గౌరారం – గౌరి
కొత్తగా టీచరు జాబ్ వచ్చింది దీక్షితకు.
సోమవారం వచ్చి జాయినింగ్ రిపోర్ట్ ఇవ్వాలన్నారు.
ఆ ఊరేమెా చాలా దూరం పైగా పల్లెటూరు ఆ ఊరికి
బస్సు సౌకర్యం లేదు..
జాబ్ వచ్చిందన్న సంతోషం కన్నా ఆ ఊరికి ఎలా పోవడం అన్న బెంగ ఎక్కువైంది?
నాన్న లేరు అమ్మ ఉన్నా రాలేని స్థితి తమ్ముడేమెా
హాస్టల్..
“ఇక నేనే వెళ్లాలేమెా! ఎలా?”
అమ్మా! నాకు జాబ్ వచ్చింది..
“ఎంత శుభ వార్త చెప్పావే?” ఇంత శుభవార్త అంత మెల్లగా, డల్ గా చెప్తున్నావు? అంది జానకమ్మ..
మరేం చేయమంటావమ్మా? జాబ్ రావడం సంతోషమే
కానీ ఆ ఊరు వెళ్లడమే ప్రాబ్లం.
“ఎందుకే?”
బస్సు సౌకర్యం లేదు పల్లెటూరు ట్రైన్ దిగి ఆరు కిలోమీటర్లు నడవాలి అందరం వెళ్దామా?
“ఎలా వెళ్ల గలమే?” ఇక్కడ రక్షితను చిన్నదాన్ని చూసుకోవాలిగా!
అవునమ్మా! అదీ నిజమే! అక్కడ అన్ని సౌకర్యాలు ఉంటవో? ఉండవో?
“ఇంతకీ ఎప్పుడు వెళ్లాలి?”
వచ్చే సోమవారం జాయిన్ కావాలి సో …నేను ఆదివారమే వెళ్లాలి..
సరేనే! వెళ్దువు గానీ అంటూ క్యాలెండర్ చూసి “అయ్యెా!! ఆదివారం అమవాస్య అవుతుందే ” అంది
అయితే ఏంటమ్మా? నేను అమవాస్య రోజే పుట్టాను గా! అంతా శుభమే జరుగుతుందిలే!
అన్నట్టే ఆ ఆదివారం అమవాస్య రాత్రి దీక్షిత ఒంటరిగా ట్రైన్ ఎక్కింది..
సరిగ్గా “12” గంటలకు ట్రైన్ బిస్తాపూర్ లో ఆగింది అక్కడి నుండి ఆరు కిలో మీటర్లు ప్రాయాణించి గౌరారం వెళ్లాలి గబ గబా లగేజ్ తీసుకుని దిగింది
దీక్షిత..
చుట్టంతా చీకటి ఒక్క స్టేషను లోనే లైట్లు వెలుగు తున్నాయి..
చుట్టూ చూసింది ఎవరూ దిగలేదేమెా! ఎవరూ కనిపించ లేదు..
లగేజ్ పట్టుకుని స్టేషను వైపు ఒక అడుగు వేసిందో! లేదో! ఏదో తెల్లటి ఆకారం సన్నటి తోకతో తన ముందు నుండి పోయినట్టు బలంగా గాలి ముఖం మీదకు వచ్చినట్టు అనిపించి ఒళ్లు జల్లు మంది..
ఏం లేదు ఏం లేదని తనకు తను ధైర్యం చెప్పుకుంది..
ధైర్యంగా ముందుకు వెళ్లి స్టేషన్ మాష్టారు రూంకి వెళ్లింది ..
“మాష్టారు నేను గౌరారం వెళ్లాలి ఎలా వెళ్లాలండి?”
అతను పడుకోవడానికి సిద్ద పడుతున్నాడు..
వెనక్కి తిరిగి “ఎవరదీ? గౌరారమా? ఇంత రాత్రా?”
అన్నాడు..
హా…అవునండి అక్కడి స్కూల్లో టీచరుగా జాబ్ వచ్చింది పొద్దున్నే జాయిన్ కావాలి అంది..
ఆడపిల్లవు ఇంత రాత్రి వెళ్లడం మంచిది కాదు కానీ
అక్కడో బల్ల ఉంది పడుకో! పొద్దున్నే వెళ్లొచ్చు అని
ఇంకో మాటకు అవకాశం ఇవ్వకుండా పడుకున్నాడు
ఇంతలో ఒక అందమైన అమ్మాయి వచ్చి ..
“మీరు గౌరారం వెళ్లాలా? నేనూ అటే వెళ్తున్నా! నాతో
వస్తారా?” రండి అంది..
ఇంకేం ఆలోచించకుండా ఆడపిల్లే కదాని తనతో బయలు దేరింది..
“ఎలా వెళ్దాం?”అంది బయటకు వచ్చాక..
నడుచు కుంటూనే!
“ఏంటీ అంత దూరం”అంది ఆశ్చర్యంగా!
అయ్యెా! ఈ చీకట్లో నా చేయి పట్టుకుని నడిస్తే మీకు
టైమే తెలియదు చిటికెలో వెళ్లి పోతాం!
“ఆరు కిలో మీటర్లు అలా ఎలా వెళ్తాం?”
చూద్దువు గానీ రా!
నాకే తప్పుగా తెలిసిందేమెా ! వద పద అంది ఉత్సాహంగా ఆ మాత్రం తోడు దొరికిందని..
అన్నట్టూ…ఆ..ఊర్లో నీకు రూం ఉందా?
లేదు వెతుక్కోవాలి అంది దీక్షిత..
నువ్వు నా చెల్లి లా ఉన్నావు నా రూం లో ఉంటావా?
హా…ఉంటాను నాక్కూడా అక్క ఉంది నీ లాగే..
అవునా! మనిద్దరం ఫ్రెండ్స్ అంది నవ్వుతూ..
దారిలో పెద్ద మంట కనిపించింది..
“ఉండు మా వాల్లంతా అక్కడున్నారు కలిసి వస్తా అంది”
సరే ! అని అక్కడే నిలుచుంది తనకెవరూ కనిపించడం లేదు..
ఈ చిక్కటి చీకటి లో చుట్టూ అడవి ప్రాంతం ఒక్క నిమిషం భయం వేసింది ..
అంత లోనే వచ్చేసింది ఆవిడ..
పద భయపడ్డావా? అంది వచ్చి..
మంచిగా కబుర్లు చెప్తూ కళ్లు మూసుకోమని ,తన చేయి పట్టుకోమని రివ్వున తీసుకు పోయింది..
కళ్లు తెరిచే సరికి వచ్చేసింది గౌరారం
ఇదే ఊరు ఇప్పుడు చూడు అందామె..
అసలేమైందో తెలియ లేదు ప్రయాణం చేసినట్టు లేదు కళ్లు తెరిచి…
“నీ పేరు ఏంటక్కా?” అంది..
“గౌరి” అంది తను..
నీతో ఒక పని ఉంది రా! ముందు ఊరు జమీందారు ను చూపిస్తా! తరువాత నా రూంకి తీసుకు పోతా!
జమీందారు ఇంటికి పోగానే “అక్కడ ఉన్న గ్లౌజులు
వేసుకో” అంది..
ఏదో మాయ కమ్మినట్టే చెప్పింది చేసింది దీక్షిత.
అంతే! తరువాతేం జరిగిందో తెలియదు..
తనని గౌరి రూంకి తీసుకొచ్చి దింపింది..
“ఇదే నా ఇల్లు నువ్వు ఫ్రీగా ఉండు” ఎంత కాలమైనా ఉండు నీ లాంటి, నాలాంటి ఎంతో మంది బాగుండాలని ఒక మంచి పని చేసాను
నాకిక విముక్తి దొరికింది అన్న మాటలు వినగానే కళ్లు
మూతలు పడ్డాయి..
తెల్లారి లేచాక స్కూల్ కి వెళ్లింది జాయిన్ అవడానికి
పిల్లలంతా స్కూల్ కి టీచరు వచ్చింది గౌరీ టీచరు లాగ అంటున్నారు..
“ఏది మరి ఆ టీచరు? “అంది దీక్షిత..
“చచ్చి పోయింది కదా” అని ఒకరంటే..
” కాదు చంపేసారు” అని ఒకరన్నారు
అంటే అవును రాత్రి నాకు హెల్ప్ చేసింది గౌరీ నేనా?
అంతలో ప్రిన్సిపాల్ వచ్చి” అవునమ్మా ఒక పాపాత్ముడు అంత మంచి టీచరును చంపాడు” “వాడు రాత్రి చచ్చాడట…”
ఇంకా షాక్ లోనే ఉంది దీక్షిత…
ఉమాదేవి ఎర్రం