చక్కటి పిల్ల..ఒక అబ్బాయి బాగా నచ్చాడు.

 

ప్రభ చక్కటి పిల్ల. కాకపోతే కాస్త లావుగా ఉంటుంది. డిగ్రీ పూర్తి చేసింది. సంబంధాలు చూస్తున్నారు. పిల్ల లావుగా ఉందని వంక పెడుతున్నారు. ఒక అబ్బాయి బాగా నచ్చాడు. లావు సమస్య అయినప్పుడు తగ్గించుకుంటే పోలా అని నిర్ణయించుకుంది. అంతే మర్నాటినుంచే ప్రణాళిక మొదలు పెట్టింది. వేపుడు కూరలు, పిండి వంటలు తినటం మానేసింది. ఇష్టం లేని సలాడ్స్ పళ్ళు తినటం మొదలు పెట్టింది. ఎక్కువగా నడవటం తేలిక వ్యాయామం
చేసింది. నెల రోజుల్లో నాలుగు కే. జీ లు తగ్గింది.

రెట్టించిన ఉత్సాహంతో కొనసాగించింది.

కూతురు పట్టుదల గమనించిన పట్టాభి గారు పెళ్లిళ్ల పేరయ్య ని కలుసుకుని విజయవాడ దగ్గర సంబంధం గురించి విచారించారు. “వాళ్ళకి కూడా మీసంబంధం నచ్చిందండి. అమ్మాయి లావుగా ఉందని వెనకాడారు అంతే”అన్నాడు.

“ఇప్పుడు ఆ అడ్డంకి పోయింది కదా. అమ్మాయి సన్నగా అయింది. వాళ్ళని ఎట్లా అన్న ఒప్పించి తీసుకురండి. మరోసారి చూసుకోమని చెప్పండి “అన్నారు ప్రాదెయపడుతూ.

మరుసటి నెలలో మంచి ముహుర్తాలు ఉండటంతో పెళ్లికూడా జరిగి పోయింది.
“నన్ను సన్నగా ఉండాలని మీరేంటి సార్ లావుగా అయ్యారు “అంది వేళాకోళంగా.
“నీకు మాచింగ్ గా నేను లావుగా ఉండాలని “అన్నాడు పెళ్ళికొడుకు అంతకంటే వేళా కొలంగా.
వివాహానికి కావలిసింది మంచి మనసు గాని మనిషి లావు సన్నం కాదు “అంది ప్రభ
“నిజమే “

Related Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *