జనం లోంచి ఒక వ్యక్తి, ఏమమ్మా కళ్ళు నెత్తికెక్కయా, అలా మనుషుల మీదకి తొలుతున్నావ్ బండిని అంటూ తిట్టాడు. యూ షట్అప్ రాస్కెల్ నన్నే తిడతావ ,ఈ ముష్టిడిది తప్పు, నా కారుకి వాడే అడ్డుగా వచ్చాడు అని అంది ఆ అమ్మాయి.

ఇంతలో అదే కారులోంచి కిందకి దిగాడు సుధాకర్. ఏంటమ్మా గొడవ అని అడిగాడు. చూడు డాడీ విడేవడో మూష్టోడు కారుకి అడ్డంగా వచ్చాడు. వీళ్లమో నాదే తప్పు అని అంటున్నారు, అంది గారాలు పోతూ, నా బేబీ ని అనే వాడు ఎవడు?. ఇంతకీ ఆ మూష్టోడు ఎవడో చూడు,?.  వాడు ఉన్నడా ?  ,పోయాడా ? చూసాక విళ్ళతో మాట్లాడ దాం  అని అంటూ, ఆ వ్యక్తిని తిప్పి చూసిన సుధాకర్ ఆశ్చర్యంగా ,అరె మన అర్జున్ అని అంటూ, మాకు తెలిసిన వాడే లెవయ్యే, వెళ్ళండి ,వెళ్ళండి అంటూ, అర్జున్ ని మెల్లగా లేపి, బ్యాక్ సీట్ లో పడుకోబెట్టాడు, కారు ఒక హాస్పిటల్ వద్దకు వెళ్లి ,ఆగింది. హాస్పిటల్ లో అతన్ని చూసిన డాక్టర్స్, సిలెన్స్ పెట్టారు బలం కోసం…

వాళ్ళు అతన్ని గదిలో ఉంచి ,బయటకి వచ్చారు తండ్రి,కూతుర్లు, ఏంటి డాడీ అతను అర్జున్ ఆహా , అలా ఉన్నడే, అయినా వాడిని నువ్వు ఎందుకు వాడికి సహాయం చేయడం, మనకెందుకు డాడీ, మనం వెళ్ళిపోదాం పద ,అంది సుప్రియ. లేదమ్మా నీకు తెలియదు, వాడితో మనకు చాలా పని ఉంది. వాడిని నేను వదలను. నాకు వాడు కావాలి అన్నాడు సుధాకర్ విచిత్రంగా నవ్వుతూ……..

తండ్రి ఎందుకు అలా అంటున్నాడో అర్థం కాలేదు, కానీ అతను తన బావ అని కూడా ఇష్టంకానీ, ప్రేమ కానీ ,మర్యాద కూడా లేదు ఆమెకి. ఇంతలో అర్జున్ కి సృహ వచ్చింది అని డాక్టర్లు వచ్చి చెప్పారు.ఎరా అర్జున్ , అలా బండికి అడ్డం గా రావచ్చునా ? మేము కాబట్టీ ఇలా హాస్పిటల్ కి తెచ్చాము . అదే వేరే వాళ్ళు అయితే వదిలేసి వెళ్లిపోయేవారు. అని అంటూ చొరవగా అతని దగ్గర కూచున్నాడు సుధాకర్,తన మేనత్త భర్త, అది కాక తన తండ్రి హాస్పిటల్ లో ఉన్నప్పుడు పది లక్షలు ఇచ్చి,చనిపోయాక కూడా ఖర్చు పెట్టాడు. అనే మర్యాద ఇచ్చి లెవబోయాడు అర్జున్….,

హ హ పర్లేదు లే, లెవకు ,పడుకో, అయినా అదేంట్రా అల్లుడు మొఖం చూస్తే ,వారం రోజుల నుండి తిండి లేనట్టు గా ఉంది., అని అంటూ , అమ్మా సుప్రియ వెళ్లి బావకు ఏదయినా టిఫిన్ పట్టుకు రా అన్నాడు సుప్రియ తో, సుప్రియ అయిష్టం గా ముఖం పెట్టి , బయటకు వెళ్ళింది,టిఫిన్ తేవడానికి, వద్దులే మామయ్య అన్నాడు అర్జున్, అబ్బా మాకు తెలుసు లేవోయి, ఏం చేయాలో, అని సుప్రియని పంపించాడు.

సుప్రియ వెళ్ళాక, చూడు అర్జున్ ఇలా నువ్వు ఎక్కడెక్కడో పని చేస్తూ,నా అప్పు , వడ్డి, ఇవ్వన్నీ తీర్చలేవు కానీ , ఒకటి చెప్తా అది తప్ప నీకు ఇంకో మార్గం లేదు. అది నీకు ఇష్టం అయితేనే చెయ్యి, నా బాకి తీరినట్టు ఉంటుంది. నీకు కాస్త డబ్బు వస్తుంది అని అన్నాడు సుధాకర్.

ఏంటి మమయ్య అది అని అడిగాడు అర్జున్ ,మరేం లేదు నాకు ఈ కాలేజీ కాంటీన్ ల కాంట్రాక్టు ఉంది కదా, అవన్నీ నేను ఒక్కడినే చూసుకోలేక పోతున్నా, అందుకని నా నాలుగు కాంట్రాక్టు లో ఒక రెండు నువ్వు చూసుకుంటే బాగుంటుంది. అయినా పని వాళ్ళు ఉన్నారనుకో, నువేమి చేయనక్కర లేదు. వాళ్ళని సమయానికి కాలేజీ కి పంపిస్తే చాలు , హ అది కూడా నీకు నచ్చితేనే, నెలకు పదివేలు ఇస్తాను.

అందులో నా బాకి కింద అయిదు వేలు పట్టుకుంటా అంటే నీకు మొత్తం ఇచ్చేది పదిహేనువేలు అనుకో,మరి ఇక నువ్వు ఆలోచించుకుని, మీ అమ్మని కూడా అడిగి నాకు విషయం చెప్పు, ఇదిగో ఈ ఫోన్ తీసుకో, అందులో నా నెంబర్ ఉంటుంది. దానికి ఫోన్ చెయ్యి, దీనికి ఏమి డబ్బు ఇవ్వక్కర్లేదు, నా దగ్గర పని చేసే వారందరికీ ఇలా ఇస్తాను ఫోన్ లు అని అన్నాడు సుధాకర్. తనకి అలాగే చేతిలో ఒక అయిదు వేలు, ఇచ్చాడు. ఖర్చుల కోసం అంటూ.. తన మనసులో లేక్కలు వేసుకుంటూనే,

ఇంతలో సుప్రియ టిఫిన్ తో వచ్చింది, అది తిన్న తర్వాత, డాక్టర్ ని అడిగి , అర్జున్ ని వారి ఇంటి దగ్గర్లో  దింపి, మరే విషయం నాకు రేపటి వరకు ఆలోచించుకుని ఫోన్ చెయ్యి, అని మరోసారి గుర్తు చేసి, వెళ్లిపోయారు ఇద్దరూ..అవసరమా డాడీ వాడికి అంత ఇంపార్టెన్స్ ఇవ్వడం , అని అంది సుప్రియ కారు డ్రైవ్ చేస్తూ..తండ్రితో..

ఆ ప్రశ్న కు చిద్విలాసంగా నవ్వుతూ అవసరమే ప్రియా, అతని మీద అంత ప్రేమ చూపించినట్టు నటించడం అవసరమే, ఎందుకు డాడీ అంత నటించడం దానికన్నా ఇంకో ఐదువేలు ఎక్కువ పడేస్తే,ఇంకా మంచి పని వారు వస్తారు కదా, అంది సుప్రియ. వస్తారమ్మా కానీ మన మనుషులు చేసినట్టుగా , వేరే పని వారు చేయారమ్మ , డబ్బు ఇస్తున్నాం అనే అంతవరకే చేసి ,చేతులు దులుపుకుoటారు.

అదే ఇలాంటి వారికి కాస్త ప్రేమ గా మాట్లాడితే కుక్కలా ,మన కాళ్ళ దగ్గర పడి ఉంటారు.అందుకే ఇలా మాటలతో  మభ్య పెట్టడం. వాడు నా కింద పని చెయ్యాలి. నేను వాడి జీవితం తో ఆడుకోవాలి అన్నాడు కసిగా సుధాకర్.తండ్రిని ఆ రూపం లో చూసిన సుప్రియ భయoతో ఒక్క క్షణం వణికిపోయిoది.తండ్రికి అర్జున్ అంటే అంత కోపం ఎందుకో అర్థం కాలేదు. కానీ ఏమి అడగలేదు సుప్రియ .మౌనంగా కారు డ్రైవ్ చేయసాగిoది…

ఇక చేతికి , తల కి కట్టుతో వచ్చిన కొడుకుని చూసిన రేణుక ,అయ్యో అదేంటి బాబు,ఎక్కడ పడ్డావు,ఎలా పడ్డావు? అని అడిగింది ఆదుర్దాగా, ఏమి లేదమ్మా ,నేను చూసుకోకుండా కారుకి  ఎదురు వెళ్ళాను చిన్న దెబ్బలే లే, అన్నాడు అర్జున్ .

ఇవి చిన్న దెబ్బలు అంటావెంటి ? చాలా తగిలాయి, ఉన్న ఒక్కగానొక్క పిల్లడివి నీకు ఏమైనా అయితే నేను ఉండగలనా నా ప్రాణాలన్ని నీ మీదే పెట్టుకుని బతుకుతున్న, అంది ఏడుస్తూ.. అబ్బా అమ్మా ఉరుకో ఇప్పుడేమి అవ్వలేదు కదా, సరే ఇదిగో డబ్బు ,తీసుకెళ్లి ఇంటి కి ఇచ్చి , అలాగే వెళ్లి ఇంట్లోకి కావాల్సిన సరుకులు తీసుకుని రా అని అన్నాడు.

బాబు ఎక్కడిది రా ఇంత డబ్బు  ? నీకు ఏదైనా పని దొరికిందా ? అని అడిగింది ఆతృతగా, లేదమ్మా మామయ్య నాకు ఒక పని చూపించాడు. అందులో చేరాను. అడ్వాన్స్ గా కొంత డబ్బు ఇప్పించాడు మామయ్య అన్నాడు అర్జున్. అవునా సరే  పాపం ఆ సుధాకర్ లేకపోతే మనం ఏమయ్యే వాళ్ళమో కదా, మీ నాన్నగారి ఖర్చులకు డబ్బు ఇచ్చి అదుకున్నాడు, ఆయన పోయాక అన్ని తానే చూసుకున్నాడు. ఇప్పుడు నీకు ఉద్యోగం ఇప్పించాడు.

నాకు తమ్ముడు ఉంటే ఇలాగే అదుకునేవాడు కావచ్చు . చాలా మంచివాడు రా మీ మామయ్య అంది రేణుక,అమాయకంగా.అర్జున్ కి కూడా మామయ్య దేవుడిలా అనిపించాడు ఒక్క క్షణం. అవును ఆయనే అదుకోకపోతే , తాము ఎలాంటి పరిస్థితిలో ఉండే వారిమో అని అనుకుని,మామయ్య మంచి మనసుకు కృతజ్ఞతలు తెలుపుకున్నాడు మనసులోనే, అమ్మా మరి వెళ్లి ఉద్యోగం లో చేరమంటావా అని అడిగాడు అర్జున్ తల్లిని. నిక్షేపంగా వేళ్ళు బాబు. అలాగే నీ ఆగిపోయిన చదువుని కూడా చదువుకోవడం మొదలు పెట్టు అంది రేణుక మనస్ఫూర్తిగా కొడుకుని దీవిస్తూ..

ఇక అర్జున్ రావడం తో తన పని వాళ్ళందరిని పిలిచి,వారికి తన మేనల్లుడు అని పరిచయం చేసి,వల్ల మీద పెత్తనం చేస్తూ,జస్ట్ పని చేయించడమే అని చెప్పాడు.కానీ తర్వాత తనకు నమ్మకమైన ఒక వ్యక్తిని పిలిచి వాడిని ఊపిరి తీసుకోనంత పని చేయించమని కొందరిని పని లోకి రాకుండా చెయ్యమని చెప్పించాడు.ఇక అప్పటి నుండి అర్జున్ పాట్లు మొదసలైనాయి.ఒక దగ్గర ఫుడ్ అయిపోయింది అని ,ఇంకా కావాలని,సరుకులు లేవని అటూ ఇటూ బాగా తిప్పుతూ,అతన్ని ఒక్క నిమిషం కూడా రెస్ట్ తీసుకొనివ్వకుండా చేస్తున్నారు.

విపరీతంగా పని చెప్తూ,దాదాపు అందులో ఉన్న వర్కర్లను వేరే పని మీద పంపిస్తూ,అన్నిటికి అర్జున్ నే పంపించడం మొదలు పెట్టాడు సుధాకర్,ఇక సుప్రియ అయితే అతన్ని ఒక పురుగును చూసినట్టు చూసేది.అతనికి అసలు విలువ ఇచ్చేది కాదు,మిగతా వర్కర్లతో బాగానే మాట్లాడినా అర్జున్ దగ్గరికి వచ్చేసరికి అతన్ని చాలా హీనంగా చూసేది.

ఒక రోజు సుప్రియ కాలేజి కి ఫుడ్ సప్లై చేయడానికి వెళ్ళాడు అర్జున్ ఆ సమయంలో సుప్రియ కూడా కాంటీన్ లొనే ఉంది.అతన్ని చూడగానే తన స్నేహితుల ముందు అతన్ని అవమానించాలనుకుని,ఫుడ్ పెట్టమని అడిగింది సుప్రియ,అది కేవలం హాస్టల్ లో ఉన్న వారికే తప్పా,డే స్కాలర్స్ కి కాదు,పైగా ఇంకా లంచ్ టైమ్ కూడా అవ్వకుండా పెడితే మిగతా వారికి సరిపోతుందో లేదో అని ,సుప్రియ దగ్గరగా వెళ్లి ప్రియ ఫుడ్ సరిపోదు.నువ్వు ఇక్కడ తినడం అసలు బాగోదు.అయినా అది మీ కోసం కాదు అని నచ్చ చెప్పబోయాడు.

కానీ సుప్రియ అతన్ని కోపoగా చూస్తూ ఏంట్రా నువ్వు నాకు చెప్పేది మా నాన్న దగ్గర పని చేసే పని వాడివి నాకు ఫుడ్ పెట్టమంటే పెట్టావా,నా స్నేహితుల ముందు నన్ను చులకన చేస్తావా,నువ్వు ఎంత ,నీ బతుకు ఎంత,పని వాడివి పని వాడిలా ఉండు,అంతే కానీ చనువు తీసుకోవాలని ప్రయత్నించకు,ప్రియ అంట,ప్రియ ఏంటి పెద్ద పెరు పెట్టినట్లు హ నువ్వు కేవలం మా దగ్గర పని చేసే వాడివి మాత్రమే,అది గుర్తు పెట్టుకుని,ఒళ్ళు దగ్గర పెట్టుకుని బతుకు,మా నాన్న నువ్వు అల్లుడివి అని నీకు పని ఇవ్వలేదు.

జస్ట్ పని వాడిలాగే పని ఇచ్చాడు,దాన్ని నువ్వు సాకుగా తీసుకుని నా వెంట పడలని చూడకు,వేళ్ళు వెళ్లి ఫుడ్ తీసుకుని రా అంటూ అందరి ముందు అవమానించింది అర్జున్ ని సుప్రియ,ఆమె మాటల్లో తాను కేవలం పని వాడేగానే చూస్తాడు మామయ్య అని,జితగాడి ని నేను అనే నిజాన్ని తట్టుకోలేకపోయాడు అర్జున్,వారికి ఫుడ్ సప్లై చేయసాగాడు,కానీ సుప్రియ వారి స్నేహితులతో కలిసి అది బాలేదు.ఇది బాలేదు అని అంటూ ఫుడ్ మొత్తం కింద పారవేసి,ఇది ఒక తిండినా,ఎలా తింటారు దీన్ని అని అంటూ ప్లేట్ ని అర్జున్ మొఖం మీద కు విసిరింది సుప్రియ అది అర్జున్ మొఖాన్ని తాకి కింద పడి,చెల్లాచెదురుగా పడిపోయింది.అర్జున్ మొఖం నిండా ఫుడ్ అతుక్కుపోయింది.

ఇంతలో హడావుడిగా అక్కడికి వచ్చాడు సుధాకర్,తండ్రిని చూడగానే సుప్రియ డాడీ అంటూ ఏడుస్తూ వెళ్లి ,అతన్ని కౌగిలించుకుని  చూడు డాడీ ఆకలిగా ఉంది అంటే నాకు కారం ఎక్కువ వేసిన ఫుడ్ పెట్టాడు,మేము తినకూడదు అంట,మాకు పెట్టమంటే చూడు ఎలా పారేసాడో అని అర్జున్ మీద చెప్పసాగింది సుప్రియ..

ఏరా  ఫుడ్  పెట్టి  రమ్మంటే ఇంకా ఇక్కడే ఉండి,నాటకాలు ఆడుతున్నవా,బిడ్డ ఆకలి అంటే కారం ఎక్కువ చేసి పెడతావా,నాలుగు రాళ్లు చూసే సరికి కళ్ళు నెత్తికి ఎక్కాయి రా నీకు,పని చేయడం అంటే అమ్మాయిలను గదిలో వేసి ఉంచడం అనుకున్నవా రా,నువ్వు నా కూతుర్ని చీకటి గదిలో ఉంచినట్టు అనుకున్నవా,అసలు ఆ రోజే నిన్ను తనాల్సింది కానీ బతికి పోయావు,ఇప్పుడు ఎవడు అడ్డు వస్తాడో చూస్తా,ఒరేయి చూస్తారెంట్రా కుమ్మండి నా కొడుకుని అనగానే అక్కడ ఉన్న సుధాకర్ మనుషులు అర్జున్ ని కొట్టారు బాగా..

ఎంత కోడుతున్నా అర్జున్ ఒక్క సారి కూడా ఎదురు తిరగ లేదు.ఆలోచూస్తున్నాడు ఏమన్నారు మామయ్య తన కూతుర్ని గదిలో వేసి బంధించిన ట్టు కాదా, అంటే చిన్నప్పుడు ఎప్పుడో తాను చేసిన చిలిపి పనే తన పాలిట శిక్ష గా మారిందా,ఇప్పటికి మామయ్య మనసులో అది ఉంచుకునే నా జీవితం తో ఆట ఆడుకుంటున్నాడా,అందుకే సహాయం చేసినట్టు నమ్మించి,తన దగ్గర బుక్ చేశాడా,తనని ఇన్ని రోజులు వాడుకోవాలని చూసాడా.?

దెబ్బలు వంటి మీద పడుతుంటే ఇక భరించడం తన వల్ల కాలేదు.ఎప్పుడో జరిగిన వాటికి మామయ్య ఇప్పుడు ఇలా పగ తీర్చుకోవడం నమ్మశక్యం గా లేదు. వద్దు ఇక వీళ్ల దగ్గర పని చేయడం అనవసరం,వేరే ఎక్కడైనా పని చూసుకోవాలి,చేసుకోవాలి, తాను చదువుకోవాలి,తన తల్లిని ఇంతకన్నా బాగా చూసుకోవాలి అని అనుకుంటూ తనను కోడుతున్నా వారిని చూసి,మీదకు రాబోతున్న వాడిని ఒక చేత్తో వాడి చేయిని మెలిపెడుతూ,సుధాకర్ వైపు చూసి.

ఆపండి మామయ్య ఇన్ని రోజులు మీరు మాకు చెసిన సహాయం చాలు ఇక నుండి నేను మీ దగ్గర పని చేయడం లేదు.నేను మీ కాలి చెప్పు కింద పురుగును కాదు.నా బతుకు నేను బతుకగలను,మీ సహాయం నాకు అవసరం లేదు.ఇప్పుడే నేను మీ వద్ద పని మనేస్తున్నా, ఇక నన్ను మీరేమీ చేయలేరు.వెళ్తున్నా అని అంటూ అతన్ని పక్కకు జరిపేసి,పిలికలు అయిన షర్ట్ భుజం మీద వేసుకుని రెండు అడుగులు ముందుకు వేసాడు అర్జున్…..

ఓషోస్ ఇదంతా కోపమే, అబ్బో మరి రాజా గారూ పని మానేసి పోతుంటే మేము చూస్తూ కూర్చొంటానికి ఇక్కడ ఎవరూ గాజులు తొడుక్కో లేదు.అబ్బి నువ్వు మానేసి పోతావు మంచిదే కానీ మరి నాను నీకిచ్చిన  బాకీ ఎవరు తీరుస్తారా అని వెటకారంగా అడిగాడు సుధాకర్.

బాకినా బాకీ ఏంటి అని అడిగాడు అర్జున్ వెనక్కి తిరిగి సుధాకర్ ని చూస్తూ.అహ నాలుగు రోజులు ఆగితే  నువ్వు ఎవరని కూడా ఆడిగేలాగా ఉన్నవే అని అన్నాడు సుధాకర్ అర్జున్ ని వెక్కింరింతగా ,అలా అనే ఉద్దేశ్యం నాకు లేదు కానీ బాకీ ఏంటో చెప్పండి అని అన్నాడు అర్జున్ మొహాన్ని పక్కకు తిప్పుతూ…

హ మరి నాకు డబ్బులు ఎక్కువయ్యి మీ నాన్న ఆపరేషన్ కు,చావుకు ఖర్చు పెట్టిన డబ్బంతా ఎవరికోసం నాయనా,నన్ను అపార్థం చేసుకోక చూడు కావాలంటే ఆ రోజు మీ నాన్నగారి ఆపరేషన్ కోసం నువ్వు మీ అత్తని వెతుక్కుంటూ వచ్చి కాగితాల మీద చేసిన సంతకాలు. ఇవి నీవే బాబు నా  తప్పేం లేదు. ఈ ఆపరేషన్ కోసం పది లక్షలు,చావుకు ఒక అయిదు లక్షలు మాత్రమే నేను ఖర్చు పెట్టాను.అయితే ఇప్పుడు నువ్వు నా దగ్గర పని మనేయ్యలని అనుకుంటే మానేయ వచ్చు ,కాకపోతే ఒకటి నా అప్పు మొత్తం తీరిస్తేనే నీకు నా దగ్గర నుండి విముక్తి అని మర్చిపోకు,అలా అని నేను అనడం కాదు ఇదిగో ఈ పేపర్స్ లో ఉంది.కావాలంటే ఏ లాయర్ దగ్గరకు వెళ్లినా వాళ్ళు నీకు చెప్తారు అని అంటూ గుంభనంగా నవ్వాడు సుధాకర్ గారు…

తన జీవితాన్ని అతని పాదాల దగ్గర  పడి ఉండేలా జీవితాంతం అతనికి చాకిరి చేసేలా తనని ఇరికించడం చూసి,అతని తెలివికి నవ్వుకున్నాడు.తల్లి అతను మంచివాడు,తన తమ్ముడు లాంటి వాడని నమ్ముతుంది.అతని తో విబేధించి లాభం లేదు.ఎలాగోలా డబ్బు సంపాదించి,అతని బాకిని తీర్చి,తన జీవితాన్ని తన కంట్రోల్ లోకి తెచ్చుకోవాలి.ఇప్పుడేమి చేయలేను,పది మందిలో పెట్టినా అతనిదే ఒప్పు అని,తనది తప్పు అంటారు.ఇక ఎటూ వెళ్లకుండా నా జీవితాన్ని నా నుండి లాక్కున్నాడు అని రియాలైజ్ అయిన అర్జున్ ఇక ఏమి అనలేక వెనక్కి తిరిగాడు….

 అది చూసిన సుధాకర్ నవ్వుతూ అది కదా బతికే లక్షణం,ఇక నీకు తిరుగు లేదు.నువ్వు ఈ సుధాకర్ దగ్గరే  ఉండాలి తప్పదు కన్నా… అది సరే ఇదిగో మన పాపగారికి కారు డ్రైవింగ్ సరిగ్గా రాదు కానీ నీకు బాగా వచ్చు కదా కాస్త అమ్మాయి గారికి నేర్పించు, సరేనా అమ్మా ప్రియ అర్జున్ నీకు కారు డ్రైవింగ్ నేర్పుతాడు నేర్చుకో… దానికి తగిన జీతం ఉంటుందిలే నువేమి దిగులు పడకు.. ఇదిగో ఈ మాటలు అన్ని మీ అమ్మకు చేరవేస్తావేమో జాగ్రత్త.. అసలే ఆరోగ్యం అంతంత మాత్రం అనే హెచ్చరిక  కూడా మేళవించి చెప్పాడు సుధాకర్…

తండ్రి జీవించాలని పెట్టిన చిన్న సంతకం తన జీవితాన్ని ఇంత అల్లకల్లోలం చేస్తుందని అనుకోలేక పోయాడు అర్జున్..  మరి అర్జున్ చదువుకోవాలని కోరిక తీరిందా,?అతను సుధాకర్ నుండి తన జీవితాన్ని ఎలా తిరిగి తెచ్చుకున్నాడు ? ముందు ముందు ఏం జరగ బోతోంది.? చదవండి తదుపరి భాగం లో…..

-భవ్య చారు

Related Posts