చిత్తరంజన్

చిత్తరంజన్

చిత్తరంజన్

చిత్తరంజన్ (లలిత గీతాలు రచయిత, సంగీత దర్శకుడు, ఆకాశవాణిలో స్వరకల్పన)

మహాభాష్యం చిత్తరంజన్ (1938 ఆగస్టు 25 – 2023 జూలై 21) ప్రముఖ లలిత గీతాల రచయిత, సంగీత దర్శకుడు. ఆయన ఆల్ ఇండియా రేడియోలో చాలాకాలం పనిచేశాడు. ఆకాశవాణిలో ప్రసారమైన అనేక లలితగీతాలకు స్వరకల్పన చేశాడు.
ఎనిమిదేళ్ల వయసు నుంచి నిజాం ప్రభుత్వ హయాంలోని దక్కన్‌ రేడియోలో పాడటం మొదలుపెట్టిన ఆయన ఆరు దశాబ్దాలకు పైగా లలిత సంగీతానికి సేవలందించాడు. 1972లో ఆలిండియా రేడియోలో ‘ఏ’ గ్రేడ్‌ గాయకుడిగా గుర్తింపు పొందాడు. 2008లో ఆంధ్రప్రదేశ్‌ సాంస్కృతిక మండలి ఆయనను కళారత్న బిరుదుతో సత్కరించింది.

రచనలు
ఇతడు వెలువరించిన పుస్తకాలు:
లలిత సంగీతం: 80 సంగీత సారస్వత మలయమారుతాలు
లలిత సంగీత సౌరభం
శ్రీ చిత్తరంజనం: కీర్తనలు, లలిత భక్తి గీతాలు, మంగళహారతులు.

ఇతడు స్వరపరచిన లలిత గీతాల జాబితా:
నదీసుందరి సుధాస్యందిని దేవులపల్లి కృష్ణశాస్త్రి మహాభాష్యం చిత్తరంజన్ 1957లో రచించారు ఈ పాట
చూచే కొలదీ సుందరము బోయి భీమన్న మంగళంపల్లి బాలమురళీకృష్ణ 1988లో ఈ మాసపు పాట – ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం
చూచేకొలదీ సుందరము డా.బోయి భీమన్న కె.బి.కె.మోహన్ రాజు.

85 ఏళ్ల మహాభాష్యం చిత్తరంజన్‌ 2023 జూలై 21న హైదరాబాద్‌లో కన్నుమూశారు. ఆయన భార్య డా.పద్మిని, పెద్ద కుమార్తె విజయలక్ష్మి దేశికన్‌, రెండో కుమార్తె వందన పవన్‌ గతంలోనే మృతిచెందారు.

మాధవి కాళ్ల

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *