"C_PLJ4CZpdxQ0": { "on": "visible", "vars": { "event_name": "conversion", "send_to": ["AW-10942541090/v-d1CN7kpM4DEKLa5-Eo"] } }

గుడి నేర్పిస్తుంది నమస్కారం.. బడి నేర్పిస్తుంది సంస్కారం

గుడి నేర్పిస్తుంది నమస్కారం.. బడి నేర్పిస్తుంది సంస్కారం

గుడి నేర్పిస్తుంది నమస్కారం..
బడి నేర్పిస్తుంది సంస్కారం..
బడిలో విధ్యాబుద్దులు..
గుడిలో భక్తి సుద్దులు..
ఎక్కడ ఏవి నేర్చినా అన్నీ మంచి..
విషయాలే!!
కానీ..
మనిషి మదిలో చెడు తొందరగా..
చేరుతుంది..
నేటి సమాజంలో జరుగుతున్న..
అన్యాయాక్రమాలు చూస్తూ ..
దేవుడు గుడిలోనే ఉంటున్నాడు..
బయటకు రాలేక..
ఇందుగలడందు లేడను సందేహం వలదన్నాడు ప్రహ్లాదుడు..
ఎందెందు వెతికినా అందందే కలడన్నాడు..
ఇప్పుడేమెా ఎక్కడున్నా ఈ అన్యాయాలను చూడలేక కళ్లు మూసుకుంటున్నాడు..
దేవుడున్నాడు!!
ఎప్పుడో చూసీ చూసీ..
మూడో కన్ను తెరుస్తాడు..
అప్పుడే ప్రళయం తాండవిస్తుంది!

ఉమాదేవి ఎర్రం..

గుడి నేర్పిస్తుంది నమస్కారం.. బడి నేర్పిస్తుంది సంస్కారం

Related Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *