అక్షర కొరకు
అంశం :- ఉపాధ్యాయ దినోత్సవం(చిత్ర కవిత)
తేది:- 05/09/2026
కవితసంఖ్య:- 21
శీర్షిక:- గురువు దేవులకు వందనం
@@@@@@@@@@@@@@@@@
గురువు దేవులకు వందనం
గురువు పాదాలకు నమస్కారం
గురువే దైవం గురువే బలం
గురువే శక్తి గురువే ధైర్యం
అమ్మలా లాలించి నాన్నలా పాలించి
చేతికి బలపం ఇచ్చి వేలు పట్టుకుని దిద్దించే
అక్షరం ముక్క నేర్పి బ్రతుకు బాటను చూపే
అజ్ఞానం అనే చీకటిని తరిమికొట్టే
జ్ఞానం అనే వెలుగును నింపే
ఉన్నత శిఖరాలకు నడిపించే
సకల విద్యలను నేర్పి మార్గదర్శకులు అయ్యే
కోటి సూర్యుల వెలుగు వారి బోధన
సాధన చేసి విద్యార్థి జీవితాలను మార్చే
సన్మార్గంలో వారిని నడిపించే
కఠినమైన రాతి లాంటి మనిషిని
జ్ఞానపు ఉలితో చెక్కి
సమాజం మెచ్చే అద్భుత శిల్పంగా
మార్చగల ఏకైక మహోన్నత శక్తి గురువు
విద్యార్థి ప్రతి విజయానికి పునాది అయ్యే
ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా అందుకో గురువర్య! మీకు పాదభిందనలు…
డా. సరికొండ రమాదేవి
హామీ పత్రం :-
ఈ కవిత నా సొంతమని హామీ ఇస్తున్నాను..