గుమ్మా సాంబశివరావు(ఆధునిక తెలుగు కవి)

డా. గుమ్మా సాంబశివరావు సాహిత్యలోకంలో సుపరిచితులయిన సమీక్షకుడు, కవి, రచయిత, ఉపన్యాసకుడు. 2013 సంవత్సరానికి గాను ఉత్తమ అధ్యాపకునిగా ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఆయన్ను సన్మానించింది.

ఆయన 1-6-1958 తేదీన వేజెండ్ల, చేబ్రోలు మండలం, గుంటూరు జిల్లాలో జన్మించాడు. ఆయన తల్లిదండ్రులు – పార్వతమ్మ, ఐతమరాజు. ప్రాథమిక విద్య వేజెండ్లలో పూర్తిచేసి, ప్రాథమికోన్నత విద్య నారాకోడూరు, గుంటూరు జిల్లాలో జరిగింది. సంగంజాగర్లమూడి, గుంటూరు జిల్లాలో ఉన్నత పాఠశాల విద్యను అభ్యసించాడు. కాలేజీ చదువులనుహిందూ కళాశాల, గుంటూరు (1973-1978) మధ్యకాలంలో పూర్తిచేశాడు. స్నాతకోత్తర విద్య ఎం.ఎ. తెలుగు – నాగార్జున విశ్వవిద్యాలయం (1978-1980) అనంతరం పి.హెచ్.డి. కూడా నాగార్జున విశ్వవిద్యాలయం (1985) లోనే అన్నమాచార్య సంకీర్తనముల లోని వర్ణనలు అనే అంశంపై పరిశోధించాడు.

ఆంధ్రోపన్యాసకత్వం : 1981 సెప్టెంబరు నుండి 1988 జూలై వరకు సప్తగిరి కళాశాల విజయవాడ. 1988 ఆగస్టు నుండి, ఆంధ్ర లయోల కళాశాల, విజయవాడ ఉద్యోగం చేశాడు. తన పరిశోధక పర్యవేక్షణలో పది మంది విద్యార్థులు తమ ఎం. ఫిల్. సిద్దాంత వ్యాసాలు విశ్వవిద్యాలయానికి సమర్పించారు.

అవార్డులు
యు.జి.సి.కెరీర్ అవార్డు – తెలుగు జానపద ప్రదర్శన కళారంగం అనే ప్రాజెక్ట్ కు (1992-1995).
సెల్ ఫోన్ శతకానికి ఉత్తమ శతక రచన బహుమతి – నల్లజర్ల జగన్నాధ సాహితీ సమాఖ్య 2006.
నత్తవిలాపం పద్య ఖండికకు సాహితీ మిత్రులు మచిలీపట్నం వారి జాతీయ స్థాయి ప్రథమ బహుమతి – 2007.
ఆంధ్రప్రభ దినపత్రిక నిర్వహణలో జరిగిన పుస్తక సమీక్షల పోటీలో ప్రథమ బహిమతి – 2007.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉత్తమ అధ్యాపక అవార్డు [సెప్టెంబరు 5]] – 2008.

రచనలు-ముద్రితాలు
అన్నమాచార్య సంకీర్తనములలోని వర్ణనలు – 1990
ప్రాచీనాంధ్ర కవయిత్రుల స్త్రీ స్వభావ చిత్రణం – 1991
అన్నమయ్య (నవల) – 2000
సెల్ ఫోను శతకము – 2005
సాహిత్యం – సామాజిక చైతన్యం (వ్యాససంపుటి) – 2008

ముద్రణకు సిద్ధం
అన్నమయ్య భక్తిపద కవిత
జాషువా సాహిత్య సమీక్ష
సాహితీ సౌరభం
సూక్తి మాలిక.

వీరు 60 కి పైగా ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి, 9 దూరదర్శన్ కార్యక్రమాలు చేశారు. వీరు జాతీయ/రాష్ట్రస్థాయి సదస్సులలో 50 కి పైగా ప్రసంగా పత్రాల సమర్పించగా 5 అంతర్జాతీయ సదస్సులలో పాల్గొన్నారు.

వీరు 135 కి పైగా వ్యాసాలు వివిధ పత్రికల్లో ముద్రించబడ్డాయి,, 150 కి పైగా పుస్తక సమీక్షలు చేశారు.

మాధవి కాళ్ల
సేకరణ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *