చరణ్ రాజ్ ఒక్కడే ఆ ఊర్లో …

చాలా కాలం క్రితం ప్రతిఘటన
సినిమా చూసాను.

ప్రతిఘటన సినిమాలో చరణ్ రాజ్ ఒక్కడే ఆ ఊర్లో ఉన్న జనాలను చాలా
ఇబ్బందులు పెట్టారు.

అతను చేసిన అరాచకాలకు బలయి
పోయిన ప్రజలంతా కలిసి ఆ
చరణ్ రాజుకు వ్యతిరేకంగా
ప్రతిఘటన చేసారు. మహిళలు
కూడా ప్రతిఘటన చేసారు.
ఆ సినిమా చూసిన చాలా
మంది ప్రభావితం అయ్యారు.
అది సినిమా వరకే పరిమితం
అయ్యింది. ఇప్పుడు చాలా
మంది చరణ్ రాజ్ లు మన చుట్టూ ఉన్నారు. నేటి ప్రజలు
మాత్రం వారి అరాచకాలను
చాలా సహనంగా భరిస్తూ
వారి అడుగులకు మడుగులు
ఎత్తుతూనే ఉన్నారు. ఎవరూ
ఆ అరాచవాదులను ఎదిరించే
ధైర్యం చెయ్యటం లేదు. కనీసం
తమ అభిప్రాయాలను చెప్పే
ధైర్యం చేయటం లేదు. మన
సమాజంలో చైతన్యం తగ్గింది.
ప్రజల మనసుల్లో చైతన్యం, ధైర్యం నింపే ప్రయత్నం మన
రచయితలే చెయ్యాలి. తమ
అభిప్రాయాలను చెప్పగలిగే
ధైర్యం ప్రజలకు ఇవ్వాలి. ఆ
ధైర్యం మనిషి మనిషికీ కావాలి.
అది పంచే ప్రయత్నం మనమే
చెయ్యాలి.
నా రచన
వెంకట భానుప్రసాద్ చలసాని

Related Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *