చల్లని సాయం సంధ్యన…స్నేహంగా…

మాకై వస్తున్నావు…!!!

చల్లని సాయం సంధ్యన


అలలపై కడలి రాగాన్ని వింటున్నావు
పోరులేని పొందికలతో నీలో ఎన్నో
యదార్థాలు దాగున్నా…!!
నిదరోయే సమయానికి నింగి నుంచి
మత్తు మంచును చల్లుతు జగతికి
వెన్నెల పరుపులను పరుస్తావు
స్నేహంగా…

నిండిన హృదయంతో….
ప్రకృతి లాలనకు మధురాన్ని నింపుతు
కలబోసుకొన్న జలక్రీడల ఉవ్వెత్తులను
తాగుతు…అభ్యాసాల ప్రక్రియలతో
నీలోకానికి నియామకుడవు…!!
నీకై నడిచినా దొరకవని తెలుసుకున్న
మా మనస్సులకు దాచని గుణం
దర్పణమై పూర్ణీభావాల వెలుగును
పంచుతున్నావు ప్రేమగా…

పిలిచినా పలకని నీ నైజం
పద కవితలకు దారవుతు దొరలిన
ప్రతి వర్ణన మనుషుల మానవత్వాన్ని
నిలుపుతు…
చూరగొన్న అంశాలు మా తరతరాలకు పలుకుబడులుగా పంచబడుతు…!!
మునిగిపోని నిలువెత్తు ప్రామాణికాలకు
రూపమై నీలోని భావసుందరాలను
ఒలకబోస్తున్నావు ఆప్యాయతగా…

త్యాగ మూర్తివా
జ్ఞాన సందేశానివా…పొదుగేసిన
విశాల సముదాయంతో అనుక్షణాన్ని
రూపకల్పన చేస్తు అనుదినాన
కదిలే సాక్ష్యాలకు దిశా నిర్ధేశానివా…!!
తలచిన భావం నీరూపంతో
చల్లబడాలని నిశీరాత్రులను దాటేస్తు
గ్రహణం పట్టినా కరుణను వీడకా
మాకై వస్తున్నావు అభ్యుదయ వాదిగా…

దేరంగుల భైరవ

Related Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *