చరిత్రలో నీకొక పేజీ..నమ్మకం అనే కలం

అంశం:⁠- చరిత్రలో నీకొక పేజీ

శీర్షిక:⁠- నమ్మకం అనే కలం

ఎందరో మహానుభావుల గురించి మనం ఇప్పుడు తెలుసుకుంటున్నాము. మన పుట్టుకకు కారణం ఏంటో? మన అడుగు ఎటు వేయాలో? మన లక్ష్యం ఏంటో? అని తెలుసుకోవడానికి కొంచెం టైం అయినా పడుతుంది.
అలాగా మనం ఏదో ఒకటి సాధించి చరిత్రలో నీకు ఒక పేజీ ఉంటే భావితరాలు వాళ్ళు నీ గురించి తెలుసుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటారు నువ్వు ఏం చేసావు? నీ చరిత్ర ఏంటి అన్నది?
కానీ ప్రతి మనిషి పుట్టుకకి ఏదో ఒక కారణం మాత్రం ఉంటుంది. అది ఏంటి అని ఎవ్వరూ చెప్పలేము.

జీవితమే మనకు చెప్తుంది కొన్ని కష్టాల ద్వారా పాఠాలు నేర్పుతూ ఎటువైపు అడుగులు వేయాలో చెప్పుతూ ఏదీ చెడు ఏది మంచి అని తెలుసుకునేలా చేస్తూ చరిత్రలో మనము స్థిర స్థాయిగా మిగిలిపోయేటట్టుగా చేస్తుంది.

భావితరాలకు ఒక మార్గదర్శకంగా మనం నిలిచేలా చేసుకోవాలి.
చరిత్రలో నీకు ఒక పేజీ ఉంది అని ఉంటే మాత్రం నువ్వు పడిన కష్టం కష్టసుఖాల నుండి విజయం సాధించేవరకు భావితరాలు వాళ్ళకి తెలిసేలా వాళ్ళం అవుతాము.
భవిష్యత్తు మీద కలలు కనడం విజయం సాధించిన తర్వాత వచ్చిన ఆటుపోట్లను తలుచుకుంటే చిన్నవిగా అనిపిస్తాయి.

ఒక అమ్మకి తన పిల్లలే ప్రపంచం,
ఒక అమ్మాయికి చదివే ప్రపంచం
ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్రపంచం ఉంటుంది ఆ ప్రపంచంలో అక్షరంతో అడుగులు వేసే వారు కొందరైతే. కొందరు కవులుగా మారి ప్రజల ఆరాధన పొందుతారు.

ఒక కవిగా కవితకి ప్రాణం పోసి ఎలా రాస్తాడు అలాగే ప్రజల్లో చైతన్యం తేవడానికి కూడా కథలు కవిత్వాలు ఉపయోగపడతాయి.

మనలో ఉన్న నైపుణ్యం ఉంటే ఏదైనా సాధించగలం అనే నమ్మకం ఉంటే చాలు.
చరిత్రలో నాకు ఒక పేజీ ఉంటుంది.

ఇలాంటి విజయాలు ఎన్నో సాధించాలని లక్ష్యంగా చేసుకొని పేరు రావాలి అనుకుంటూ నమ్మకం అనే కలంతో జీవనం సాగిస్తున్నాను.

 

Related Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *