గుండె కబుర్లు !!

గుండె కబుర్లు !!

గుండె కబుర్లు !!

అది ఆకలితో అంగళార్చే సాయం సంధ్య
వాన ముసుర్లు ముసురుకొస్తున్న చీకట్లు ఊరంతా కమ్ముకొస్తున్న పేలవరాత్రి
మా నాయిన ఆ సాయంత్రం ఊరు ఊరంతా మా తిండికోసం తిరిగిన పిచ్చికుక్క,,,,,,,,
ఆకలి భూతం కోరలుసాచి కడుపు కుదిపేస్తూ ముఖం పీక్కుతినే రాత్రి,,,,,,,
మా నాయిన ఎడ్డీమాలోకమై లోకం విసిరే రాళ్ళు తూటాలై గుండెల్లో గుచ్చుకుంటూ ఈ ధరిత్రిపై అంతిమ రాత్రి,,,,,,,,,
మా నాయిన మాకేం పెట్టని అసమర్థ కుక్కనైతినని ఆకలి డొక్క వేలాడేసుకుని మమ్మల్ని ప్రేమగా నాకుతూ మూగకళ్ళ సంవేదనల ఆఖరి రాత్రి,,,,,,,,,,
మా నాయిన గుండెలు పాడే పాట లోకం రంది పాడుకున్న ఎవరికీ అర్థం కాని కళ్ళతో ఎండిపోయిన గద్గద ఎడ్డిరాత్రి,,,,,,,,,
ఆ ట్రాన్స్ఫార్మర్ పక్కన రోజు పడుకునే విగతజీవి మా నాయిన ,కళ్ళు మూసుకున్నా తెరుచుకున్న మనస్సు లోకం నైజం ఎరిగినా ,లౌక్యం తెలియని అమాయక ధన్యజీవి,,,,,,,,,,,,,
మా నాయిన మా అమ్మ ప్రేమికులట ఒకనాటి ముద్దుల పుత్రుడ నేను ,వట్టి మూర్ఖుడ నేను,,,,,,,,,,,,
మా కుక్కలను రాళ్లతో కొట్టే లోకంలో మృత్యువు ఎప్పుడా అని ఎదిరిచూసే కన్నీటి ఎద మాటున గూడుకట్టుకున్న బ్రతుకుపై ప్రీతి చంపుకోలేని జీవితాలు మావి,,,,,,,,,,,,,,,
ఆ రోజు అర్ధరాత్రి ఉరుములు మెరుపుల గాలివాన నేను మా అమ్మ దిగులు గూటిలో నిద్రిస్తున్నాం మా నాయిన ట్రాన్స్ఫార్మర్ పక్కన ఎలా ఉన్నాడో ఏమో అని అరచేతిలో ప్రాణాలతో గజగజ వణుకుతున్నాం అంతలోనే ఊరంతా కరెంటు పోయింది,,,,,,,,,
తూరుపు తెలతెల వారుతోంది ట్రాన్స్ఫార్మర్ వానగాలికి తగలబడి దాని పక్కన పడుకున్న కుక్క మా నాయిన కుక్క చచ్చిపోయిందని జనం ఈడ్చుకుంటూ ఊరవతల పాడుపడ్డ బావిలోకి తోసేశారు,,,,,,,,,,,,,
మా అమ్మ పిచ్చికుక్క అని రాళ్ళు విసిరిసిరి కొడుతుంటే నన్ను దగ్గరకు తీసుకుని గోముగా బుద్ధులు చెప్పి ఎటో సుదూరంగా వెళ్ళిపోయింది,,,,,,,,,,,,,,
ఏంది సారు నా ఫోటో తీశావా నేను మా అయ్యతాడికే అని తెలుసు కానీ ఓ కుక్క ట్రాన్స్ఫార్మర్ తగలబెట్టడం కాదు ఊర్లోని జనమంతా తగలబడాల,,,,,,,,, ఇవి సారు నా గుండె కబుర్లు,,,,,,,నమస్కారం సారు మీరు సల్లగుండాల !!

అపరాజిత్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *