గొడవ మొదలైంది…

అంశం:⁠- రారాజు
తేది:⁠- 17/10/2023
శీర్షిక:⁠- వీళ్ళ గొడవ మొదలైంది

                 “అమ్మ… ప్రతిరోజు వచ్చి ఏదో ఒక వంక పెట్టుకుని నిన్ను తిడుతూనే ఉంటాడు , కానీ నువ్వు మాత్రం నవ్వుతూ సమాధానం ఇస్తావ్ ఎందుకు అమ్మ?” అని అడిగాడు టింకు.
“మీ నాన్నకి నా మీద ఉన్న ప్రేమ నాన్న అంతే  తప్పించి , నా మీద కోపంతో ఏదో వంక పెట్టుకొని తిట్టడం లేదు” అని నవ్వుతో చెప్పింది కవిత.
“మరి నువ్వు కూడా ప్రతిరోజు తిడతావు కదా అమ్మ నాన్నని” అని అమాయకంగా అడిగాడు టింకు.
“మేమిద్దరం ఒకరిని ఒకరు అలా తిట్టుకుంటేనే మాకు రోజు గడుస్తుంది. భార్యాభర్తల మధ్యన ఇలాంటి గిల్లికజ్జాలు ఉంటేనే ఒకరి మీద ఒకరికి ప్రేమ ఎంత ఉందో తెలుస్తుంది” అని చెప్పింది కవిత.
“ఒకసారి మీరు నిజంగానే గొడవ పడినప్పుడు రెండు మూడు రోజులు మాట్లాడుకోరు కదా అమ్మ. అప్పుడు ఎలా తెలుస్తుంది మీ ఇద్దరికీ ఒకరి మీద ఒకరికి ప్రేమ ఉన్నట్టు?” అని మళ్లీ అమాయకంగా అడిగాడు టింకు.
“అప్పుడు ఒకరి తప్పులు ఒకరు చేసింది తెలుసుకుంటారు. మీ నాన్న మహారాజు కాకపోయినా ఆయనే నా రారాజు. నేను రాణిని కాకపోయినా ఆయన నన్ను మహారాణిలా చూసుకుంటున్నాడు” అని చెప్పింది కవిత.
“ఇప్పుడు అవన్నీ ఎందుకు నీకు ఒక మంచి కథ చెప్తాను. అవన్నీ నీకెందుకు రేపు నీకు పెళ్లి అయిన తర్వాత నీ భార్యని మహారాణిలో చూసుకో అంతే కావాలి ఏ ఆడపిల్లకైనా” అని చెప్పి టింకుకి అన్నం తినిపిస్తుంది కవిత.
టింకు కొంచెం సిగ్గుపడుతూ “పొమ్మా…” అన్నం తింటుండగా…
వెంకట్ వచ్చి ,
“ఏయ్ కవిత టవల్ ఎక్కడ?” అని అడిగాడు.
వెంకట్ అలా పిలవగానే పరుగున వెళ్లి టవల్ చేతికిచ్చి…
“ఏంటి మళ్లీ తాగావా? ఎన్నిసార్లు చెప్పాను తాగేసి ఇంటికి రావద్దు అని ముందు ఆ వెధవలతో స్నేహం చేయడం మానేయ్” అని కోపంగా చెప్పేసింది కవిత.
నా దోస్తులే వెధవలు అంటావే అని కోపంగా అరుస్తున్నాడు వెంకట్.
వీళ్లు ఇలా గొడవ పడడం చూసిన టింకు మళ్ళీ వీళ్ళ గొడవ మొదలైంది అని అనుకొని వెళ్లి పడుకున్నాడు.
ఒక గంట తర్వాత ఆప్యాయంగా దగ్గర కూర్చొని వెంకట్ కి వడ్డిస్తుంది కవిత.
వాళ్ళు ఇద్దరు సరదాగా కబుర్లు చెప్పుకోవడం చూసి టింకు ఆశ్చర్యపోయాడు.
వీళ్లు నాకు అర్థం కారు.
పిల్లలు చిన్నప్పుడు తల్లితండ్రులు ఎవరికి అర్థం కారు తల్లిదండ్రులు పిల్లలకి అర్థం కాదు ఎందుకంటే వాళ్లు ఎప్పుడూ గొడవ పడతారో తెలీదు , ఎప్పుడు వాళ్ళిద్దరూ కలిసిపోతారో తెలీదు.
వాళ్ళిద్దరి మధ్యన గిల్లికజ్జాలు అనే గొడవలు ఉన్నంతకాలం వాళ్ళు జీవితాంతం సంతోషంగా ఉంటారు.

మాధవి కాళ్ల.

Related Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *