గిరిజా కళ్యాణం పార్ట్ – 3

తనకి ఉద్యోగం ఇచ్చింది కేవలం పనివాడిగా అని తెలుసుకున్న అర్జున్,వెళ్లి మామయ్యని నిలదీయడం,ఉద్యోగం మనేస్తాను అని అనడం వల్ల, సుధాకర్ బాకి సంగతి గుర్తుచేసి, అవి అక్కడ పెట్టి, ఉద్యోగం మానేయమని అంటాడు. దాంతో రియాలైజ్ అయిన అర్జున్ ,మౌనంగా అక్కడి నుండి వెళ్లేంతలో, సుధాకర్ అపి సుప్రియని కాలేజీ లో నుండి రిసీవ్ చేసుకుని, తనకి డ్రైవింగ్ బాగా వచ్చేలా చేయమని ఒక పని చెప్తాడు. దానికి ఒప్పుకుంటాడు అర్జున్..ఇక ప్రస్తుతం  జరిగేది చదవండి…

రోజూ అర్జున్ వెళ్లి సుప్రియ ని  రిసీవ్ చేసుకోవడం, ఆమె తిడుతున్నా,ఏమంటున్నా, మౌనంగా భరించడమే అతని నిత్యకృత్యం అయ్యింది. కారణం సుధాకర్ బాకి తీర్చలేక,అతను చెప్పినట్లుగా వినడమే మంచిది అని అనుకున్నాడు.కానీ ఏ ఒక్కరోజు కూడా తన తల్లికి ఇలా జరిగింది అనే విషయాన్ని చెప్పలేదు అర్జున్ ,చెప్తే తల్లి భాద పడుతుంది అని అనుకుంటున్నాడు.కానీ తల్లి మాత్రం కొడుకు జీవితం ఒక దారిలో పడింది అని అనుకుంటూ,సుప్రియని తన కోడలు గా చేసుకోవాలని అనుకుంటుంది.

ఈ విషయం తెలియని అర్జున్ మాత్రం తాను బాగా చదువుకోవాలి అని అనుకుంటాడు.అలాగే మామయ్య కి తెలియకుండా ప్రైవేట్ కి వెళ్తూ, రాత్రుళ్లు చదువుకుంటూ ఉంటాడు.కానీ ఈ విషయాలు బయటకు తెలియనివ్వడు.ఆఖరికి కన్నతల్లికి కూడా తెలియకుండా జాగ్రత్తలు తీసుకుంటాడు.అదే సమయం లో సుప్రియ దగ్గరికి వచ్చిన అర్జున్ ని చూసిన గిరిజ పొరపాటు పడి, అర్జున్ నే పెళ్ళికొడుకు అని అనుకుంటుంది. అలా గిరిజ అర్జున్ ని అప్పుడే మొదటి సారి గా చూసి ,అతనితో ప్రేమలో పడుతుంది.

అర్జున్ ని పనివాడి లా చూస్తున్న సుప్రియ,అతన్ని అవమానించాలి అని అనుకున్న సుప్రియ. తన క్లాస్మెట్ అయిన ప్రభాకర్ తో ప్రేమలో పడుతుంది. అర్జున్ ని ముప్పు తిప్పలు పెడుతూ,అతని ద్వారా ప్రేమలేఖలు ప్రభాకర్ కి పంపుతూ, అతనితోనే సినిమా టిక్కెట్లు తేప్పించుకొని, ప్రభాకర్ తో చాలా క్లోజ్ గా అతని ముందే ప్రవర్తిస్తుంది.ఒక రోజు ప్రభాకర్ తన గెస్ట్ హౌస్ కి సుప్రియ ని తీసుకొని వెళతాను అని ఒక్కదాన్ని రమ్మనమని ఫోన్ చేస్తాడు.దానికి సుప్రియ కూడా సరే అని అంటుంది.

సుప్రియ ఎప్పుడు అర్జున్ ని ఎలా ఇబ్బంది పెట్టాలా అని ఆలోచిస్తూనే ఉంటుంది.అలాగే  అన్ని పనులు చేస్తూ, అతన్ని అవమానిస్తే అయినా తమ దగ్గరి నుండి వెళ్లిపోతాడని ఆమె ఆలోచన, ఆ రోజు అతన్ని తీసుకెళ్లి ప్రభాకర్ ముందు కూడా  అవమానించాలి అని  కాలేజీ నుండి తనని తీసుకెళ్లడానికి రమ్మని అర్జున్ కి ఫోన్ చేస్తుంది సుప్రియ. అతను వస్తా అని సమాధానం ఇచ్చి ఫోన్ పెట్టేసి, కాలేజీ కి వస్తాడు.

కాఫీ షాప్ లో ఎదురుచూస్తూ ఉన్న అర్జున్ వద్దకు సుప్రియ వచ్చి వెళదామా అని అడిగింది. హ సరే పద అంటూ కార్ కీస్ తీసుకుని బయటకు దారి తీసాడు అర్జున్ , ఇద్దరూ కలిసి వెళ్ళారు. సుప్రియ ఉరవతల ఉన్న ప్రభాకర్ గెస్ట్ హౌస్ దగ్గర కారాపించి,  ఏమి మాట్లాడకుండా ,కనీసం అర్జున్ కి ఏమి చెప్పకుండానే గబగబా లోనికి వెళ్ళింది. అర్జున్ లోనికి వెళ్తున్న సుప్రియ ని అలాగే చూస్తూ ఉన్నాడు.

లోపలికి వెళ్లిన సుప్రియ కు ప్రభాకర్ హాల్లోనే కూర్చుని తాగుతూ కనిపించాడు. అది చూసిన సుప్రియ ఏంటి ప్రభా నువ్వు,తాగుతావా అంటూ అడిగింది. అవును సూప్పు ,నేను తాగకుండా ఉండలేను ,నువ్వు పరిచయం అయినప్పటి నుండి కాస్త తగ్గింది,కానీ నేను తాగాకుండ ఉండలేను అని అన్నాడు ముద్దు ముద్దుగా, అప్పటికే ప్రభాకర్ తాగడం మొదలు పెట్టి గంట అయ్యింది.రా కూర్చో అన్నాడు అలాగే కూర్చుంది సుప్రియ…

అతను అలాగే సుప్రియని చూస్తూ ,అబ్బా సుప్పు నువ్వి చీరలో చాలా బాగున్నావ్, అన్నాడు కవ్వింపుగా, దానికి సిగ్గుపడింది సుప్రియ, అవునా మరి  పెళ్లికి ముహూర్తం పెట్టిoచమని అంటే మాత్రం నువ్వు ఎందుకు పెట్టించడం లేదు అంది గారంగా, హ దానికోసమే కదా నిన్ను రమ్మంది అని అన్నాడు, ఎందుకు ఇక్కడే పెళ్లి చేసుకుంటావా ఏంటి అని అడిగింది నవ్వుతూ సుప్రియ,పెళ్లి కాదు కానీ దాని తర్వాత అవుతుంది చూడు శోభనం దాన్ని ఇప్పుడే చేసుకుంటే ఎలా ఉంటుందంటావు అన్నాడు గది తలుపులు మూసేస్తూ….

మాట్లాడుతూ,మాట్లాడుతూ సుప్రియ లోనికి వెళ్లాలా చేసిన ప్రభాకర్, ఏంటి ప్రభా అవ్వన్ని పెళ్లి అయ్యాకే అని చెప్పా కదా,మరి ఇదేంటి అంది గాభరాగా,అదేంటి ఎందుకు గాభరా పడుతున్నావు,ఎలాగూ పెళ్లి చేసుకుంటాం కదా,అందుకే  కదా ఈ రోజు నిన్ను రమ్మని అంది.ఇక మనకి అడ్డు,అదుపు లేదు.ఇక ఈ రోజంతా మనదే అన్నాడు ప్రభాకర్,వద్దు ప్రభా మనం పెళ్లి చేసుకున్నాకే ఏదైనా అని చెప్పాను కదా,వద్దు నేను వెళ్లిపోతా అంటూ తలుపు వైపు నడిచింది సుప్రియ..

ఏంటే బతిమాలిన కొద్దీ బెట్టు  చూపెడుతున్నావు నేను ఏ ఆడ పిల్లకి ఇంత సమయం ఇవ్వలేదు.నీ ఒక్కదానికే ఇన్నీ రోజులు పట్టింది. నిన్ను అనుభవించడానికి ఇంతలా ఏదురు చూడాల్సి వస్తుంది అని అనుకోలేదు అంటూ సుప్రియ కొంగు పట్టి లాగాడు.వద్దు ప్రభాకర్,నన్ను వదిలేయి,నువ్వు మంచివాడివి అని అనుకున్నా,నన్ను పెళ్లి చేసుకున్నాకే ఇవ్వన్నీ అని చెప్పాను,దయచేసి నన్ను వదిలేయి అంటూ దండం పెట్టింది సుప్రియ…

హ హ ఏంటి ఇది నువ్వు నీ బావ మీద కోపం తో నాతో మాట్లాడుతున్నావు అని నాకు తెలుసు కాబట్టి నోరు మూసుకొని చెప్పినట్టు విను,నా చేతి లో పడ్డాక  దయ,జాలి అనేది లేదు.ఇప్పటికే చాలా ఆలస్యం అయ్యింది. నిన్ను వదిలే ప్రసక్తే లేదు.అంటూ సుప్రియ ను బలవంతంగా బెడ్ మీదకి తోసేశాడు. ఆమె ఎంత అరుస్తున్న వదలకుండా ఆమెని బలవంతంగా అనుభవించాడు. ఇవేవి తెలియని అర్జున్ గెస్ట్ హౌస్ బయట కారు దగ్గర నిలబడి,ఎదురుచూస్తున్నాడు సుప్రియ కోసం..

గంట తర్వాత ఏడుస్తూ,చిరిగిన బట్టలతో బయటకు పరుగెత్తు తూ వచ్చింది సుప్రియ.ఆమెని ఆ స్థితిలో చూసిన అర్జున్ ఏమి జరిగి ఉంటుందో ఉహించాడు. ఆమె వచ్చి కారు ఎక్కి కూర్చుంది.ఇంత జరిగినా ఆమె అహంకారం మాత్రం తగ్గలేదు.అర్జున్ ఏమి మాట్లాడకుండా,ఆ గెస్ట్ హౌస్ లోపలికి వెళ్ళాడు. అతను వెళ్ళేసరికి ప్రభాకర్ తాగుతూ కూర్చున్నాడు. అతని కాలర్ పట్టుకుని పైకి లేపి,కిందకి విసిరికొట్టాడు అర్జున్ ..

ఆ దెబ్బకు మూతి పగిలిన ప్రభాకర్ వద్దు,నన్ను కొట్టొద్దు,అని అంటూ అర్జున్ కాళ్ళు పట్టుకున్నాడు.దాంతో పద రా అని అంటూ అతన్ని కాలర్ పట్టుకుని బయటకు ఈడ్చుకుంటూ తీసుకుని వచ్చి,సుప్రియ కూర్చున్న వెనక సీట్ లో కుదేసి కార్ ను స్టార్ట్ చేసి ముందుకు దూకించాడు. అర్జున్ సరాసరి కారు ను ప్రభాకర్ తండ్రి ఇంటి ముందు ఆపేశాడు.

ప్రభాకర్  తండ్రి దగ్గరికి తీసుకుని వెళ్లి ,కాళ్ళ ముందు పడేసాడు,ఏయ్ ఎవరు నువ్వు,నా కొడుకుని ఎందుకు కొడుతున్నావు అని అడిగాడు కోపంగా,ఒరేయి నువ్వు చేసిన పని నా నోటి తో నేను చెప్పలేను,నువ్వు నీ తండ్రికి ఏం నచ్చ చెప్పుకుంటావో చెప్పుకో,నేను బయట ఉంటాను అని బయటకు వెళ్ళిపోయాడు అర్జున్…

ప్రభాకర్ తండ్రికి లోపల జరిగినదంతా చెప్పాడు.దానికి తండ్రి ఒరేయి చేసిన వాడివి చేసావు,ఆ పెళ్లి కూడా చేసుకుంటే బాగుండేది. ఆ సుధాకర్ అంటే ఎవరనుకున్నావు నెంబర్ వన్ కాంట్రాక్టర్,అతని కి ఉన్నది ఒక్క అమ్మాయి అతని ఆస్థి అంతా ఆ అమ్మాయికే వస్తుంది.వెధవ ప్రేమించిన వాడివి కాస్త ఆగి,పెళ్లి వరకు వస్తే అయిపోయేది,హ ఇప్పటికైనా ఏం మించి పోలేదు.పద వెళ్లి పెళ్లి చేసుకుంటాం అని చెప్పద్దాం అంటూ బయటకు దారి తీసాడు ,తండ్రి వెనకాలే బయటకు నడిచాడు ప్రభాకర్.

వారు రావడం చూసిన అర్జున్ వెళ్లి కార్ లో కూర్చోబోతు వెనక చూసాడు సుప్రియ కోసం ,అక్కడ సుప్రియ కనిపించలేదు.సుప్రియ అంటూ చుట్టుపక్కల చూసాడు. “”ఏంటి ఏమైంది అని అడిగాడు ప్రభాకర్ ఆందోళన గా,సుప్రియ కనిపించడం లేదు అన్నాడు అర్జున్ .అదేంటి నువ్వు తాను ఇద్దరూ ఇక్కడే కదా ఉన్నారు,ఇంతలో ఏమైంది అన్నాడు ప్రభాకర్ తండ్రి దివాకర్,నేను  కారు దగ్గరికి రాలేదండి,బయటే కూర్చున్నా,అన్నాడు అర్జున్,అయితే ఇంటికి వెళ్లి ఉంటుందేమో అన్నాడు ప్రభాకర్.”

అంత అవమానం జరిగిన తర్వాత ఇంటికి ఏ మొఖం పెట్టుకుని పోతుంది అని,సరే ముందు ఇంటికి వెళదాం పదండి అన్నాడు అర్జున్ ,ప్రభాకర్ని ఛీత్కారం గా చూస్తూ, తలా దించుకున్నాడు అర్జున్ అలా చూడడం తో ప్రభాకర్. అందరూ కలసి కారు ఎక్కారు సుప్రియ ని వెతకడానికి వెళ్తూ…

ఇంతకీ సుప్రియ ఎక్కడికి వెళ్ళింది ? . ఏ అఘాయిత్యానికి పాల్పడబోతుంది? .అర్జున్  సుప్రియని  కాపాడతాడా?  ,లేదా ? ప్రభాకర్ సుప్రియని పెళ్ళి చేసుకుంటా డా ?  చదవండి తదుపరి భాగం లో…….

————————— భవ్య చారు

Related Posts