గురుదేవో మహేశ్వరః
కని పెంచిన తల్లిదండ్రులే మనకు గురువులు. తల్లి మనకు మొదటి గురువైతే, ఆ తర్వాత తండ్రి మన గురువౌతాడు.
మనకు పాఠాలు చెప్పే గురువే దైవం. మనకు జ్ఞానం పంచేది గురువు. మనకు మంచిని నేర్పేది గురువే. గురువే దైవం
అని భావించాలి. మనం గురువును గౌరవించాలి. వారి ఆశీస్సులే మనకు వరం. గురువులను గౌరవించటం మన
సాంప్రదాయం. గురుదేవో మహేశ్వరః అనే భావన మనలో ఉండాలి. ఉపాధ్యాయ దినోత్సవం సెప్టెంబర్ 5 న జరుపుకుందాం.
మన గురువులను మనం సత్కరిద్దాం. వారి ఆశీస్సులు తీసుకుందాం. కంటికి కనిపించే దైవం గురువే. జ్ఞాన జ్యోతిని
వెలిగించేది గురువే. మన ఉన్నతిని కాంక్షించేది గురువే. గురువు సాక్షాత్తూ ఆ నారాయణుడే. అలాంటి గురువును స్మరించుకుంటూ గురువులందరికీ ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు. 🙏
వెంకట భాను ప్రసాద్ చలసాని