చంపకమాల💐🪷
పలుచన చేయబోకుమయ పాలన చేసిన మాతృ భాషనే
చులకనగాను చూడకుము శోభను గూర్చిన వేద భాషనే
విలువలు లేవు లేవనుచు వెర్రిగ వాగుచు నాంగ్లమోజుతో
తెలుఁగునుఁ దల్లిగాఁ దలఁచి దించిరి వృద్ధుల యాశ్రమంబునన్!!
తేటగీతి!!
ఆంగ్ల భాషాభిమానమ్ము నావహించి
మాయలోకాన విహరించు మత్తులోన
వెలుగు రేఖలు నింపిన వేదభాష
తెలుగు తల్లి వృద్ధాశ్రమా దీనమయ్యె!!
గడ్డం కృష్ణారెడ్డి!! రేపాల సూర్యాపేట