గిరిజా కళ్యాణం మొదటి భాగం

హాయ్ అంది గిరిజ తెలియకపోయినా హలొ అన్నాడు అర్జున్  నా పేరు గిరిజ అండీనేను సాఫ్ట్వేర్ లో పని చేస్తున్నాను మీ వాళ్ళు వెళ్లి కలవమని చెప్పారు అందుకే ఇలా వచ్చాను అంది గిరిజ అర్జున్ కి ఏమి అర్థం కాలేదు ఏంటి మీరు మాట్లాడేది నాకేం అర్థం  కావడం లేదు అన్నాడు అయోమయంలో అదేంటి పెళ్లి చూపులని మీ వాళ్ళు  మనల్ని మాట్లాడుకోమని అన్నారు  అందుకె కదా నేను వచ్చింది అంది గిరిజ.

అవునా మరి నాకేమి చెప్పలేదు మా వాళ్ళు అన్నాడుఅవునా సరే చెప్పకపోతేo లెండి ఇప్పుడు మనం మాట్లాడుకుందాం అని అంది సరే మీ ఇష్టం అన్నాడు అర్జున్ నీ చూస్తూ హాబీస్ ఏంటి  అంది గిరిజ. నాకు రీడింగ్ అంటే ఇష్టం అని చెప్పాడు అవునా మరి మా వాళ్ళు ఏంటి అబ్బాయికి ట్రావెలింగ్ అంటే ఇష్టం అన్నారు అంది అనుమానంగా  లేదండి నాకు రీడింగ్ ఇష్టం అన్నాడు.

ఇంతలో ఒక వ్యక్తి అటు వచ్చి హే గిరిజ నేను ని కోసం అక్కడ చూస్తుంటే నువ్వు ఎక్కడ ఉన్నావ్ ఏంటి  అన్నాడు వచ్చిన వ్యక్తి  ఎవరు మీరు అడిగింది గిరిజ అదేంటి రోజు మన పెళ్లి చూపులు అని మీ వాళ్ళకు చెప్ప గా నిన్ను చూసేది నేనే అన్నాడు ఇంతకీ మీ పేరు అడిగింది గిరిజ నా పేరు కార్తిక్ అన్నాడు అతను.

అవునా అని అర్జున్ వైపు తిరిగి  సారి అండీ మీరిద్దరూ వేసుకున్న షర్ట్స్ ఒకేలా ఉండడం తో పోల్చుకోలేదు అంది అర్జున్ కి క్షమించమన్నట్టు గా సరే అండీ పొరపాట్లు జరగడం సహజమే కదా పర్లేదు నేను వెళ్తాను మీరు మాట్లాడుకోండి అని అంటూ మర్యాదగా నమస్కరించి వెళ్ళిపోయాడు అర్జున్.  

అదేంటి నువ్వు అతన్ని పెళ్లి కొడుకు అని అనుకున్నవా అలా అనుకుని ఏం మాట్లాడవ్ అతనితో అంటూ గుచ్చి గుచ్చి అడిగాడు కార్తీక్ లేదు నేను  మీరు అనుకుని జెస్ట్ హలొ అని అన్నాను  అంది గిరిజ తర్వాత వాళ్ళు మామూలు విషయాలు మాట్లాడుకుని   సంగతి ఫోన్ లో చెప్తాను అని చెప్పివెళ్లిపోయారు ఇద్దరూ…

*****

ఇంటికి వెళ్లిన గిరిజకు అర్జున్ రూపమే మదిలో మెదలసాగింది ఎంత అందంగా ఉన్నాడుపైగా రీడింగ్ హాబీ అంట చూడగానే తనకి నచ్చాడు పైగా ఎంత మర్యాదగా మాట్లాడాడు అదే ప్లేస్ లో  వేరే వాళ్ళు ఉంటే అల్లరి చేసేవారు .అతని రూపాన్ని మదిలోంచి తీయలేకపోయింది.

తల్లిదండ్రులు అబ్బాయి అదే కార్తీక్ విషయం అడిగారు నాకు కార్తిక్ వద్దు నాన్న అని చెప్పింది గిరిజ  ఎందుకు అన్ని బాగానే ఉన్నాయి గా అన్నారు వాళ్ళు అవును కానీ అతనికి అనుమానం అనే జబ్బు ఉంది జెస్ట్ నేను పొరపాటున ఇంకొకరితో మాట్లాడితేనే ఎన్నో ఆరాలు తీసాడు అతన్ని చేసుకుంటే జీవితాంతం అనుమానం తో నన్ను వేధిస్తాడు అతను వద్దు నేను ఇంకొకర్ని ప్రేమించాను తననే పెళ్లి చెసుకుంటాను  అని తల్లిదండ్రులకు చెప్పింది.

మరి అతనికి ఇష్టమేనా అని అడిగారు తల్లిదండ్రులు లేదు నేను ఇంకా తనకి చెప్పలేదు. అసలు అతను ఎక్కడ ఉంటాడో కూడా తెలియదు అంది గిరిజ.  తెలియని వాడితో ప్రేమేంటి అన్నారు వాళ్ళు. లేదు నాన్న తనని చూడగానే తానే నాకు భర్త అని అనిపించింది. అతని కోసం ఎన్ని రోజులైనా వెతుకుతా ,ప్రేమించేలా చేసుకుంటా అని గట్టిగా చెప్పడం తో తల్లిదండ్రులు ఏమి అనలేదు. కార్తిక్ వాళ్ళకి సంభందం వద్దు అని చెప్పారు.

*******

గిరిజ పెరు తెలియని అర్జున్ ని వెతకాలి అని అనుకుని, గబగబా లేచి రెడి అయ్యి, అక్కడికి అదే ప్లస్ కి వెళ్ళింది.అప్పుడు దాదాపు సమయం 11 గంటలు అవుతుంది. ఆ సమయంలో అక్కడ ఎవరూ లేరు, ఎవరో ఒకరిద్దరు తప్ప, గిరిజ తానూ వస్తాడేమో అని,ఎదురు చూస్తూ కూర్చుంది.అదొక కాఫీ షాప్ అక్కడ ఊరికే కూర్చోలేక ఒక రెండూ కాఫిలు తాగింది. అతని కోసం ఎదురుచూస్తూ కూర్చుంది…

ఇంతలో అక్కడికి ఒక జంట వచ్చి కూర్చుంది. వారిలోని అమ్మాయి గిరిజని గుర్తు పట్టి, హాయ్ గిరిజ నువెంటే ఇక్కడ ?, అది ఇంత ప్రొద్దున అంటూ పలకరించింది ఆ యువతి, హాయ్ సునీత , ఎలా ఉన్నావు? , అవును నువ్వు ఏంటి ఇక్కడ? , అంటూ తిరిగి ప్రశ్నించింది గిరిజ, ఏం లేదే మేము ఇక్కడికి వచ్చి సంవత్సరం అయ్యింది. కానీ ఆంటీ,అంకుల్ వాళ్ళు ఎలా ఉన్నారు.? అంటూ ఆగకుండా ప్రశ్నించింది సునీత..

అబ్బా అపవే వాగుడు కాయ,ఇంకా ఆ బుద్ధి పోలేదే నీకు, అప్పుడూ అంతే, నోరు తెరిస్తే చాలు , ఇక ఎవ్వరం ఆపేవాళ్లము కాదు, అంది గిరిజ,హ సరేనే, ఇక అపుతాలే కానీ, చూడు ఇదిగో ఇతను నాకు కాబోయే శ్రీవారు అంటూ అప్పటివరకు పక్కనే నిలబడ్డ వ్యక్తిని పరిచయం చేసింది సునీత.

నమస్తే అండీ నా పేరు శంకర్ , ఇదిగో మీ స్నేహితురాలు కి కాబోయే భర్త కాదు బలి పశువుని అన్నాడు నవ్వుతూ, యూ అంటూ అతన్ని కొట్టబోయినట్టు యాక్టింగ్ చేసింది సునీత. నమస్తే అండీ మీరు మా సునితని పెళ్లి చేసుకుంటున్నారు అంటే గుండె ధైర్యం ఎక్కువే ఉన్నట్టు గా ఉంది అందిబగిరిజ . హబ్బా నువ్వు కూడానా అంది సునీత.

అవునే మరి నీలాంటి వాగుడు కాయని భరించాలి అంటే ఆ మాత్రం గుండె ధైర్యం కావాలి, అవును కానీ ఎప్పుడే పెళ్లి ? అంది గిరిజ, హ ఇప్పుడు కార్డ్స్ ప్రింట్ అవుతున్నాయి, వచ్చే నెలలోనే నా పెళ్లి , నువ్వు ఒక వారం రోజుల ముందే రావాలి అంది సునీత. హ సరేలే కానీ ఆంటీ,అంకుల్ వాళ్ళు బాగున్నారా ? అంది గిరిజ.

అందరూ బాగున్నారు కానీ ముందు మనం ఒక కాఫీ తాగుతూ మాట్లాడుకుందాం , అని బేరర్ ని పిలిచి కాఫీ ఆర్డర్ చేశారు ముగ్గురూ,.

అవునే సుని నీది ఆరెంజ్ మారేజి నా , లవ్ మరెజినా అంది గిరిజ , దానికి పెద్దగా నవ్వుతూ రెండూనే అంది సునీత, అదేంటి రెండు ఎలా ?అంది గిరిజ, ఇయనగారు నన్ను ఒక ఫంక్షన్లలో చూసి, ప్రేమలో పడ్డారు అంట, ఆ సంగతి నాకు చెప్పకుండా ,మా అమ్మా వాళ్ళకి చెప్పారు.

వాళ్ళు ఒకే అనడం తో, నేను ఒకే అనక తప్పలేదు. ఇప్పుడు ప్రేమించుకుంటున్నాం,పెళ్లి అయ్యే వరకు అంటూ సుదీర్ఘంగా చెప్పి, ఊపిరి పీల్చుకుంది సునీత.అవునండి ఈ వాగుడు కాయని ఎలా ప్రేమించారు. అంది శంకర్ ని చూస్తూ గిరిజ,

ఎమోనండి,”ప్రేమ ఎప్పుడూ,ఎక్కడ , ఎలా పుడుతుందో చెప్పలేము.” అలాగే తనని చూడగానే, నాకు తానే లైఫ్ పార్ట్నర్ అని అనిపించింది. అందుకే తనకి చెప్పకుండానే , మా అమ్మా వాళ్ళని పంపించి, ఇలా పెళ్లి చేసుకుంటున్నా,అన్నాడు శంకర్.అవునా బలే కుదిరింది మీకు మీరేమో మాటలు రాని వారిలాఉంటే,అది మాత్రం వాగుతూనే ఉంటుంది. జీవితాంతం దానిని భరించాలి, తప్పదు అంది నవ్వుతూ..

అవును మీరు ఎలా స్నేహితులు ఇంతకీ అని అడిగాడు శంకర్, మేమా మాది చిన్నప్పటి స్నేహం లెండి, విజయవాడలో ఉన్నప్పుడు ఇద్దరం కలిసే చదువుకున్నాం, మా ఇల్లు కూడా పక్కపక్కనే ఉండేవి . దాంతో మా అమ్మా, వాళ్ళమ్మ ఇద్దరూ స్నేహితులు అయ్యారు. మేము కూడా కలిసే ఉండేవాళ్ళం, ఆ తర్వాత మా నాన్నగారికి హైదరాబాద్ బదిలీ అవ్వడం వల్ల ,దీన్ని వదిలి రాలేక తప్పలేదు.

కొన్ని రోజులు ఫోన్ లో మాట్లాడుకున్నాం,ఆ తర్వాత నేను కోచింగ్ కి వెళ్లడం తో, మాట్లాడలేకపోయా, దాని నెంబర్ కూడా మారిపోయింది. ఇన్ని రోజులకి మళ్ళీ ఇలా కలిసాము అంది గిరిజ. అయితే తన విషయాలు అన్ని మీకు తెలిసే ఉంటాయి. తన గురించి చెప్పండి అని అడిగాడు శంకర్. ఏముందండి తన వాగుడు వినడం తప్ప మనల్ని మాట్లాడనివ్వదు అది. అది మాట్లాడేప్పుడు మనం అడ్డుగా వచ్చామో ఇక అంతే, కోపం వస్తుంది. అంది గిరిజ. ఈ మాటల్లోనే కాఫీ రావడం, తాగడం కూడా అయిపోయింది..

ఇంతలా వారితో మాట్లాడుతున్నా, గిరిజ చూపంతా ఎంట్రెన్స్ దగ్గరే ఉంది. తన కళ్ళు, ఆటే చూస్తున్నాయి. నోరు మాత్రం వారితో మాట్లాడుతుంది.ఇది చూచాయగా గమనించిన సునీత తర్వాత మాట్లాడవచ్చు అని, అది ఎవరికోసమో ఎదురుచూస్తుంది. అని మనసులో అనుకుని , తాము వెళ్లడం మంచిదని భావించి, శంకర్ ని మోచేత్తో పొడిచింది, వెళదాం అన్నట్టుగా….,

సరే అండీ , మళ్ళీ ఎప్పుడైనా కలుద్దాం అని అంటూ, కుర్చీలోంచి లేచాడు శంకర్, అవునే చాలా పనులు ఉన్నాయి వెళ్ళాలి. అని అంటూ , తన ఫోన్ నెంబర్ ఇచ్చింది సునీత, గిరిజ కూడా తన ఫోన్ నెంబర్ ఇచ్చిoది.సరేనే అంటూ వారికి సెండాఫ్ ఇచ్చింది గిరిజ. వాళ్ల్లు వెళ్ళిపోయారు..

అప్పటి వరకు హడావుడి గా అనిపించిన ఆ ప్రదేశం ఒక్కసారిగా నిశ్శబ్దంగా మారిపోయింది. అప్పటికే సమయం అయిదు గంటలు అవుతుంది.ఇక తానూ ఎదురుచూసి లాభం లేదని,మళ్ళీ రేపు వచ్చి ఎదురు చూడాలి,లేదా దగ్గరలో ఉన్న ఆఫీస్ లో అయినా వెతకాలి అని అనుకుంది గిరిజ. ఇక అక్కడే ఉంటే షాప్ వాళ్ళు వెల్లగొడతారేమో అనుకుని, బిల్లు ఇచ్చేసి, ఇంటికి బయల్దేరిoది…

గిరిజ బయటకు వెళ్లిన రెండు నిమిషాలకు అదే కాఫీ షాప్ లోకి అడుగుపెట్టాడు అర్జున్. రెండు నిమిషాలు గిరిజ అక్కడే ఉంటే గిరిజ అర్జున్ ని కలిసేది. ఆ రెండు నిమిషాలు ముందుగా వెళ్లే సరికి అర్జున్ ని కలిసే అవకాశం లేకుండా పోయింది గిరిజకు..

******
అర్జున్ కాఫీ షాప్ లోకి వచ్చిన అర్జున్ గిరిజ కూర్చున్న స్థలం లోనే కూర్చుంటాడు.అక్కడ కూర్చోగానే అతనికి ఎదలో ఎదో ఫీలింగ్, తనకు సంభందించిన వారు ఎవరో అక్కడే కూర్చుని వెళ్లారు అనే భావన, అక్కడ వ్యాప్తిoచిన సుగంధ పరిమళం అతన్ని ఉక్కిరిబిక్కిరి చేసింది ఒక్క క్షణం. ఇంతలో బేరర్ రావడంతో కాఫీ ఆర్డర్ ఇచ్చాడు. బేరర్ నవ్వుతూ వెళ్ళాడు,ఎందుకు నవ్వుతున్నావ్ అని అడిగాడు అర్జున్…

ఏమి లేదు సర్ . ఇప్పటికే ఇలాంటి కా oబినేషన్ కాఫిలు ఆరు తెచ్చాను.అందుకే నవ్వు వచ్చింది అంటూ వెళ్ళిపోయాడు ఆ బేరర్, అవునా అని , అనుకుంటూ,అక్కడే కూర్చున్నాడు అర్జున్ ,కాఫీ తాగిన తర్వాత కొద్దీ సేపటికి అక్కడికి ఒక అమ్మాయి వచ్చింది. ఆ అమ్మాయిని చూడగానే, అర్జున్ లేచి ,ఎదురెళ్లి నవ్వుతూ పలకరించాడు.

ఆమె అతన్ని చూడగానే చిరునవ్వు తో ,ఇద్దరూ బయటకు వెళ్ళి , అక్కడ పార్క్ చేసిన బైక్ మీద అమ్మాయిని ఎక్కించుకుని వెళ్ళిపోయాడు అర్జున్. ఆ అమ్మాయి ఎవరూ ? ఇంతకీ ఈ అర్జున్ ఎవరు ?అతని గతం ఏమిటి ? ఇప్పుడు అర్జున్ గురించి తెలుసుకుందాo..

*********

తిమ్మవరం అనే గ్రామంలో రామయ్య, ఆదిలక్ష్మి దంపతులు ఉండే వారు. వారి తండ్రులు సంపాదించిన పొలాన్ని సాగుచేసుకుంటూ, ఆనందంగా ఉండే వాళ్ళు ,వారికి ఇద్దరు కొడుకులు, ఒక కూతురు , కొడుకులు ఇద్దరూ శ్రీహరి, రాం, కూతురు సునంద , శ్రీహరి కి పెళ్లి జరిగి అతనికి ఇద్దరు అమ్మాయిలే,ఇక రాం కు ఒక కూతురు, ఒక కొడుకు , సునందకు ఒక కూతురు, ఇద్దరు కొడుకులు. అందరూ ఒకే కుటుంబం లాగా ఆనందంగా సంతోషంగా ఉన్నారు. రాం కి ఒక కొడుకు అతనే మన అర్జున్….

అక్కడ ఉన్న పాఠశాల లో అందరి పిల్లలని వేశారు. చదువుకోవడం, కాకుండా మిగతా అన్ని పనులు చేసేవాడు అర్జున్ , అది చూసిన సునంద కూతురు సుప్రియ మమయ్యాలకు చెప్పేది, దాంతో రాం అర్జున్ ని బాగా కొట్టేవాడు. దాంతో అర్జున్ సుప్రియని బాగా ఎడిపించే వాడు. తనమీద కోపం తో ఒక రోజు ఆ పాఠశాల లో అందరూ వెళ్లే వరకు ఉండి,సుప్రియని మనం ఇద్దరం ఆడుకుందాం అని ఒక గదిలో నువ్వు అంకెలు లెక్కబెట్టు , నేనెల్లి దాక్కుంటా,అంటూ చెప్పి, గదిలో కళ్ళుమూసుకుని ఉన్న సుప్రియని చూసి, మెల్లిగా బయట గడియ పెట్టేసాడు అర్జున్.

ఎప్పుడూ తనని తండ్రి తో కొట్టించే సుప్రియ ఇక ఆ రాత్రంతా అక్కడే ఉండాలి అని అనుకుంటు, నిదానంగా ఇంటికి వెళ్ళిపోయాడు. ఇక సుప్రియ అంకెలు అయిపోగానే,అర్జున్ ని పట్టుకోవడానికి గది తలుపులు తీయబోయింది .కానీ అవి రాలేదు.దాంతో భయపడిన సుప్రియ చాలా సేపు అరిచింది,కానీ ఊరికి దూరంగా ఉన్న ఆ పాఠశాల వైపుగా ఎవరూ రాలేదు. అరిచి, అరిచి సొమ్మసిల్లి, ఆకలితో నీరసించి, అక్కడే పడిపోయింది సుప్రియ..

బడి వదిలి చాలా సేపు అవుతున్నా ఇంకా రాని కూతురి కోసం చాలా సేపు ఎదురుచూసి, చివరికి అన్నయ్య పిల్లలని తలో దిక్కున పంపించింది.అందరూ సుప్రియని వెతకడానికి అందరూ తలో వైపుగా వెళ్లారు. వారి హడావుడి చూసిన అర్జున్ కి భయం వేసింది. మెల్లిగా తల్లి వెనక నక్కి , తల్లి చెవిలో ఉన్న విషయం చెప్పాడు.

హరి బడవా , ఇది చేసింది నువ్వేనా , అలా చేయొచ్చ అంటూ ,అందర్నీ పిలిచి చెప్పింది విషయం, అందరూ గబగబా వెళ్లి గదిలో పడిఉన్నా సుప్రియ ని తీసుకుని వచ్చారు. దాదాపు పది రోజులు జ్వరం తో పడి ఉంది సుప్రియ.పాపం అర్జున్ కూడా సుప్రియ అలా పడి ఉండడంతో చాలా భయపడి, బాధ పడ్డాడు. ఆ పది రోజులుగా అర్జున్ కూడా సుప్రియని కనిపెట్టుకుని ఉండడంతో, అబ్బో మరదలు మీద ప్రేమ ఎక్కువగా ఉందని అందరూ సంతోషించారు..

********
కానీ కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు కాబట్టి బళ్ళు ఓడలు,ఓడలు బళ్ళు అవుతాయి. సునంద వాళ్ళు మామూలు గా ఉండే వారు. శ్రీహరి వ్యవసాయాన్ని నమ్ముకుంటే, వానలు పడక,పంటలు చేతికి రాక, బాగా దివాళా తీసాడు. రాం ఉన్న భూమిని అమ్మి జూదనికి బానిస అయ్యి, జూదంలో భూమిని పోగొట్టుకున్నాడు.

వారిద్దరి పరిస్థితి చూసిన తల్లిదండ్రులు గుండె పగిలి చనిపోయారు. అందరూ అ బాధలో ఉన్న సమయంలో సునంద భర్త నక్కజిత్తులు ప్రదర్శించి,వాళ్ళు ఉంటున్న ఇంటికి కూడా పత్రాలు చూపించి  ఇల్లు తీసుకున్నాడు. బావ మోసం చేసాడు అని గ్రహించే స్థితిలో వాళ్ళు లేరు. దాంతో ఇల్లు ఖాళీ చేయక తప్పలేదు. శ్రీహరి భార్య యశోద తెలివిగా తన పుట్టింటికి , తన భర్త తో సహా వెళ్ళిపోయి, అక్కడ చిన్న కిరాణా కొట్టు పెట్టుకున్నారు.

ఇక మిగిలింది రాం ఉన్న ఇల్లు, పొలం అన్ని పోవడంతో, ఉన్న ఊర్లో నే కూలీగా మారిపోయాడు. కానీ అతని భార్య రేణుక పూలు అమ్మిన చోట కట్టెలు అమ్మలేక , అక్కడ ఉండొద్దు అంటూ పోరు పెట్టి, పట్టణానికి వెళ్దాం అని భర్తని తీసుకుని బయల్దేరిoది.

*********

రాం దంపతులు పట్టణానికి వలస వచ్చి, ఒక దగ్గర చిన్న గుడిసె ని అద్దెకు తీసుకుని ఉంటారు. ఒక నాలుగు రోజుల తర్వాత రాం ఒక చిన్న కంపెనీలో గుమస్తాగా చేరాడు. ఇక తమ సంసారం గట్టు ఎక్కినట్టే అని భావించిన భార్య రేణుక ,అర్జున్ ని మళ్ళీ అక్కడి బడిలో వేస్తుంది.

కుటుంబం అంతా చెల్లాచెదురు అయ్యినందుకు రాం చాలా బాధలో ఉన్నాడు.కానీ పైకి ఏమి అనడం లేదు. రోజుప్యాక్టరీ కి వెళ్లి రావడంతో, ఉన్న దాంట్లో గుట్టుగా సంసారం లాక్కువస్తుంది రేణుక , భార్యను ,కొడుకును కష్టపెడుతున్న అనే మనోవ్యాధి అతన్ని కుచించుకు పోయేలా చేసింది. భార్య ఎంతగా నచ్చ చెప్పినా, తాను జూదం ఆడి,తప్పు చేసాను అని మదన పడుతూ ఉండేవాడు..

అర్జున్ పదవతరగతి పాస్ అయ్యాడు. ఇక ఇంటర్ లో జాయిన్ అవుదాం అనే తొందరలో ఉన్నాడు. అలాంటి సమయంలో ఒక పెద్ద తుఫాను వారి జీవితంలో రేపింది. ప్యాక్టరీ నుండి వస్తున్న రాం కు , ముందున్న లారీ గుద్దేసి వెళ్లి పోయింది. అటుగా వచ్చే అతని స్నేహితులు చూసి, అతన్ని దగ్గరలోని ఆసుపత్రికి తీసుకుని వెళ్లారు. కొందరు వచ్చి విషయాన్ని రేణుకకి చెప్పారు.అయ్యో భగవంతుడా అని ఏడుస్తూ వెళ్లారు..

ఆస్పత్రిలో అతన్ని చూసిన డాక్టర్ లు అతని వెన్నెముక దెబ్బతిందని,రక్తం బాగా పోయింది అని , అర్జంట్ గా ఆపరేషన్ చేస్తే బతుకుతాడు అని చెప్పాడు. దానికి పది లక్షలు అవసరమని , చెప్పడం తో, వారికి ఏమి చేయాలో అర్థం కాలేదు.

భర్తని ఎలాగైనా బతికించుకోవాలి అనే ఉద్దేశ్యం తో,రేణుక అర్జున్ ని పిలిచి , మేనత్త సునంద దగ్గరికి వెళ్లి ,విషయం చెప్పి , తీసుకుని రమ్మని అంది. అర్జున్ వెళ్ళాడు. ఆడపడుచు తన అన్న కి సహాయం చేస్తుంది అని భావించిన రేణుక ఆపరేషన్ చేయమని చెప్పింది. సరే డబ్బు ఎలాగూ వస్తుంది కదా ,అని డాక్టర్ లు ఆపరేషన్ థియేటర్ కి తీసుకుని వెళ్లారు…

అర్జున్ డైరెక్ట్ గా సునంద ఊరికి వెళ్ళాడు. మేనత్త దగ్గరికి వెళ్లి ఏడుస్తూ విషయం చెప్పాడు. సునంద ముందు బాధ పడి,వెళదాం అని రెడి అయ్యేంతలో ,భర్త వచ్చి విషయం ఏమిటి అని అడిగాడు. అర్జున్ ఉన్న విషయం చెప్పడంతో, సునందని లోపలికి వెళ్ళమని చెప్పి , అర్జున్ ని తీసుకుని బయటకి వచ్చాడు.

చూడు అర్జున్ మీ నాన్నని బతికించుకోవాలి అంటే నీకు పది లక్షలు కావాలి,కానీ నువ్వు చదువుకుని, ఉద్యోగం తెచ్చుకుని, నా బాకి తీర్చాలి అని అంటే దాదాపు అయిదు సంవత్సరాలు పడుతుంది. అప్పటికి ఇంకా వడ్డీ పెరిగిపోతుంది. అది నువ్వు తీర్చలేవు.కాబట్టి నేను నీ బాకి తీరే మార్గం చెప్తాను. నీకు ఇష్టం అయితే ఇదిగో ఈ కాగితాల మీద సంతకం పెట్టు, అని అంటూ కొన్ని కాగితాల మీద సంతకాలు తీసుకున్నాడు..

అర్జున్ కి ఆ కాగితాలు ఏమి కనిపించడం లేదు. కళ్ల ముందు తండ్రి రక్తం ఓడుతున్న దృశ్యం, తల్లి ఏడుపు కనిపించసాగింది.అందుకే క్షణం కూడా ఆలోచించకుండా ఆ కాగితాల మీద సంతకం చేసాడు అర్జున్.అప్పుడు నవ్వుతూ సునందని పిలిచాడు, సునంద గబగబా వచ్చింది.

పెట్టెలో నుండి పదిలక్షల రూపాయలు అర్జున్ చేతిలో పెట్టి, వేళ్ళు అల్లుడూ, తొందరగా వేళ్ళు అంటూ హడావుడి చేసాడు సుధాకర్. సునంద, అర్జున్ లు హడావుడిగా ఆ డబ్బుతో వెళ్లిపోయారు.వాళ్ళు వెళ్లిన తర్వాత ఆ కాగితాల మీద ఏమి రాస్తే బాగుంటుందో అని ఆలోచించసాగాడు సుధాకర్….

*******

ఇక ఇక్కడ రేణుక అర్జున్ కోసం ఎదురుచూస్తుంది. ఆపరేషన్ థియేటర్లోకి వెళ్లిన భర్త కూడా ఇంకా బయటకి తీసుకుని రాలేదు. అటూ,ఇటూ తిరుగుతున్న నర్సులని చూస్తుంటే ఆమెకి భయం వేయసాగింది.ఆమెకి ధైర్యం చెప్పేవాళ్ళు కూడా ఎవరు లేరు. దాంతో ఒక్కతే బిక్కు బిక్కు మంటూ, ఎదురుచూడసాగింది..

గంట తర్వాత డబ్బుతో , మేనత్త తో వచ్చిన అర్జున్ ని చూసి , గట్టిగా నిట్టూర్చింది రేణుక. సునందని చూడగానే ఏడుపు తన్నుకు వచ్చింది రేణుకకి. సునందని పట్టుకుని, ఏడవడం మొదలు పెట్టింది. ఇంతలో అర్జున్ వెళ్లి డబ్బులు కట్టి వచ్చాడు.వదిన ని ఓదారుస్తూనే సునంద అర్జున్ చేతిలో ఇంకో అయిదు లక్షలు పెట్టింది .ఖర్చులకు ఉంచుకోమని, మామయ్యకు చెప్పవద్దు అని అంది.

అత్తయ్య చెసిన సహాయానికి చేతులు ఎత్తి నమస్కరించాడు అర్జున్.ఇంకోగంట తర్వాత రాం ని చూడొచ్చు అని డాక్టర్లు చెప్పడం తో , అందరూ ఊపిరి పీల్చుకున్నారు..మాములు రూమ్ కి షిఫ్ట్ చేశారు అతన్ని అందరూ వెళ్లి చూసారు. డాక్టర్లు అతన్ని ప్రాణాపాయం నుండి తప్పించాం ,కానీ అతను జీవితంలో లేచి నడవలేడు అని చెప్పారు చల్లగా….

అర్జున్ తండ్రి బతికితే చాలని అనుకున్నాడు. కానీ అతని జీవితం అతని చేతిలోంచి జారిపోయింది అని గుర్తించలేకపోయాడు. ఇవేవీ తెలియని రేణుక భర్త బతికాడు అని సంతోషించింది. కానీ కొడుకు డబ్బు ఎలా తెచ్చాడు అని అడగలేకపోయింది..

అర్జున్ జీవితం ఎలా అతని చేతిలోంచి జారిపోయింది? సుధాకర్ ఆ కాగితాల మీద ఏమి రాసుకున్నాడు ? మేనత్త అర్జున్ ని ఎలా కాపాడింది.? సుధాకర్ కి అర్జున్ మీద ఉన్న పగ ఏమిటి ? ఎందుకు ? మంచానికి అంకితం అయిన తండ్రి తో వారి జీవితం ఎలా గడిచింది..? చదవండి తదుపరి భాగం లో …

 

 

 

 

 

 

పట్టణానికి వెళ్లిన రాం దంపతులు ఏం చేశారు? వారికి సరియైన ఉపాధి దొరికిందా ? లేదా ? అర్జున్ పరిస్థితి ఏమిటి ? చిన్న వయసులోనే విడిపోయిన అర్జున్ , సుప్రియలు మళ్ళీ కలిసారా ? లేదా ? దారులు వేరు అయిన అన్నదమ్ములు కలిసారా ? లేదా ? అన్నల పరిస్థితి కళ్లారా చూస్తున్న సునంద వారికి ఏ విధంగా సహాయపడిందా ? లేదా స్వార్థం చూసుకుందా ? విడిపోయిన వీరందరూ మళ్ళీ కలిసారా ? లేదా ?అనేది తరువాయి భాగం లో చదవండి…

 

 

 

 

 

 

ఇంతకి ఈ ఆరు నెలల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అంటే రెండో భాగం లో చదవండి…..

–  మీ భవ్య చారు

 

Related Posts